• Vijeta Manrobo Publications
  • fb
  • Share on Google+
  • Pin it!
 • విజేత - మేన్‌రోబో పబ్లికేషన్స్

  Vijeta Manrobo Publications

  Author:

  Pages: 164
  Language: Telugu
  Rating
  4.70 Star Rating: Recommended
  4.70 Star Rating: Recommended
  4.70 Star Rating: Recommended
  4.70 Star Rating: Recommended
  4.70 Star Rating: Recommended
  '4.70/5' From 30 votes.
  4.85 Star Rating: Recommended
  4.85 Star Rating: Recommended
  4.85 Star Rating: Recommended
  4.85 Star Rating: Recommended
  4.85 Star Rating: Recommended
  '4.85/5' From 27 premium votes.
Description

విజయార్కె స్పీకింగ్
1997 నాటిమాట ఇది. ఈనాడు కార్యాలయంలో బహుశా మూడవ అంతస్థు అనుకుంటాను. చతుర ఆఫీస్.. సంపాదకులు చలసాని ప్రసాదరావు గారు. చాలా మంచిమనిషి. గొప్ప సాహితీవేత్త, సుప్రసిద్ధరచయిత...పాఠకులకు కావలిసిన ఉత్తమ సాహిత్యాన్ని చతుర విపుల పత్రికల ద్వారా అందిస్తోన్న వ్యక్తి.
సున్నితమైన భావోద్వేగాలతో, హాస్యం, మానవసంబంధాలతో అలతి అలతి పదాలతో... సాహితీ, మానవతా విలువలతో హృద్యమైన అక్షరాల కాలుష్యంలేని రచనలు అందించే గొప్ప సంపాదకులు.
మొదటిసారి నేను పల్లెటూరి నేపథ్యంలో అందమైన బావమరదళ్ళ ప్రేమకథను కొత్తకోణంలో రాసిన నవల. ఒకవిధంగా ఇప్పటి వ్యక్తిత్వవికాస రచనల్లోని అంశాలను నవలద్వారా చెప్పే ప్రయత్నమే విజేత నవల, గెలిచినవాడు కాదు గెలిపించినవాడే విజేత అని చెప్పిన నేపథ్యం. ఒక విధంగా అక్షరాల సర్జికల్ స్ట్రైక్...
మనం అనుకున్నలక్ష్యాన్ని సాధించి తిరిగి మన గమ్యానికి చేరుకోవడం.
1991 ప్రాంతంలో నేను సినిమా జర్నలిస్ట్ గా ఉండడం వల్ల సినిమా పరిశ్రమలోని వేదనలు వెలుగులు రంగులు విషాదాల చీకట్లు దగ్గరి నుంచి చూసే అవకాశం కలిగింది.
సిల్క్ స్మితను ఇంటర్ వ్యూ చేసినప్పుడు, రాజనాల గారిని కలిసినప్పుడు,కాంతారావు గారితో మాట్లాడినప్పుడు... ఏవీ తల్లి నిరుడు కురిసిన హిమసమూహములు.. అని అడగాలనిపించింది.
ఈ నవలలోని సంఘటనలు కల్పితమే అయినా ఎక్కడో మనలోని బాబొద్వేగాలను ప్రశ్నిస్తుంది.
ఒక ఆహ్లాదకరమైన అందమైన స్వచ్ఛమైన అక్షరకాలుష్యంలేని నవల విజేత అని నా ఫీలింగ్.
భావోద్వేగాలను ప్రేమించేవారికి నచ్చే నవల విజేత...
చతురలో విజేత నవల జులై 1997 లో వచ్చింది.
ఒక అందమైన మనసున్న, బావను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి... "బావా.. నిన్ను సినిమా హీరోగా చూడాలని వుంది. నీ బొమ్మ మన టూరింగ్ టాకీస్ లో వస్తే ఈలలు వేయాలని వుంది" అని అమాయకంగా అడిగితే...
"అంతేనా... సరే అయితే.. నీకోసం హీరోని అవుతాను..." అని సినిమా రాజధానికి వెళ్లి, అంచెలంచెలుగా హీరో స్థాయికి ఎదిగి... హీరోగా తన సినిమా అంతా చూస్తుంటే, తను మాత్రం... ఒక నిర్ణయం తీసుకున్నాడు...
బావను హీరోగా చూసిన మరదలు బావతో చెప్పిన మాటలు భావోద్వేగాలను కంటతడి పెట్టేలా చేసాయి...
శ్రీ చలసాని ప్రసాదరావు గారికి, శ్రీరామోజీ రావు గారికి,
ఈ నవలను అభిమానించి, ఉత్తరాలవర్షంతో తడిపేసిన ఆనాటి పాఠకులకు, ఇప్పుడు ద్వితీయ ముద్రణగా కినిగె మరోసారి మీ ముందుకువస్తోన్న ఈ నవలను అక్కున చేర్చుకుంటోన్న మీకు కృతఙ్ఞతలు.
ఈ నవల మీద మీ స్పందన తెలియజేయండి.

