-
-
జాతక కథలు - మహాబోధి బుద్ధవిహార
Jataka Kathalu Mahabodhi Buddhavihara
Publisher: Mahabodhi Buddha Vihara
Pages: 570Language: Telugu
ప్రపంచ కథాసాహిత్యంగా జాతక కథలు అతిపెద్ద, అతిపురాతనమైన సంకలనం. ప్రాచీన పాలిభాషలో వ్రాయబడిన అవి పాలీత్రిపీటకాలలో ఖుద్ధకానికాలయంలో భాగంగా ఉన్నాయి. సంబోధిని పొందిన (సిద్ధార్థుడుగా పుట్టక) ముందు బుద్ధుని పూర్వజన్మలను గురించి తెలిపే మొత్తం 547 కథలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
త్రిపిటకాలు రూపొందిన తర్వాత క్రీ.పూ.4 వ శతాబ్దంలో వైశాలిలో రెండవసంగీతి జరిగిన సమయం వరకు ఇందులోని చాలా కథలు అంతిమరూపాన్ని ధరించాయి. వాటిలో కొన్నిటిలో మానవుల ప్రవర్తనలోని ప్రస్తుత వైఫల్యాలకు గతజన్మలలో కూడా వారిలో ఉన్న అటువంటి లక్షణాలను గుర్తించి, ఒకేవిధంగా ఉన్నఆ రెండింటినుండి నేర్చుకోవలసిన నీతిని చూపిస్తూ మార్పులు చేయబడినాయి. ప్రతికథ దానిని చెప్పవలసివచ్చిన సందర్భాన్ని సూచిస్తూ మొదలౌతుంది. మధ్యలో బోధిసత్త్వుని పూర్వజన్మ కథ ఉంటుంది. చివరన బుద్ధుడు వర్తమానంలోని వ్యక్తులను పూర్వజన్మ కథలో గురించి, ఆ జన్మలో ఎవరు, ఏమిగా ఉండేవారో తెలుపటంతో కథ ముగుస్తుంది. పూర్వజన్మలనుండి సంక్రమించిన లక్షణాల శక్తితో సంకీర్ణమైన కారణ – కార్యసూత్రం ప్రాణులలో ఏ విధంగా పనిచేస్తుందో చెప్పటమే కథలకు వస్తువుగా ఉంది.
Is this available? What is the price of ebook?