-
-
ప్రకృతి వరాలు 1
prakruti varaalu 1
Author: Dr. Gayatri Devi
Publisher: Arogyapeetham
Language: Telugu
ఋషి మాసపత్రిక ద్వారానూ, ఈటీవి2 సుఖీభవ ద్వారానూ ఎందరికో ఆరోగ్యాన్ని అందిస్తున్న డాక్టర్ గాయత్రీదేవి రచించిన ఆయుర్వేద ఆరోగ్య గ్రంథం.
ఆయుర్వేదానికి సంబంధించిన చరిత్ర, మూల సిద్దాంతాలు, మూలికల నుండి శాస్త్రీయంగా మందులు తయారు చేసుకొనే విధానం, అనుపానాలు, పథ్యాల గురించి కలిగే సందేహాలకి సమాధానాలు తేలికగా అర్థం అయ్యేలాగా అందిస్తుంది.
రోజూ తినే ఆహారపు వివరాలు, ఫలాల అవసరాలు, ఆరోగ్య సమస్యలకి పరిష్కారాలు చూపిస్తుంది. డాక్టర్ల దగ్గరికి పరిగెత్తే అవసరాన్ని తగ్గిస్తుంది. ఆత్మీయంగా మీతో మాట్లాడుతుంది.
మీ సందేహాలు వింటుంది. సమాధానాలు చెబుతుంది. ప్రతిరోజూ ఒక్క అంశం గురించి చదవండి. చదివి జీర్ణించుకుని మీ సమస్యలని మీరే పరిష్కరించుకోండి.
గృహవైద్యం మీద చాలా పుస్తకాలు వచ్చాయి. అయితే ప్రకృతి వరాలు అనే ఈ పుస్తకం ఈ విషయంలో శాస్త్రీయమూ, సమగ్రమూ అని చెప్పవచ్చు. ఆయుర్వేద పట్టభద్రురాలే కాక జాతీయస్థాయి బహుమతులు పొందిన సాహితీవేత్త గాయత్రీదేవి చేతిలో పడటం వల్ల ఈ గ్రంథానికి మరిన్ని అందాలు చేకూరాయి. ఆరోగ్య సమస్యలకు ప్రకృతిలో లభించే సులభోపాయాల సూచిక ఎవరికయినా ఆమోదయోగ్యం కదా.
