-
-
ముద్దు వడ్డన్లు 3
Muddu Vaddanlu 3
Author: Dr. Velchala Kondal Rao
Publisher: Viswanatha Sahitya Peetham
Pages: 59Language: Telugu
కవిత్వం చెప్పేవాడు గొప్పా లేక కట్టెలు కొట్టేవాడా? అని అంటే, ఇరువురూ గొప్పే అని అనవలసి వస్తుంది. మరి ఒకడికి ఎక్కువ గుర్తింపు, ఎక్కువ ప్రతిఫలం ఎందుకు, మరొకరికి తక్కువ ఎందుకంటే దానిలో ఒకటి ప్రతిభకు చెందిందైతే ఇంకొకటి నేర్పుకు చెందింది. ప్రతిభ ఎప్పటికీ నేర్పుకంటే అరుదు కనుక, ఏది అరుదో దానికి విలువెక్కువ అందువలననే దానికి ఖరీదెక్కువ అని అనవలసి వస్తుంది.
* * *
తిట్టు! ఇంకా తిట్టు! నీవు తిడుతున్నావంటే నన్ను చదువుతున్నావన్నమాట. ఇంకా తిడుతున్నావంటే మరింత చదువుతున్నావన్నమాట, చదువక తప్పదన్న మాట. నీకు తెలియకుండానే నన్ను మెచ్చుకుంటున్నావన్నమాట. అసలు నన్నడిగితే తిట్టడానికీ మెచ్చుకోవడానికీ తేడా లేదు, రెండూ ఒకటేనంటా, నీవేమంటావో మరి.
* * *
వాళ్ళకి (ఇంగ్లీషు వాళ్లకి) మొన్నకి, ఎల్లుండికి పట్టింపు లేదోయ్. వట్టి ఇవ్వాళ్ళటి జాతి. తప్పదు కదాయని నిన్న రేపులను మాత్రం ఒప్పుకున్నారు. అదీ ఎలా ఒప్పుకున్నారు? రేపేమో ఎనిమిది అక్షరాలదని, నిన్ననేమో తొమ్మిది అక్షరాలదని, అంత గొప్ప సులభ భాష యది.

- ₹60
- ₹288
- ₹432
- ₹144
- ₹240
- ₹60