• Kavisena Manifesto
 • Ebook Hide Help
  ₹ 60 for 30 days
  ₹ 324
  360
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • కవిసేన మేనిఫెస్టో

  Kavisena Manifesto

  Pages: 250
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

*ఈనాడు కావలసింది సామాజిక చైతన్యం కాదు . సాహిత్య చైతన్యం

*కవిత్వం బతుకు తెరువు కాదు .... జీవన విధానం

*వచనంలో ఏది చెప్పాడనే దానికి స్దానమున్నట్లే కవిత్వంలో ఎట్లా చెప్పాడనే దానికే ప్రధాన స్థానం ఉంటుంది .

*వర్తమాన తెలుగు మహా కవులు కవిత్వపు కల్తీ లేని స్వచ్చమయిన వచనమే రాస్తున్నారు .

*ప్రతి కవితా ఎలా ఉండాలి ? ... .. చదివి పాఠకుడు చావాలి . కొత్త జన్మ ఎత్తాలి .

*కవి నడుస్తున్న మానవతా సంక్షిప్త శబ్ద చిత్రం .

- శేషేంద్ర

* * *

1977లో వచ్చిన ఈ కావ్య శాస్త్రం , అప్పట్లో సాహిత్యంలో అన్ని వర్గాలనూ , అన్ని సంఘాలనూ తీవ్రమయిన ఆందోళనకు , మనస్తాపానికి గురి చేసింది . నిజం అంత ప్రమాదకరమయింది . నేటికీ తెలుగు కవిత్వంలో అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి . మరింత తీవ్ర రూపం దాల్చాయని చెప్పవచ్చు . కనుకనే కవిసేన కావ్య శాస్త్రం అన్నికాలాలకూ వర్తిస్తుంది .

* * *

ఒక కవి రాశిన ఆధునిక కావ్యశాస్త్ర్రం - తెలుగుదేశంలో నూతనంగా కవిత్వభోధ అభివ్యాప్తం చెయ్యడానికి ప్రయత్నించే గ్రంథం-

అపూర్వ చైతన్య వ్యాప్తి కోసం ఐతిహాసిక పరిస్థితుల్లో ఆవిర్భవించిన ఒక ఉద్యమపత్రం.

సామాన్య శబ్దానికి అసమాన్య ఆకర్షణ శక్తి ప్రదానం చేసి, దాన్ని మహత్తర పురోగమన సాధనంగా మార్చే అయస్కాంత విద్యను యువతరానికి నేర్పడానికి సాహిత్య సత్యాగ్రహయోద్ధల్ని మలచడానికి శబ్దరూపమెత్తిన కృషి-

ప్రాచీన ప్రాక్ పశ్ఛిమ కావ్యతత్త్వ చింతన, ఆధునిక కావ్యతత్త్వ చింతన, మార్క్సిస్టు కావ్యతత్త్వ చింతనా అనే చింతనా చతుష్టయ శాఖల్ని కలిపి పరిశీలించి ఆ నాల్గింటిలో ఉన్న ఆశ్చర్య జనక అభిన్నతనూ ఐకమత్యాన్ని ప్రతిపాదించి, ఈ విజ్ఞాన భారాన్నంతటినీ మోస్తేనే ఆధునిక మానవుడి విజ్ఞానానికి సమగ్రత వస్తుందని ప్రతిపాదిస్తుంది.

శోకము ప్రీతి సత్త్వము సమాధి ఆది శబ్దాలకున్న అలంకారిక ప్రతిపత్తి - ప్రతిభ జన్మసంస్కారం కాదు, సమాధిగానీ విలక్షణ వ్యుత్పత్తిగానీ సాధించగల శక్తి అనే అలంకారిక మతము- కవే ప్రాచీన మత వాజ్ఞ్మయ కర్త- వాల్మీకి ప్రధమ ప్రజాకవి- వాల్మీకి ఉపమలు ప్రతీకలే- కవి శోకజ్వాలే కవిత్వంలో కమిట్మెంట్ ఇత్యాది నూతన విశేషాలు ఆవిష్కరిస్తుంది.

