• Tera Naam Ek Sahara
  • fb
  • Share on Google+
  • Pin it!
 • తేరా నామ్ ఏక్ సహారా?!

  Tera Naam Ek Sahara

  Author:

  Publisher: Palapitta Books

  Pages: 71
  Language: Telugu
  Rating
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  '3/5' From 2 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 premium votes.
Description

‘‘వద్దన్నారు. నీకూనాకు అసలు కుదరదన్నారు ఇక ముందెప్పుడూ నన్ను కలవకూడదని కూడా చెప్పారు....’’ కన్నీళ్లు మిగలని పొడికళ్లతో చెప్పింది.

సవరించుకుంటే సరయిపోయే జీర కాదు తనగొంతులో.

గాలి విసురుకి బెదిరి తొలిగే తెరా కాదు మా మధ్య.

‘కొండంత నమ్మకంతో ఎందుకురా భారతీ నన్నీ పరీక్షల కోతకి గురిచేశావ్‌... ఎందుకు? ఇప్పుడా పిచ్చి నమ్మకం కొండెక్కిపోయింది. తీరాలకి తీపిబాసలు చేసి, కొలనుకి తామర జ్ఞాపకాలు మిగిల్చిపోయే వలసపక్షుల వీడ్కోలు గీతాల చర్విత చర్వణంలో ‘మళ్లీ వస్తామ’న్న నిబద్ధచరణ మొకటి ఉండనే ఉంటుంది. కానీ, నువ్వు తిరిగొస్తావన్న భ్రమలు కూడా లేకుండా ఎందుకిలా పరీక్ష శిక్షల పాలపడేశావ్‌. ఎం...దు...కు...’ అనాలనుకున్నాను. కానీ, స్వాభిమానాన్ని పిపీలికం చేసేంత ఎత్తుకు ఎదిగిన ప్రేమ వల్ల పూడుకుపోయిన నా గొంతులోంచి ఒక్క అక్షరమూ పలకలేదు. ఎంత దూరమో... అంతకంత చేరువైన భారతి, నా ఎద ఘోష వినడంలో అక్షరాన్ని కూడా పొల్లుపోనీయలేదు. తన నిస్సహాయతకి క్షమాపణలు చెబుతూ చేయి చాచింది, నిక్కి చూస్తున్న ఎన్నో జతల కళ్లని నిర్లక్ష్యిస్తూ. రెండడుగులు వెనక్కివేశాను. అలిగి మాత్రం కాదు. తన తొలి స్పర్శే చివరిదై ఒక ఎడబాటు కరచాలనంగా మిగలడం ఎంతమాత్రం ఇష్టంలేక.

Preview download free pdf of this Telugu book is available at Tera Naam Ek Sahara
Comment(s) ...

ఎవరి రివ్యూలు, ముందుమాటలూ, వెనుక మాటలూ చదవకుండా దీన్ని చదివా.
మొదట ప్రతివాక్యంలో వున్న సిమిలీలు గడాగడా చదివే నా అలవాటుకు పదే పదే బ్రేకులు వేస్తుంటే మరీ ఇంతగానా అని విసుగు వచ్చింది.
అయితే ఆ తర్వాత అందులో లీనమయిపోయా.. చివరికంటా చదవకుండా మనసాపుకోలేకపోయా. తను అనుభవంచకుండా ఇలా రాయడేలని దృడ నిశ్చయానికి వచ్చా. చివరలో తెలిసింది అది తన కథే అని. అప్పుడు మరింతగా హృదయం నీరయిపోయింది.
అద్భుతమైన కథనం. ప్రతివాక్యమూ ఓ కవిత్వం. ఎన్నని వాక్యాలు అండర్‌లైను చేసుకోను, పుస్తకమంతా అవే అయితే!
కినిగెలో eBook చదివా. కానీ అసలు బుక్కు తెప్పించుకొని మన అలమరాలో వుంచుకోవాల్సిన పుస్తకం.
కథ సామాన్యమైందే .. అయితే భావాలను వెలిబుచ్చిన తీరు, గాడత.. వావ్ అది ప్రేమ కథా గానం!...