-
-
మెగాస్టార్ చిరంజీవి సినిమాకు కథ
Megastar Chiranjeevi Cinemaku Katha
Author: Vijayarke
Publisher: Manrobo Publications
Pages: 59Language: Telugu
సుప్రసిద్ధ దర్శకుడు రచయిత నిర్మాత విజయ బాపినీడు తెలుగు తెరకు వెలుగునిచ్చే ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చాడు..మెగాస్టార్ కు మెగాహిట్స్ ఇచ్చాడు...తాను స్వయంగా మంచి రచయిత.బొమ్మరిల్లు విజయ పత్రికలకు సంపాదకుడు....మెగాస్టార్ చిరంజీవికి కథలు కావాలని రచయితలను ఆహ్వానించాడు.
అపుడు నేను రాసిన ఆ కథను .విజయ బాపినీడు గారికి పంపించగా ఎంపికైన కథను యథాతథంగా ఇప్పుడు "చిరంజీవి సినిమాకు కథ"పేరుతో పుస్తకరూపంలో మీ ముందుంది.
ఇప్పుడైతే ఆ కథకు మిస్టర్&మిస్టర్ అని పేరు పెట్టేవాడిని....చిరంజీవి ఇమేజ్,స్టామినా...ఆయన పోషించే పాత్రల్లోని ఔచిత్యం..ధీరోదాత్తత ఈ కథలో ఫోకస్ చేశాను..నాకు తెలిసి మెగాస్టార్ చిరంజీవి మెజీషియన్ పాత్ర ఇప్పటివరకూ పోషించలేదు..మిల్ట్రీ ఆఫీసర్ గా,.మెజీషియన్ గా రెండు విభిన్నమైన బ్యాక్ డ్రాప్స్ లో తీర్చిదిద్దిన ఈ కథలో వాణిజ్య అంశాలే కాకుండా,పిల్లలు చూడగలిగే చిత్రంగా...హీరో పాత్రను ఎలివేట్ చేసే విధంగా దేశాన్ని కాపాడే గొప్ప శక్తిగా స్క్రిప్ట్ ను తయారుచేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాను...
చిత్రమేమిటంటే నేను ఈ కథలో చర్చించిన పాకిస్థాన్ అంశం ఇప్పటికీ అలానే బర్నింగ్ టాపిక్ గా వుంది...
ప్రజాజీవితంలోకి ప్రవేశించిన మెగాస్టార్ కు ఇప్పుడీ కథ తన ఇమేజ్ కు స్టామినాకు సరిగ్గా సరిపోతుంది.
ఈ కథలో కామెడీ ట్రాక్ నాకు బాగా నచ్చింది.ప్రముఖనటుడు సుధాకర్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన ట్రాక్ ను హాసం పక్షపత్రికలో అబ్రకదబ్ర (16 -30 ఏప్రిల్ 2003 ) పేరుతో కామెడీ కథగా రాసాను...ఈ కథను కూడా ఈ పుస్తకంలో అందిస్తున్నాను.నిమ్మకాయల బాబా ట్రాక్ నవ్విస్తూనే ఎంటర్టైన్ చేస్తూ ఆలోచింపజేస్తుంది.
మెగాస్టార్ చిరంజీవిని సైంటిస్ట్ పాత్రలో చూడాలని ఉందా?
రెగ్యులర్ సబ్జక్ట్స్ కు భిన్నంగా,డిఫెరెంట్ పాత్రలతో నటిస్తే స్టార్ హీరోలకు అభిమానులు జేజేలు పలుకుతారు.వాణిజ్య అంశాలతో చేసే ప్రయోగాలు అవార్డ్స్ రివార్డ్స్ తెచ్చి పెడుతాయి.నూటయాభైకి పైగా చిత్రాల్లో నటించి అభిమానుల్లో తన పాపులారిటీ చూపించుకున్నమెగాస్టార్ చిరంజీవి సైంటిస్ట్ పాత్రలో కనిపిస్తే...?
మెగాస్టార్ చిరంజీవి ఆర్మీ ఆఫీసర్ గా. మేన్ రోబోగా రెండు పాత్రలను పోషిస్తే ఎలా ఉంటుంది?
కుబేరుడి దగ్గరే అప్పు తీసుకుని యుగాంతం వరకూ అతడిని వెయిట్ చేయించే బుచ్చిబాబు కహానీ...కుబేర హోటల్స్..పబ్స్ ..టీవీ ఛానెల్..నారదుడే పీఆర్వో...కుబేరాయనమః
ప్రముఖరచయిత విజయార్కె
మెగాస్టార్ చిరంజీవి సినిమాకు కథ ..కుబేరాయనమః
విభిన్నమైన కథాంశం,వాణిజ్యవిలువలతో సందేశాత్మకంగా చెప్పే ప్రయత్నం.ఇది నవల రూపంలో ఉంటే మరింత బావుండేది.
