-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
మతాలు ఎవరికొరకు? (free)
Mataalu Yevarikoraku - free
Author: Yalamanchili Venkatappaiah
Publisher: Gandhi Samyavada Pustakamala
Pages: 32Language: Telugu
Description
నేడు మన దేశంలో కని విని ఎరుగని అశాంతి, అరాచకము, అలజడులు రోజు రోజుకూ ఎక్కువై పోవుట వల్ల, నేడు మన దేశంలో శాంతి భద్రతలు కరువైపోయి, ప్రజలు తమ ప్రాణాలను అరచేతులలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ బ్రతకవలసిన దుర్గతి దాపురించింది.
కనుక దేశంలోని అన్ని ప్రాంతాలలోని సమసమాజ వాదులు, మానవతా వాదులు, ప్రజాస్వామ్యవాదులు, నిస్వార్ధపరులు, ప్రజాసేవకులు, సహృదయులైన యువతీ యువకులు ఏకమై ఆయా మతాలలోని అమాయక ప్రజలను మత పిచ్చినుండి మత సామరస్యం వైపుకు ఆదరణయుక్తమైన బోధనల ద్వారా మళ్ళించడానికి వెంటనే కృషి చేయగలరని అశిద్దాం.
- యలమంచిలి వెంకటప్పయ్య
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
Meeru Christian ani naa anumaanam
ఈ పుస్తకంలోని చాలా విషయాలతో నేను ఏకీభవిస్తాను. 70 శాతం సత్యమైనవి, 30 సత్యం అసత్యమైనవి వ్రాశారు. మీకు అన్ని మతాల మీద సరైన అవగాహన లేదు. కేవలం 'హిందూమతం ఎవరికీ ?' అనే శీర్షిక పెట్టివుంటే బాగా నొప్పుతుంది. కేవలం హిందూ మతం గురించే వ్రాసారు. కానీ పుస్తక శీర్షిక మాత్రం 'మతాలు ఎవరికొరకు?' అని వుంది. అసలు మతానికి ధర్మానికి తేడా తెలుసా?
కేవలం హిందూ మతం లో మాత్రమే శాఖలు వున్నాయి అన్నారు. ఇది పరమ తప్పు. ఇస్లాం లో శున్ని మరియు షియా అనే రెండు వర్గాలుగా విడిపోయింది. వాటిలో మల్లి సున్ని మాలికీ, హనాఫీ, షఫీ, మరియు హంబాలీ అని ఇంకా ఎన్ని విభాగాలుగా విడిపోయాయి. అలాగే క్రిస్టియానిటీ లో చర్చ్ ఆఫ్ ది ఈస్ట్, ఓరియంటల్ ఆర్థోడాక్సీ, ఈస్టర్న్ ఆర్థోడాక్సీ, రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టంటిజం మరియు రిస్టోరేషనిజం విడిపోయాయి. బౌద్ధమతంలో హీనయాన, మహాయాన, ఎసోటెరిక్ బౌద్ధమతం, స్వచ్ఛమైన భూమి బౌద్ధమతం మరియు జెన్/చాన్ బౌద్ధమతం అని విడిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మతాలు ఒకే విధంగా ఉన్నాయి.
వేదాంతం అంటే 'తెలిసికొనేది అంతం అయిపోయినది అని కాదు' వేదాల అంతం అని అర్థం.
ఇలా మీరు విషయ దోషణలు... ఇంకా వ్యాకరణ దోషాలు చేసారు. 33 పేజీలు వున్నా ఈ చిన్న పుస్తకంలో కూడా దోషాలు ఎందుకున్నాయి? మీకే తెలియాలి. కానీ ఒక్కటి గమనిస్తే 33 పేజీల్లోనే తప్పులుంటే వేల సంవత్సరాలు నుంచి ఉన్నా వాటిలో తప్పులుండవా? కేవలం నాస్తికులు మాత్రమే తప్పు చేస్తున్నారా? పేదలను తోక్కేస్తున్నారు?
చివరి మాట: నేను కూడా మతాలకి వ్యతిరేకినే. దేవుడు ఉన్నాడో లేడో ప్రక్కనపెడితే దేవుడి పేరు చెప్పుకునే పబ్బం గడిపేవారే ఎక్కువ. ఈ మతాలు చచ్చిపోవాలని కోరుకుంటే.... సెలవు!