Preview download free pdf of this Telugu book is available at Vijeta Manrobo Publications
Comment(s) ...

మనసుకు ఆహ్లాదాన్నే కాదు ప్రేమకు వ్యక్తిత్వవికాసానికి సరికొత్త నిర్వచనం చెప్పే నవల,సినిమా పరిశ్రమలోని అన్నికోణాలను ఆవిష్కరిస్తూ హీరోయిజానికి సరైన అర్థం చెబుతూ బావమరదళ్ళ ప్రేమకు ప్రాణం పోసిన అద్భుతమైన నవల.నెట్ ( అంతర్జాల వలయం) నుంచి కొత్తప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుంది.

పల్లె నేపథ్యంలో అద్భుతమైన భావుకతను స్వచ్ఛమైన ప్రేమను ధీరోదాత్తతను అక్షరాల్లో ఆవిష్కరించిన నవల విజేత అనడంలో సందేహం లేదు.విజేత అంటే గెలిచినవాడు కాదు గెలిపించినవాడు..అని కొత్త అర్థాన్ని చెప్పిన ఈ నవల నేను దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే చతురలో చదివాను.ఆ కాపీ మిస్సయింది.ఇప్పుడు ఆన్ లైన్ లో చదివే అవకాశం వచ్చింది.
బావమరదళ్ళ మధ్య అపురూపమైన ప్రేమ మరదలి కోసం బావ సినిమా హీరో అవ్వడం...సినిమా హీరో అయ్యాక ఆ సినిమా విడుదలయ్యాక హీరో తీసుకున్న నిర్ణయమే కథానాయకుడిని అసలు సిసలైన విజేతగా మార్చింది...
ఈ నవలలో సిల్క్ స్మిత పాత్ర రాజనాల గారి పాత్ర లు కళ్ళ ముందు కదలాడేలా చేస్తాయి.సినిమా పరిశ్రమలోని విషాదం కోణాన్ని వెలికి తీస్తాయి.
భావోద్వేగాలను స్పృశించే నవల చదువుతుంటే అద్భుతమైన కొత్తప్రపంచంలో విహరిస్తున్నట్టు ఉంటుంది.

అచ్చతెనుగు వాతావరణంలో అద్భుతమైన ప్రేమకథ.బావమరదళ్ళ ప్రేమకు అర్థం చెప్పినకథ...విజేతకు నిర్వచనం చెప్పిన నవల.." విజేత " " గెలిచేవాడు కాదు గెలిపించేవాడు.".అన్న మాటల్లో ఎంతో అర్థం వుంది.సినెమనటుల జీవితాల్లోని మరోకోణాన్ని చూపించింది.వ్యక్తిత్వవికాసాన్ని నవలలో ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయం.వెరసి విజేత నవల భావోద్వేగాలకు పెద్దపీట వేసింది.ఇరవైఏళ్ళ క్రితం చదివినా ఇప్పుడు మళ్ళీ మరోసారి చదివించిన నవల,,,కళ్ళముందు పాత్రలు వున్న ఫీలింగ్..ఇలాంటి నవలలను అందిస్తున్న కినిగెకు,విజయార్కె గారికి అభినందనలు..కృతఙ్ఞతలు.

