-
-
భవతీ భిక్షాందేహి
Bhavatee Bikshamdehi
Author: Illindala Saraswati Devi
Language: Telugu
ఈ నవల తొలుత జయశ్రీ మాస పత్రికలో సీరియల్‌గా ప్రచురితమై పాఠకులని ఆకట్టుకుంది. 1976లో ప్రధమ ముద్రణ పొందింది. ఇప్పుడు డిజిటల్ రూపంలో పాఠకుల ముందుకు వస్తోంది.
* * *
"అతను కాసేపు నిలబడితే ఏం? సన్నగా పిలుస్తాడు. ఎవరూ పలక్కపోతే వెళ్ళిపోతాడు. అన్నం కోసం వచ్చినవాడు కాసేపు నిలబడితే తప్పా? అతడంత గుర్రమెక్కి వస్తే ఎవరు వణుక్కుంటూ పెడతారు?" తండ్రి మీద విసుక్కున్నది ప్రమీల.
"అది కాదమ్మా. అతడు చదువుకునే పిల్లవాడు. నాలుగిళ్ళలో తెచ్చుకుని ఒక చోట కూర్చుని తినాలా? పుస్తకాలు సర్దుకుని వేళకు స్కూలుకు వెళ్ళాలా? మనం పెట్టదలచుకున్నది ఏదో అతను రాగానే మర్యాదగా పెడితే ఏం? మనం పెట్టే ఆ పట్టెడన్నం అతడిని అరగంట నిలబెట్టి, ధుమధుమలాడుతూ మనసులో నాలుగు తిట్టుకుంటూ పడేస్తే ఏం బాగుంటుంది?” గట్టిగా మందలించాడు కోటయ్య కూతుర్ని.
"అతడి మాట వినగానే పళ్ళెం తీసుకుని వస్తూనే ఉన్నాను నాన్నా. అతను వచ్చి ఎంతో సేపయినట్లూ, ఎవరూ పలకనట్లూ, అతడు అలా వెళ్ళిపోవడమేమిటి బెదిరించినట్లుగా? ఎవరిని భయపెడదామని? ఎవరిని సాధిద్దామని?" కోపం ముక్కు మీద పెట్టుకుని గబగబా అరిచింది ప్రమీల.
* * *
అండలేని ప్రతి వ్యక్తి బ్రతకటానికి యాచించనవసరంలేదనీ, కష్టపడి ఆత్మ గౌరవాన్ని పాదించుకుని ఉన్నత స్థాయికి చేరవచ్చనీ ఈ నవలలో చెప్పారు రచయిత్రి.

- ₹162
- ₹96
- ₹108
- ₹96
- ₹162
- ₹72