-
-
ఆపరేషన్ కౌంటర్ స్పై
Operation Counter Spy
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 111Language: Telugu
షాడో గొంతు ఎండిపోయింది. ఏమిటి ఈ అభాండాలు? తను దేశద్రోహం చెయ్యటమా? ఎన్నోసార్లు దొరికిన వాళ్ళను దొరికినట్లు ఆ కిరస్థాన్ ఏజెంట్లను, సీనాదేశపు ఏజెంట్లను చితకకొట్టాడే! అలాంటి తనని వాళ్ళు ఎలా చేర్చుకుంటారు? ఇందులో ఏదో తిరకాసు వుంది. తన దెబ్బకు తట్టుకోలేక వాళ్ళు వేసిన పథకమే ఇది.
"సార్! మీరు ప్రశాంతంగా ఆలోచించండి. గజదొంగగా జీవితం గడిపినప్పుడు చెయ్యని ద్రోహం, బాధ్యత కలిగిన ఉద్యోగంలో వుండి, పరువుగా బ్రతుకుతూ ఇప్పుడు చేస్తానా? మీరు ఒప్పుకున్న తరువాతే గదా నేను కలకత్తా పోయింది. రెండునెలల నుంచీ కలకత్తాలోనే వున్నాను. అందుకు సాక్ష్యం బిందూ. ఆమె నడగండి తెలుస్తుంది."
సిగార్ పంటికింద నొక్కిపట్టి పచార్లు చెయ్యసాగారు కులకర్ణిగారు. "అయామ్ సారీ షాడో, నువ్వు ఎంతో తెలివైనవాడివి, విశ్వాసపాత్ర్రుడివి అనుకున్నాను. యీ విధంగా మారతావని అనుకోలేదు. నీ మీద వచ్చిన ఆరోపణలన్నీ ఋజువైనాయి. డిఫెన్సు కోర్టులో నీ మీద విచారణ జరిగి దోషివని నిర్ణయింపబడింది. రేపు వుదయం పదిగంటలకు కర్గోజా మిలటరీ జైలులో డిఫెన్సు ఆఫీసర్ల ముందు, హోమ్ మినిష్టరు, డిఫెన్సు మినిష్టర్ల కళ్ళఎదుట... నిన్ను వురి తీస్తారు..."
This book is now available in Tenglish Script with Kinige. For details, click the link.