* * *

శేషేంద్ర సాహిత్య జగత్తును జీవిత విశేషాలను ఈ కింది హోం పేజి లో దర్శించండి .

Seshendra : Visionary poet of the Millennium

http://seshendrasharma.weebly.com

Preview download free pdf of this Telugu book is available at Kavisena Manifesto
Comment(s) ...

KAVISENA MANIFESTO
Seshendra Sharma – possibly the best known and most discussed modern Indian poet and thinker fulfils his dream of writing on four systems of thought on literature, namely The Ancient Indian Poetics, The Ancient Western Poetics, The Modern Western Poetics, and Marxist Poetics. This Manifesto as it is called remains one of the peaks of Seshendra’s achievement. It presents us with a full – length comparative studies of systems of East , West and Marxist poetic philosophy for which Seshendra has become famous.
The manifesto is brilliant, makes very easy reading for students of literature and a valuable guide to those who teach poetics gives a comparative assessment of the science of poetics by one of the front rank intellectuals.
Kavisena is an intellectual movement with a view to reshape the new minds to impart strength of truth to the younger developing generations. Manifesto, teaches them how to invest the magnetic power of poetry on the common word and turn literature into a weapon in the cause of change and progress. Possibly this is the first time in India that a poet lifted his pen to write poetics for his time and has brought his intelligence to bear on the lives and problems of his country.

బ్రతుకు తోటలో బంగారు పాట

కర్మశేషం ముగిసి, కర్తవ్యాలు నెరవేరి, జీవాత్మ పరమాత్మను చేరుకొన్న రోజున గాజుపేటికలో శాశ్వతనిద్రలో ఉన్నప్పుడు అంజలి ఘటించడానికి వెళ్ళి ఆయనను చివరిసారిగా చూసిన దృశ్యం నాకిప్పటికీ కన్నులలో మెదులుతున్నది. మంగళస్నానం చేసి, పసిమి పట్టువస్త్రాలు ధరించి, పుష్పమాలాలంకృతుడైన కొత్త పెళ్ళికొడుకు ఉత్సవసంరంభానికి సొమ్మసిల్లి విరిపాన్పుమీద మేను అరవాల్చినట్లుగా అనిపించింది. శతాబ్దాల లోతులను తరచి చూసిన ఆ విశాలనేత్రాలు వెలుగులీనుతున్నట్లే అగుపించాయి. ముఖంలో ఏదో జన్మాంతరసమీక్షారేఖ తళతళలాడుతున్నది. పెదవులపై చిరునవ్వు చెక్కుచెదరలేదు. వయోభారం వల్ల శరీరం ఒక్కింత నలుపుతేరింది. ఆవేశం కమ్మినపుడు ఆ సమున్నతనాసావంశం ఎలా నెత్తురులు చిమ్మేదో జ్ఞాపకానికి వచ్చింది. తెల్లని చేమంతి పువ్వురేకలు దిక్కుల నుంచి చుక్కలు నేలపైకి రాలినట్లు చుట్టూ చెల్లాచెదరుగా పడివున్నాయి. ద్రోణపర్వంలో తిక్కనగారు "ఆ కుమారోత్తముఁ డందు చంద్రు క్రియ నొప్పె; సితాయుధఖండభూషణో, దాత్తమణిప్రతానములు తారల చందము నొంది యందమై, యత్తఱి నుల్లసిల్లె వసుధాధిప! చూపఱపిండు చూడ్కికిన్" అని వర్ణించినట్లే ఉన్నదా పార్థివదేహం.

మృత్యువులోనూ ఎంత అందం! చేతులు జోడించి నమస్కరించాను.

