-
-
తిలక్ కథలు 1
Tilak Kathalu 1
Pages: 75Language: Telugu
దేవరకొండ బాల గంగాధర తిలక్ రచించిన కథలని నాలుగు భాగాల ఈ-బుక్స్‌గా సమర్పిస్తోంది కినిగె. ఇది మొదటి భాగం. ఇందులోని కథలు
"లిబియా యెడారిలో"
కదలే నీడలు
అద్దంలో జిన్నా
హోటెల్లో
ఆశాకిరణం
బాబు
యవ్వనం
* * *
నలభై ఏళ్ళు పైబడిన తాను, తన సభ్యతకీ, స్వభావానికీ విరుద్ధమైన పనులన్నీ బతకడంకోసం చేశాడు. కాని దాని ఫలితంగా మరింత అవమానాన్ని, దుఃఖాన్ని కొనితెచ్చుకున్నాడు. ఇంకా తనిలాగ ఎన్నేళ్ళు ఆకలితో బతకగలడు? తన కుటుంబానికి ఏం దారి చూపించగలడు? భయంకరమైన నిస్సహాయత అతన్ని చుట్టుకుంది. అతనికి చీకట్లోకి జారిపోతున్నట్లు చీకటి నీళ్ళలో పీకలోతు మునిగిపోతూన్నట్టు ఉంది. నీరసంవల్ల అతని కాళ్ళూ చేతులూ లాగుతున్నాయి. అతనికలాగ గోడ నానుకుని ఆలోచించే వోపిక కూడా లేకపోయింది.
అలా మగతగా నిస్త్రాణగా వున్న అతనికి 'నాన్నా' అన్న పిలుపుతో మెలకువ వచ్చింది. కళ్ళుతెరచి చూశాడు. అతని పెద్దకొడుకు పదేళ్ళవాడు 'అమ్మరమ్మంటోంది' అన్నాడు.
"ఏం?"
"తింటానికి."
* * *
చక్కని, ఆలోజింపజేసే కథలను ఆస్వాదించండి!!
- ₹108
- ₹60
- ₹108
- ₹60
- ₹60
- ₹60
This book is now available in Tenglish script with Kinige. For details, follow the link.