-
-
జీవన రాగం
Jeevana Ragam
Author: Dr. Veturi Sundara Ramamurthy
Publisher: Veturi Sahiti Samithi
Pages: 123Language: Telugu
“జీవన రాగం” కథకి ఆధారం 1950 ప్రాంతాలలో, నల్లమల అడవుల మధ్య వున్న నంది కొండలలో నేను గడిపిన మధుర క్షణాలలోనిది.
పేరుగాంచిన ముక్త్యాల సంస్థానాధీశులైన శ్రీ వాసిరెడ్డి చంద్రమౌళీశ్వర ప్రసాద్ గారు, తెలుగువారి సంస్కృతికి ఆధారమైన కృష్ణవేణీ నది మీద, తెలుగిళ్ళకు జీవనాధారమయ్యే ఒక పెద్ద ఆనకట్ట (నాగార్జున సాగర్) నిర్మించాలన్న సంకల్పంతో, అనేక మార్లు నల్లమల ప్రాంతంలోని నందికొండల మధ్య సాంకేతిక పరిశోధనలకోసం వెళ్ళిన సందర్భాలలో, ఒక మారు నేనూ వారి వెంట వెళ్ళిన తరుణాన, అక్కడ కనిపించిన, వినిపించిన వనజీవుల జీవన రాగాలు, నా మస్తిష్కంలో ముద్రితమయ్యాయి.
క్రమేణా వారి జీవన రాగాలలోంచి జనియించిన ఒక రాగం నా మనసుకు దగ్గరై, ప్రేమ కథా రూపంలో జీవంపోసుకుని ‘జీవన రాగం’ గా ఆవిష్కృతమైంది.
నా తొలినాళ్ళ రచనలకు ప్రేమను, నా మలినాళ్ళ కవితలకు ప్రేరణనూ ఇచ్చిన ఈ జీవన రాగం, ప్రప్రథమంగా 1959 లో, ఆంధ్ర పత్రిక సచిత్ర వార పత్రికలో, ఉదయ రాగాలను అలంకరించుకుని అందరి అభిమానాన్నీ అందుకుంది.
1970 లో, స్వతంత్ర ముద్రిత అయ్యి, ఆ జీవన రాగమైన, ఈ జీవన రాగం, ఇప్పుడు మరోసారి నవ “జీవన రాగం” గా మీ ముందుకు వస్తున్నది.
- వేటూరి సుందర రామ మూర్తి
can i get a print book of "jeevana raagam" by Sri Veturi Sundararama murthy garu