-
-
ధర్మభిక్షం మాట ముచ్చట
Dharmabhiksham Mata Muchchata
Author: Kompelli Venkat Goud
Publisher: Goud Charitra Adhyayana Kendram
Language: Telugu
మనకి తెలిసి లిఖించని మన చరిత్ర ధర్మభిక్షం గారి జీవితం. అణగారిన జాతిలోంచి వుద్భవించిన తెలంగాణాలోని మొట్టమొదటి విద్యార్థి నాయకుడు, మాస్ డ్రిల్, హాకీ టీం కెప్టెన్, ఆర్యసమాజ్ సారథి, ఆంధ్రమహాసభ ఆర్గనైజర్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, సాయుధ పోరాటకాలంలో అత్యంత కఠినమైన జైలు జీవితం అనుభవించిన ధైర్యశాలి, కల్లుగీత ఉద్యమ పితామహుడు, నల్లగొండ జిల్లాలో మొదటి విద్యార్థి హాస్టల్ స్థాపకుడు, ట్రేడ్ యూనియన్ వుద్యమకారుడు, 1952లో జైల్లో వుండి ఎమ్మెల్లే (పిడిఎఫ్) గెలిచిన ప్రజానాయకుడు, హిందూ-ముస్లిం ఐక్యత కోసం నిలిచిన నాయకుడు, తెలుగు, ఉర్దూ, యింగ్లిష్ భాషలలో మంచి ప్రవేశం, మూడు సార్లు ఎమ్మెల్లే, రెండు సార్లు ఎంపి. ఎంతమందికి తెలుసు యింత అద్బుతమైన ప్రజానాయకుడి జీవితం గురించి? యీ మహానుభావుడి పేరు తెలుసు కానీ తారీఖులు, దస్తావేజులు (చరిత్ర) ఎంచుకు లేవు?
నాజీవితమే చరిత్ర, నా జీవితమంతా పండగ, నా పేరు యీ మట్టిలో, ప్రజాహృదయాలలో లిఖించబడి వుంది అని గర్వంగా చాటుకునే ధైర్యం యీనాటి రాజకీయ నాయకుల్లో ఎంతమందికి వుంది?
కేవలం ప్రజాహక్కుల సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహామనిషి. ప్రస్తుతం మీ చేతిలో వున్న ఈ పుస్తకం ధర్మభిక్షం గారి జీవితం, అనుభవాలు అనే మహాసముద్రంలో పయనించడానికి రూట్మాప్ మాత్రమే. నిజానికి ఈ పుస్తకంలో చోటు చేసుకున్న ప్రతీ శీర్షిక (సబ్ టైటిల్) మీద వొక గ్రంథం రాయవొచ్చు. అంత లోతైన, విస్తృతమైన జీవితం ధర్మభిక్షం గారిది.
- కొంపెల్లి వెంకట్ గౌడ్.
kompelli venkat goud gouds charitra malanti vallaku kavali NARAYANA GOUD MUMBAI