దుమ్ముతెరలు రేపుతూ దూసుకువచ్చింది ఆ జీపుకారు. సడన్ బ్రేకుతో చింతచెట్టు దగ్గర ఆగింది. ఎగిరి కిందికి దూకారు అందులో ఉన్ననలుగురు పర్సనాలిటీలు. పెద్దపెద్ద అడుగులతో చెట్టుకు ఆరుఅంగల దూరంలో ఉన్న చిల్లరకొట్టు దగ్గరకు పోయారు.
చెన్నకేశవులు నడిపే కొట్టు అది. చార్మినార్ సిగరెట్టు పాకెట్ల దగ్గరినుంచి సిరిసిపాలెం చింతపండుదాకా ఎటువంటి సరుకు కావాలన్నాఖచ్చితంగా దొరికే దుకాణం.
"ఏంది బాబులూ, ఏం కావాల?" విసురుగా వచ్చిన ఆ పర్సనాలిటీలను చూసీ చూడగానే వినయంగా, వినమ్రంగా, మర్యాదగా అడిగాడు అతను.
"ఆరడుగుల ఎత్తుంటాడు. గడ్డం పెరిగి ఉంటుంది. ఒంటిమీది చొక్కా మాసిపోయి మరకలు పడి ఉంటుంది. మోకాళ్ళ దగ్గర చిరిగిపోయిన ప్యాంటు, ఇటుగా ఏమైనా వచ్చాడా?" అని అడిగింది ఒక పర్సనాలిటీ.
ఆశ్చర్యపడలేదు చెన్నకేశవులు. ఆళ్ళగడ్డ బిడ్డడు అతను. అయినదానికి కానిదానికి అనవసరంగా ఆత్రుతపడే ఘటం కాదు.
"మా ఊళ్ళో వాళ్ళల్లో మూడొంతుల మంది ఆరు అడుగుల ఎత్తే ఉంటారు. పది పదిహేనుమంది ఈ మధ్యన గడ్డాలు కూడా పెంచుతున్నారు. చిరిగిపోయిన ప్యాంట్లు, మరకలు పడిన చొక్కాలు వేసుకు తిరిగే రకాలు మాత్రం కాదు" నిబ్బరంగా అన్నాడు.
This novel was published in navya weekly for about an year. Every week i used to wait for this. Excellent book and typically madhu babu sir style.. loved reading it.
Nice one... time pass... typical madhubabu style... enjoyed the reading
Vishnu
Pls enable rent option for this book.
Please upload vetti part 2 also sir