-
-
నెవర్ లవ్ ఎ స్పై
Never Love A Spy
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Language: Telugu
"బయోదీ! మీతో మాట్లాడుతూ కూర్చునే టైం నాకు లేదు. నేను వచ్చినపని అయిపోయింది. ఇక మారణకాండను కొనసాగించటం నా నియమాలకు విరుద్ధం. సవానీని ఏదైనా సిటీకి చేర్చు. తెలివి రాగానే నేను హెచ్చరించానని చెప్పు. నేపాల్ దేశంలో భారతీయులకు ఆది నుంచీ స్నేహసంబంధాలున్నాయి. ఈసారి యిటువంటి విద్రోహకర చర్యలు కొనసాగిస్తే నేపాల్ ప్రభుత్వానికి తెలియజేసి తగిన చర్య తీసుకునేటట్లు చేస్తుంది మా సి.ఐ. బి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పు. నువ్వు మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనిపిస్తే నీ మర్యాద దక్కదు" అంటూ జనార్ధన్ చేయిపట్టుకొని బోర్డర్ వైపు అడుగులు వేశాడు.
రైఫిల్ భుజానికి వేసుకొని వారిని అనుసరించింది బిందు.
నోరు తెరుచుకొని వారు కనుమరుగై పోయేదాకా చూస్తూ వుండిపోయారు బయోదీ.
షాడోని బీట్ చేయాలని తన్ను తయారుచేశారు. షాడో నేర్చిన విద్యలన్నిటినీ నేర్పారు. కానీ ప్రపంచంలో వున్న వారందరి గుండెలకంటె పెద్దదైన జాలిగుండెనే తనకు అమర్చటం మర్చిపోయారు తన బాస్లు. అది లేకుండా షాడోతో సమానుడని చెప్పుకోవటం అవివేకం, పిచ్చితనం.
This book is now available in Tenglish script with Kinige. For details, click on the link.