రాజులు రాణులు మాంత్రికులు, యక్షిణులు, పిశాచాలు, అడవులు, ఆటవికులు, లోయలు, కొండలు, నదులు, సెలయేళ్లు, పక్షులు, చెట్లుచేమలు.... ఒక అద్భుత జానపద ప్రపంచంలో మధుబాబు సృజించిన నవల "వెన్నెల మడుగు".
* * *
"నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావా అని ఎదురుచూస్తున్నాను..." అంటూ నమస్కారం పెట్టాడు విజయుడు.
"నరమానవుడు కంటపడితే వలుచుకు తినే రాక్షసిని నేను.... నీ దగ్గర పదునైన కత్తి వుంది. దానితో నన్ను చంపలేదెందుకని?" ఆశ్చర్యంగా అడిగింది బింబాధరి.
"నిన్ను చంపటానికి నేను రాలేదు. నీ సహాయం కోరటానికి వచ్చాను" అన్నాడు విజయుడు.
"నువ్వు ఎవరివో గాని మహా సాహసవంతుడివి మాదిరిగా ఉన్నావు. ఈ రోజు మా యక్షరాక్షసులకు నాయకుడైన మహోదరుడు పుట్టినరోజు. నేను వెంటనే అక్కడికి పోవాలి. తిరిగి వచ్చిన తరువాత నీ మాటల్ని వింటాను. అంతవరకూ ఇక్కడే వుండు" అంటూ భవనంలోనుంచి బయటికి బయలుదేరింది బింబాధరి.
"తూర్పుగదిలో వున్న బిలద్వారం దగ్గరికి పోకు.... పాతాళానికి దారి అది.... అందులో అడుగుపెడితే ప్రాణాలతో బయటికి రావు" అని చెప్పి చేతుల్ని ఊపింది.
probably his wors
not at all Madhubabu style of writing........full disappointed....
This novel is now available in Tenglish script with Kinige. For details, click the link.