మనసును పట్టి కుదిపేసింది విజేత నవల ..విజేత అనే పదానికి సరియన అర్థాన్ని చెప్పారు.బావమరదళ్ళ ప్రేమ ఇంత బావుంటుందా? సినిమా పరిశ్రమలో ఇన్ని భావోద్వేగాలు ఉంటాయా? ఇన్నిఉత్థాన పతనాలు ఉంటాయా? సిల్క్ స్మిత గారిని గుర్తుకు తెచ్చారు..విషాదాలను ఎమోషన్స్ ను బాలన్స్ చేసారు ...గెలిచిన తరువాత హీరో తీసుకున్న నిర్ణయం హేట్సాప్ ...అక్షరాలతో సన్నివేశాలను చూపించారు. విజయార్కె గారి మరణశాసనం ,నిర్ణయం నవలల తరువాత మరో విభిన్నమైన నవల విజేత ..

ఒక మంచి నవల చదువుతున్నట్టు,ఒక మంచి సినిమా చూస్తున్నట్టు వుంది.
ముఖ్యంగా విజేత అనే మకుటానికి సరైన అర్థం చెప్పిన నవల,
సినిమా హీరో కావడమే లక్ష్యం కాకుండా తన మరదలి గెలిపించడమే గమ్యంగా హీరోను తీర్చిదిద్దిన విధానం బావుంది.
నవలలో ఒకనాటి మేటినటుడు రాజనాల రేఖామాత్రంగా కనిపించి కంటతడి పెట్టిస్తాడు.
ఒక నర్తకి విషాదాంతం మనసును కుదిపేస్తోంది.
ఇలాంటి నవలలు మనల్ని మనసుతోపాటు ప్రయాణించేలా చేస్తాయి.
ఈ నవల చదివిన ప్రతీ ఒక్కరూ విజేతే.
ఒక విధంగా వ్యక్తిత్వవికాసాన్ని నేర్చుకున్నట్టు వుంది.

పల్లెటూరి వాతావరణంలో స్వచ్ఛమైన బావమరదళ్ళ ప్రేమ
మరదలి కోసం సినిమా హీరో కావాలని హైద్రాబాద్ కు వచ్చిన కథానాయకుడు
సినిమా పరిశ్రమలో వున్నా ఎగుడుదిగుడులను కళ్ళకు కట్టిన సన్నివేశాలు
హీరోగా మారి తాను విజేతగా నిలిచి మరదలిని గెలిపించిన కథానాయకుడు తీసుకున్న నిర్ణయం...
ఈ నవలలో ఈ నాలుగు మూలస్థంబాల మధ్య నిర్మించిన కథనం అనే సినీ ప్రేమనగర్ ..
అద్భుతం

బావామరదళ్ల స్వచ్ఛమైన ప్రేమకు భాష్యంగా నిలిచిన ప్రేమకథ... విజేత నవల!! విజేత అంటే గెలిచినవాడు కాదు.. గెలిపించినవాడు అంటూ విజయానికి విజేత అను పదానికి వినూత్నమైన అర్థాన్ని విశదీకరించిన రచయిత విజయార్కె గారికి అభినందనలు!! నన్ను ఎంతగానో ఆకట్టుకుని నా మనసుకు హత్తుకున్న నవల "విజేత"

