-
-
జియస్టి గైడ్
GST Guide
Author: Dr.K.Kiran Kumar
Publisher: Sri Vaibhava Publications
Pages: 160Language: Telugu
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అతి పెద్ద సంస్కరణల్లో GST ఒకటి. 1994 తర్వాత జరిగిన ఆర్థిక సంస్కరణలో అతి ముఖ్యమైన ఘట్టం GST.
‘ఒకే జాతి, ఒకే పన్ను ఒకే మార్కెట్’ అన్న నినాదంతో వెలువడిన GST ప్రయాణంలోకి మరలిపోదాం రండి.
ఈ GSTని ప్రసుతం ప్రపంచంలో సుమారు 150 దేశాలు అనుసరిస్తున్నాయి. బ్రెజిల్ ఈ GSTని అనుసరించిన మొదటి దేశం. ఆ తర్వాత చాలా దేశాలు ఈ GSTఅడుగుజాడలలో నడవడం మొదలు పెట్టాయి. ఆ సంప్రదాయం కొనసాగి నేడు మన దేశం కూడా అనుసరించేదాకా వచ్చింది. ఫలితంగా భారత దేశ వ్యాపార సామ్రాజ్యం రూపు రేఖలు సమూలంగా మార్చే ఆర్థిక సంస్కరణకు దారితీయబోతోంది.
ప్రస్తుతం దేశంలో తయారైన వస్తువులు రాష్ట్రాల్లో అమ్మాలంటే ఆ వ్యాను ఆ రాష్ట్రంలో లేదా పట్టణంలోకి ప్రవేశం చేస్తే చాలు, ఎంట్రీ లేదా అక్ట్రాయ్ పన్ను పడుతుంది. అలా ఎన్ని పట్టణాలలోకి ప్రవేశిస్తే అన్నిసార్లు ఈ ఎంట్రన్స్ లేదా అక్ట్రాయ్ పన్ను వస్తువుల మీద పడి రేట్లు పెరుగుతున్నాయి. GST ఆగమనం తర్వాత ఈ ప్రవేశ పన్ను లేదా అక్ట్రాయ్ పన్ను కనుమరుగైపోతుంది.
నిజానికీ ఆదాయపన్నుని సరిగ్గా పట్టుకొని రాబట్టుకోవడానికి ఈ GSTని ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే GSTలో ప్రతి బిల్లుని నిర్వహించాల్సి ఉండటం వల్ల ఆదాయపన్నుని అంచనా వేయడంలో ఎంతో ఉపకరిస్తుంది. అంటే ప్రత్యక్ష పన్ను అయిన ఇన్కంటాక్స్ని పట్టుకోవడానికి పరోక్ష పన్ను అయిన GST ఉపకరిస్తుంది.
GSTపై తెలుగులో వెలువడిన అతి తేలిక పుస్తకం ఇది. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా GST మీద పుస్తకం రాయడం కత్తి మీద సాములాంటిది. అలాంటి ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అయిందో మీరే చెప్పాలి.
- పబ్లిషర్స్
- ₹129.6
- ₹129.6
- ₹108
- ₹135.6
- ₹60
- ₹72
- ₹129.6
- ₹129.6
- ₹108
- ₹135.6
- ₹60
- ₹72
How to purchase this book tell me sir....
Please addres How Can I subscribed or purchase this book
how many pages this book
why is table of contents not provided in this book?