-
-
మియర్ మేల్- పోయెమ్స్ ఫర్ మెన్ ఇన్ తెలుగు
mere male poems for men in telugu
Author: Arun Sagar T
Publisher: Andromeda Publication
Language: Telugu
నథింగ్ మోర్ దెన్, నో బెటర్ పురుషుడితడు. ఇతడు కేవల పురుషుడు. ఇతన్లాగా కవిత్వం రాసిన వాడెవడూ లేడు ఇతను తప్ప. పరిపరి విధాల వామాక్షుల గురించి వివిధ అవస్థలలో, వివిధ చిత్తవృత్తులతో కవనకీర్తింపును వినండి సాగర్ కవిత్వంలో. కవిలాగే కీచకుడు కూడా మియర్ మేలుడు. 'లవ్ ఆజ్కల్' కనుడు. నా జీవితమంతా నీ వెక్కడుంటివే అందాల రాక్షసీ అంటున్న సాగర్ ప్రేమను స్పూన్లతో కొలవండి. పిచ్చిగడ్డి మాటున కసుక్కున హృదయానికి దిగిన పాతికేళ్ల గుజుముక్కను ఆరాధించండి. అంతే తప్ప ఫెమినిజమనీ యాంటీ ఫెమినిజమనీ సిద్ధాంతీకరించారో... ---సీతారాం.
అనగనగా ఒక కవి.. ఆధునికానంతర గ్రహాంతర ఆటవిక ప్రేమికుడు. ఎటు చూస్తే అటు రంగులు. కళ్ళూ ఒళ్ళూ జిగేల్మంటుంటే నాడీమండలంలో బద్దలవుతున్న ఆర్డీయక్స్ శబ్దసమ్మోహన సంగీతంలో వివశుడై పరవశుడై ఒక పురావేదనలో పరితపిస్తున్న క్షతగాత్రుడు. ఎవడు వీడు. నవీన జీవన ఆక్టోపస్ సుందరి మీద పగబట్టి కత్తికట్టిన అసహాయ శూరుడు! ఎవడ్రా వీడు - మన బతుకు నిదరలో కలత రొద! లవ్ ఆజ్కల్ కా ఆజ్కల్ నమూనా. దునియా భర్కా లౌ లేనే వాలా.. డు యూ హ్యావిట్ ఫర్ హిమ్?" ---ప్రసాదమూర్తి.