ఒక అందమైన మనసున్న, బావను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి... "బావా.. నిన్ను సినిమా హీరోగా చూడాలని వుంది. నీ బొమ్మ మన టూరింగ్ టాకీస్ లో వస్తే ఈలలు వేయాలని వుంది" అని అమాయకంగా అడిగితే...
"అంతేనా... సరే అయితే.. నీకోసం హీరోని అవుతాను..." అని విజేతగా నిలిచిన కథాంశం అద్భుతం.
విజేత నవలను ఒక వ్యక్తిత్వవికాస పుస్తకంగానూ చదువుకోవచ్చు.ఒక యువకుడు మరదలి కోరిక తీర్చడానికి సినిమా హీరో అవ్వడం..హీరో అయ్యాక అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడం...
చిన్న నిర్లక్ష్యంతో వ్యసనాలతో విషాదాంతం చేసుకున్న తారల జీవితాలను కళ్ళముందు ఉంచడం విజేత నవలను ఫీల్ గుడ్ నవలగా నిలిపింది.
అచ్చమైన స్వచ్ఛమైన పల్లె వాతావరణంతో మొదలైన నవల సినిమా ప్రపంచం నీలినీడలను చీకటివెలుగులను ఆవిష్కరించింది.
1997 లో చతురాలో వచ్చిన ఈ నవల ఇప్పటికీ మనసుపొరలను స్పృశిస్తూనే వుంది.

చతురలో విజేత నవల జులై 1997 లో చదివాను.
ఒక అందమైన మనసున్న, బావను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి... "బావా.. నిన్ను సినిమా హీరోగా చూడాలని వుంది. నీ బొమ్మ మన టూరింగ్ టాకీస్ లో వస్తే ఈలలు వేయాలని వుంది" అని అమాయకంగా అడిగితే...
"అంతేనా... సరే అయితే.. నీకోసం హీరోని అవుతాను..." అని సినిమా రాజధానికి వెళ్లి, అంచెలంచెలుగా హీరో స్థాయికి ఎదిగి... హీరోగా తన సినిమా అంతా చూస్తుంటే, తను మాత్రం... ఒక నిర్ణయం తీసుకున్నాడు...
ఈ నవల ఇన్నాళ్లకు మళ్ళీ ఇప్పుడు చదువుతున్నా అదే ఫ్రెష్ ఫీలింగ్..అదే ఎమోషన్
పల్లెటూరు నేపథ్యంలో అందమైన బావమరదళ్ళ స్వచ్ఛమైన ప్రేమకథ.
" గెలిచేవాడు కాదు గెలిపించేవాడే నిజమైన విజేత" అని చెప్పిన నవల

మనసును పట్టికుదిపేసే నవల.ఫీల్ గుడ్ అన్న పదానికి అర్థం చెప్పిన నవల.పల్లెటూరి వాతావరణం ,కథానాయకుడు మరదలి కోసం హీరో అవ్వడం,హీరో అయ్యాక అతను తీసుకున్న నిర్ణయం,విజేత అన్న పదానికి అర్థం చెబుతూ మంచినవలగా మిగిలిపోయింది.ముఖ్యంగా చిత్రపరిశ్రమ తీరుతెన్నులు కళ్ళకు కట్టినట్టు చూపించింది.సిల్క్ స్మిత లాంటి నటీమణి జీవితాన్ని స్పృశించిన తీరు బావుంది.మనసులో నిలిచిపోయే మంచినవల అందించినందుకు రచయితకు,కినిగెకు ధన్యవాదాలు.

విజేత ఒక నవల కాదు జీవితం.ఏ మాత్రం కల్తీలేని స్వచ్ఛమైన ప్రేమకు కథానాయకుడు అనే పదానికి అర్థం చెప్పిన కథనం.నవల చదువుతునంతసేపూ మనసు భారంగా అనిపించింది.ముఖ్యంగా కొందరి నటుల చరమాంకం గుర్తుకు వచ్చి".గెలిచేవాడు కాదు,గెలిపించేవాడే విజేత " అన్నది నూటికి నూరుపాళ్లు నిజం.ఇలాంటి నవలలు మనసుకు తృప్తిని మంచి అనుభూతిని కలిగిస్తాయి.

మనసులో నిలిచిపోయే నవల.అలా నవలతో పాటు మనల్ని పల్లెటూరిలోకి సినిమాలోకంలోకి అనుభవాల్లోకి తీసుకువెళ్ళే నవల.ఎప్పటికీ గుర్తుండిపోయే నవల.పాఠకుల హృదయాల్లో విజేతగా నిలిచే నవల.