-
-
నేల నాగలి మూడెద్దులు
Nela Nagali Mudeddulu
Author: Bojja Tarakam
Publisher: Hyderabad Book Trust
Pages: 73Language: Telugu
సకల జీవరాశులకూ, సమస్త మానవకోటికి అడగకుండా అన్నం పెట్టే ఈ నేలనాదని కొందరు స్వార్థపరులు గిరిగీసుకొని, ముళ్ళకంచెలు వేసి, రాళ్లు పాతి మిగిలిన వాళ్ళెవరూ ఈ నేల అందించే నీరు నిప్పూ అన్నం ముట్టుకోకుండా కట్టడి చేస్తున్నారు. ఇది అన్యాయం అని అందరికీ కనబడుతున్నది. భూమి మీద దొరికే సంపద అంతా సమానంగా పంచుకోవాలని, ఏది కూడా ఏ కొందరి చేతుల్లోనో ఇరుక్కుపోయి ఉండకూడదని, నేల అందిస్తున్న ఫలాలను అన్నీ సమానంగా పంచుకోవాలనే పద్ధతి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. ఈ ప్రయత్నాలను గురించిన నేపధ్యమే ఈ పుస్తకం
* * *
బొజ్జా తారకంవృత్తిరీత్యా సీనియర్ న్యాయవాది. కారంచేడులో అగ్రవర్ణాలవారు దళితులపై సాగించిన అమానుష మారణకాండకు నిరసనగా 1984లోనే ఆయన హైకోర్టులో గవర్నమెంటు ప్లీడర్ ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ సహవ్యవస్థాపకుడిగా దళితుల నిరసనోద్యమానికి దశాబ్ద కాలంపాటు వెన్నుదన్నుగా నిలిచారు. అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడికి గురయ్యే ప్రజల పక్షాన రాజీలేని పోరాటం సాగించే బొజ్జా తారకం ఇప్పటికీ దళితులను సంఘటిత పరిచే కార్యక్రమాలకే తన పూర్తి కాలాన్ని వెచ్చిస్తున్నారు. భారత రిపబ్లికన్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పని చేస్తున్నారు. మానవ హక్కుల, పౌరహక్కుల ఉద్యమంలో ఎంతో కియాశీలకంగా పాల్గొంటున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయనకు మంచి పేరుంది. బొజ్జా తారకం రచనల్లో పోలీసుకు అరెస్ట్ చేస్తే (1981), కులం వర్గం (1996), నది పుట్టిన గొంతుక (1983) ప్రముఖమైనవి.