సబ్జెక్టు బావుంది.ముఖ్యంగా చిరంజీవి అభిమానులకు చిరంజీవి రెండు పాత్రలు వేస్తే బాగా నచ్చుతుంది.మెజీషియన్ పాత్ర పిల్లలను ఆకట్టుకుంటుంది.
అబ్రకదబ్ర కథలోని సుధాకర్ పాత్ర కొత్తగా వుంది .ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయవచ్చు.కుబేరాయనమః నవలిక బావుంది.ఇది ఆంధ్రభూమి మాసపత్రికలో నవలగా వచ్చింది.
మానవ భావోద్వేగాలను పాత్రలుగా మలిచి,చదివించే గుణాన్ని శైలిగా మార్చుకుని తన రచనల్లో వైవిధ్యాన్ని చూపించే విజయార్కె గారి ముద్ర కొట్టొచ్చినట్టు కనిపించే రచన..
అయితే ఇది సన్నివేశాలుగా ఉండడం వల్ల కొంత అసంతృప్తి.ఇదే నవలగా రాసి ఉంటే మరింతగా మాకు సంతృప్తి మిగిలేది.
విజయబాపినీడు గారికి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పంపించిన స్కీరిప్ట్ ను యథాతథంగా అందించడం వల్ల ఇది అనివార్యమని రచయిత పేర్కొండడం గమనార్హం.ఒక సినిమా స్క్రిప్ట్ చదువుతున్నట్ట్టు వుంది.చిరంజీవిగారు ఇలాంటి రెండు పాత్రలను మెజీషియన్ గా ,ఆర్మీ ఆఫీసర్ గా పోషిస్తే అభిమానులకు పండుగే.అబ్రకదబ్ర కథను ( కామెడీ ట్రాక్ ) ను హాసం పత్రిక ద్వారా అందించడం బావుంది.
ఈ కథను నవల రూపంలో చదవలేదనే అసంతృప్తిని ఇదే పుస్తకంలో అదనంగా అందించిన కుబేరాయనమః తీర్చివేసింది.
ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన హాస్యనవల.అల్లరి నరేష్,నిఖిల్ లాంటి వాళ్ళు చేయవలిసిన మంచి సబ్జెక్టు కుబేరాయనమః
పెద్ద హీరోల సినిమాకు కథలు లేవు అనే దర్శక నిర్మాతలు హీరోలు ఒక్కసారి నవలా ప్రపంచంలోకి తొంగిచూడాలి.కొత్తదనంతో నావెల్టీ అన్న పదానికి అర్థం చెప్పే కథలు అన్వేషిస్తే దొరుకుతాయి,.
ఏసీల్లో నాలుగుగోడల మధ్య ఇతర భాష చిత్రాల సీడీలు చూస్తే ఆత్మల్లేని దేహాలు , మృతదేహాలే దొరుకుతాయి.కానీ...
ఈ నవల చదివితే కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
క్యూ , మేన్ రోబో లాంటి నవలలు " ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ " లా ఉంటాయి.కుబేరాయనమః చదివితే ఇలాంటి సినిమాలు మన కొత్త హీరోలు ఎందుకు ట్రై చేయరు ? అనిపిస్తుంది.
కథలు లేవని చెప్పేవన్నీ కథలే.కథలు లేకపోతే ఈ కథలు విజయబాపినీడు గారి లాంటి డైరెక్టర్ ఎందుకు ఎంపిక చేస్తారు.హీరోలు ఎప్పుడూ మూసపోసినట్టు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి విభిన్నమైన పాత్రలు పోషిస్తే బావుంటుంది.
మెగాస్టార్ ఇమేజ్ కు మెజీషియన్ పాత్ర సరిగ్గా సరిపోతుంది.,ముఖ్యంగా చిన్నారులు త్వరగా ఆ పాత్రకు కనెక్ట్ అవుతారు,
ఇదే పుస్తకంలో మెగాస్టార్ ను సైంటిస్ట్ పాత్రలో చూడాలని అనుకుంటున్నారా? అని క్యూ నవలలోని పాత్ర గురించి చెప్పడం బావుంది.
ఎందుకంటే చిరంజీవి గారు సైంటిస్ట్ పాత్ర పోషించిన దాఖలాలు లేవు.అందులోనూ గ్రహాంతర వాసుల కథ,
మేన్ రోబో నవలలోని " మేన్ రోబో " పాత్ర కూడా బావుంటుంది,
కుబేరాయనమః నవల చాలా బావుంది.
ఒకే నవలలో ఇన్ని కథలు..విషయాలు రీడబులిటీ చెడకుండా చెప్పిన విధానం సూపర్బ్ .