-
-
తెలంగాణా అస్తిత్వ పోరాటం
Telangana Astitva Poratam
Author: Dr. Velchala Kondal Rao
Pages: 522Language: Telugu
తెలంగాణా అస్తిత్వ పోరాటం, The Telangana Struggle for Identity (తెలుగు, ఇంగ్లీషులలో)
సంకలనం: డా. వెల్చాల కొండల రావు, ప్రొఫెసర్ జె.వి. రాఘవేంద్ర రావు, బి. నరసింగ రావు
* * *
భరతజాతి సమైక్యతా నిర్మాణ మహాప్రస్థానంలో తెలంగాణా రాష్ట్రావతరణ చంద్రుని కొక నూలుపోగులాంటి కానుకగానుంటుంది. నాలుగు కోట్ల తెలంగాణా ప్రజాబాహుళ్యం, అటు నాగరిక ప్రపంచం ఈ నవోదయం కొరకు వేయి కండ్లతో వేచియున్న సందర్భం. దేశంలో నున్న భిన్నత్వంలోని ఏకత్వాన్ని దృఢతరం చేస్తున్న శుభవేళ. పరిణత రాజకీయ సంస్కృతిని ప్రదర్శించవలసిన సుముహర్తం. దేశ పునరుజ్జీవనంలో రాష్ట్రాల పునర్నిర్మాణం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్న అంశం. దేశమంటే మట్టికాదు మనుషులనే మహత్తర సత్యం పునరావిష్కరించ బడుతున్న సమయం. దేశమంటే 'సుజలాం, సఫలాం' మాత్రమే కాదు సుఖసంతోషాలు సమహితం సమన్యాయాన్ని పరిపూర్ణంగా అనుభవించే స్వతంత్ర మానవ సముదాయమను సత్యానికి బాటలు వేసే తరుణం.
ఇంతటి గురుతర జాతీయ బాధ్యతలను నిర్వహించవలసిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయి ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంగా అవతరించం ఒక జఠిలమైన సమస్యగా తెలంగాణా ప్రజలు ఎదుర్కుంటున్నది వాస్తవం.
తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమం రాజకీయాలకతీతంగా తెగింపుతో బలోపేతంగా నిర్వహించం ఈనాటి తక్షణ కర్తవ్యం. తెలంగాణా ప్రజల చైతన్యం ప్రత్యేక రాష్ట్ర సాధనతో పాటు ఆ తర్వాత కూడ నవ తెలంగాణా, ప్రజా తెలంగాణా సాధనలో తమ విశిష్ట పాత్రను పోషిస్తుంది. భారత రాజ్యాంగం ఊహించిన సమ సమాజ నిర్మాణానికి బాటలు వేస్తుంది. ఇంతటి పవిత్ర కర్తవ్య నిర్వహణ కవసరమైన తెలంగాణా రాష్ట్ర ఉద్యమానికి ఎంతో అనుకూలించే సంకలనం ''తెలంగాణా అస్తిత్వ పోరాటం'' దేశభక్తులందరిని మేల్కొలుపుతూ కార్యోన్ముఖులను చేసేలాగుంది. దానికి సంకల్పించినందుకు మీకు నా అభినందనలు.
- చెన్నమనేని రాజేశ్వరరావు

- ₹60
- ₹288
- ₹432
- ₹144
- ₹240
- ₹60