• The Epedemic
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ది ఎపిడమిక్

  The Epedemic

  Author:

  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

జ్వరం... జ్వరం... జ్వరం... జ్వరం...

జంటనగరాలకి వైరస్ జ్వరం పట్టుకుంది. ఎవరికి చూసినా జ్వరం! ఒళ్ళు నొప్పులు! ఒంటి మీద ఎర్రటి మచ్చలు...! విపరీతమైన బాధ!

జనం నగరం విడిచి పారిపోతున్నారు.

రక్తస్రావం... ఫిట్స్... ఎక్కడ చూసినా రాక్షసి దోమల గుంపులు! ఈ దోమలు లక్షల సంఖ్యలో నగరం మీద దాడి చేస్తున్నాయి. వాటి లాలాజల గ్రంథుల్లో వైరస్ కణాలు... అవి భయంకరమైనవి. వాటికి ఆర్‌ఎన్‌ఎ వుంది. డిఎన్‌ఎ కోసం ఆర్రులు చాస్తున్నాయి. హోస్ట్ కావాలి.... ఈ భూగ్రహాన్నంతా ఆక్రమించి ఒక బ్రహ్మాండమైన బహుకణజీవిగా ఎదగాలి... వాటికి మొదలు లేదు, ఆలోచన లేదు... ఇన్‍స్టింక్ట్... అంతే!

ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన స్వైన్‌ఫ్లూ జ్వరం నేపధ్యంలో రాయబడిన ఈ వైజ్ఞానిక థ్రిల్లర్ నవల... డా. చిత్తర్వు మధు ఇదివరలో రాసిన ఐసిసియు, బై బై పోలోనియా లకి సీక్వెల్!

మొదలు పెడితే ఆగకుండా చదివించే నవలాత్రయంలో ఆఖరిది.

ఈ భయంకరమైన ఎపిడమిక్‌కి ఎవరు కారకులు? అది ఎలా వ్యాపించింది? చివరికి ఎలా నిర్మూలించబడింది? తెలుసుకోవాలంటే ఆలస్యం ఎందుకు....?

చదవడం మొదలుపెట్టండి!

Preview download free pdf of this Telugu book is available at The Epedemic
Comment(s) ...

Madhu sir...i love ur books

Very nice with good twists! Thanks!

- గోపాలం. కె.బి.
06/05/2012

:

ది ఎపిడమిక్ -Review in Andhra bhoomi daily Akshara
(నవల)
రచన: డా.చిత్తర్వు మధు,
వాహిని బుక్‌ట్రస్ట్,
విద్యానగర్,
హైదరాబాద్-44
పేజీలు: 233,
వెల: రూ.130/-

సైన్స్ ఫిక్షన్ రచనలు అరుదుగా రావడానికి కారణాలున్నాయి. రచయితకు ముందు సైన్సు గురించి మంచి అవగాహన ఉండాలి. అందులోనుంచి ఆసక్తికరమయిన కల్పన చేయగలగాలి. కథ చదివే వారికి, ఇలా జరుగుతుందేమోననిపించాలి. కల్పన మరీ హద్దులుదాటితే, అవి ఫిక్షన్ పోయి ఫాంటసీగా మారుతుంది. ఈ పద్ధతిలో కథలు, నవలలు రాసిన వారు, కాలంలో వెనక్కు, ముందుకు వెళ్లడం, గ్రహాంతర యానం లాంటి విషయాలలోనే చిక్కుకుని రాశారు. ఇప్పటికీ, ప్రపంచమంతటా ఈ రకం రచనలు వస్తూనే ఉన్నాయి.
వృత్తిపరంగా వైద్యులయిన చిత్తర్వు మధు, వరుసగా మూడు నవలలు రాశారు. అందులో ఇది మూడవది. పత్రికలో సీరియల్‌గా కూడా వచ్చింది. ఇందులోనూ గ్రహాంతర యానం ఉంది. కాలంలో వెనక్కు వెళ్లడమూ ఉంది. అయితే, రచయిత వైద్యుడు గనుక, బోలెడంత వైద్యం కూడా ఉంది. ఒక దుర్మార్గం డాక్టరు కాలంలో వెనక్కు విసిరివేయబడతాడు. అది మరీ వెనక్కుకాదు. అక్కడ మరి, వేరే గ్రహాలనుంచి నౌకలు దిగుతాయి. వాటిలోనుంచి వైరసును తెచ్చి, అతను తిరిగి ప్రస్తుతంలో అంటువ్యాధిని సృష్టిస్తాడు. అదే ‘ఎపిడమిక్!’
కథకు హంగులుగా, ఈ నవలలో అడవి జాతి మనుషులు, హీరో కాని హీరోకి ఒక అమ్మాయితో శృంగారం, పెళ్లీ, రాజకీయం, కుట్రలు, కుతంత్రాలు, కవిత్వం, మరమనుషులు, వరదలు, ప్రమాదాలు, పిల్లల మీద ప్రేమ, ఎన్ని అంశాలో! అడుగడుగునా ఉత్కంఠతో పేజీలు తిప్పుతారని, రచయిత తానే చెప్పేశారు. ఇక పాఠకుల పరిస్థితి వారికే వదిలేద్దాం! మరమనిషికి ప్రపంచంలోని భాషలన్నీ వస్తే ఆశ్చర్యంలేదు. కానీ పాతకాలం అడవి వారికి, మన ‘రావు’్భష అర్థమవుతుంది. ఫాంటసీ అంటే ఆలోచన మరీ స్వైరవిహారం చేయాలి. ఈ నవల్లో మాత్రం అంతా ఎక్స్‌పెక్టెడ్ లైన్స్‌లోనే సాగింది కథ! ఈ రకం నవలలు చదివే ఓపిక ఉంటే బాగానే ఉంది. సీరియల్‌గా వారంవారం కొంత చదవడం వేరు. నవలను ఒక్కసారి ఈ చివరనుంచి ఆ చివరకు చదవడం వేరు.
ఖర్చుకు ఓరిస్తే ఈ నవల, సినిమాగా బాగుంటుందేమో? అయినా ఇలాంటి ఆసుపత్రి సినిమా ఎవరు చూస్తారు?
గొప్ప నవలలే రావడం లేదు. మూడు నవలల మధ్యన మధు నవల వెరైటీగా ఉందన్నమాట మాత్రం సత్యం.

6-5-2012 Andgra Bhoomi Sunday Akshara page

This is the last of the space science fantasy trilogy I wrote.It is about the return of Rao the villain doctor to the present from the time prison and back yo his nefarious ways this time creating an epidemic inadvertently to earn money.The twin cities and India and the whole aorld is threatened by a pandemic due to a space virus.How the Doctors Abhijit Shilpa and Ravi prevent the epidemic and Hora the humanist and Time Lord comes back...to help them with Polonia all this makes wonderful reading unheard of in Telugu.