-
-
ముందే మేలుకో
Munde Meluko
Author: Valluru Siva Prasad
Publisher: Amaravathi Publications
Language: Telugu
ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు విజయవంతం కావాలంటే, వాటి ద్వారా ఒనగూడే ప్రయోజనాల గురించి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడం అత్యవసరం. లేకుంటే ఆ పథకాలు ఆశించిన మేర విజయవంతం కావు. కుష్టువ్యాధి, పోలియో, రాబిస్, ఎయిడ్స్ వ్యాధుల గురించిన అవగాహనతో పాటు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి, మెడికల్ షాపు వైద్యాలతో ప్రాణాల మీదకి తెచ్చుకోడం, కుటుంబ నియంత్రణ ఆవశ్యకత మొదలైన విషయాలను కథల రూపంలో కళాత్మకంగా రాయబడిన కథలివి.
ఈ కథలు విషయ ప్రధానమైనవి. ఈ కథల్లో సంక్లిష్టత కనిపించదు. శాస్త్రీయత, వాస్తవికతలకు తన అనుభవజ్ఞానాన్ని జోడించి సంక్షేమదృష్టితో ప్రముఖ కథా, నాటక రచయిత వల్లూరు శివప్రసాద్ రాసిన ప్రయోజనకరమైన కథలివి. పాఠకులలో వైద్యవిజ్ఞానాన్ని గురించి, ప్రాథమిక అవగాహన కలిగించే ఆణిముత్యాల్లాంటి కథల సంపుటి "ముందే మేలుకో"!
- ప్రచురణకర్తలు