అందం నిండిన చందం

జీవితాన్ని సౌందర్యకలశరత్నాకరపు సారనవనీతంగా పూర్ణాస్వాదించిన గుంటూరు శేషేంద్రశర్మ గారు నిజంగా సాహిత్యవిద్యాధరులు. తండ్రిగారి సన్నిధిలో నేర్చి ఉపనిషత్తులను, వాల్మీకి రామాయణాన్ని, కాళిదాసు కృతులలోని అందాలను గుండెలలో నింపుకొన్నారు. నైషధీయ సౌందర్యరహస్యాలను హృదయోల్లాసంగా మథించిన మేధావి. ఆనందవర్ధనుని నుంచి ఆర్చిబాల్డ్ మెక్లీష్ దాకా ఆలంకారికులందరూ ప్రాణస్నేహితులే మరి. ఆంధ్రకవితావ్యాహారం ఆయన గళసీమలో సువర్ణమణిహారమై ప్రకాశించింది. పాశ్చాత్యసాహిత్యికులందరినీ ఆత్మీయం చేసుకొన్నారు. సంస్కృతాంగ్లాలలో పారంగతులు. ఆధ్యాత్మిక కవిత్వాభిమానం వల్ల పారశీక భాషాకుటుంబంతో చుట్టరికం తప్పలేదు. ఇన్ని సంస్కారాలను ప్రోదిచేసుకొని రచనావ్యాసంగానికి ఉపక్రమించారు. ఆ అందచందాలు అందరికీ అందవు.

అందమే అలంకారమని నమ్మిన వామన మతానుయాయులలో త్రివిక్రము డాయన. ఆ సౌందర్యాన్వేషణమే జీవితంలోనూ కవిత్వంలోనూ ఆయనకు సరికొత్త లోకాలను పరిచయం చేసింది. ఆ సౌందర్యబంధం వల్లనే కావ్యజీవితం రసాత్మకం కాగలిగింది. ఆయన కవితాదర్శం సమస్యల మంచుపొరలను తొలగించి విశ్వమానవునికోసం వెలుగులు నింపిన మండే సూర్యుడా? జీవితంకంటె విలువైన జీవితసందేశాన్నిచ్చిన అఖండ కాలాతీతపురుషుడా? భామహుడా? ఆయన భావవిప్లవభాషావిధాతా? సోషలిస్టా? సోక్రటీసా? అనిపిస్తుంది.

సౌందర్యమే ఆయనకు అలంకారం, సౌందర్యమే ఆయనకు జీవితం.

విమర్శకుడు : కవి

శేషేంద్ర నాకెప్పుడూ ఒక ప్రాచ్య మహావిమర్శకునిగా, ఆ తర్వాత అంతటి అభిరూపుడైన గొప్ప కవిగా భాసిస్తారు. విమర్శవ్యాసం అనేసరికి ఆయన వ్యాఖ్యాతృశిరోమణి జయరథునిలా అనిపిస్తారు నాకు. ఆ రచనలో ఎన్ని విన్యాసాలని!
సృజనాత్మకవిమర్శలో అందాలు

"సాహిత్యకౌముది" శర్మగారి విమర్శసరళికి ఆద్యప్రకృతి. కవిత్వంలోని అందాలను
ఆ కళ్ళతోనే చూడాలి. అందులో శ్రీనాథుని కవితాజగన్మోహనరీతిని నిరూపించిన తీరు, శ్రీనాథ పినవీరన జక్కనలు రెండవ కవిత్రయమన్న కొత్త ఊహ, కళా-విజ్ఞానశాస్త్రాల లక్ష్యలక్షణాలను సమన్వయించటం - ఎప్పటికీ నిలిచే వ్యాసాలవి. "స్వర్ణ హంస " నైషధీయచరితంలోని మంత్రశాస్త్రవిశేషాలను వెలికితీసిన మరో సంజీవని. మల్లినాథుణ్ణి చదువుకోలేదని శ్రీనాథుణ్ణి గౌణీకరించారని కొందరికి కోపం వచ్చి కరపత్రాలు అచ్చువేశారు ఆ రోజుల్లో. నిజం నిష్ఠూరంగా ఉండకుంటుందా?

రామాయణ రహస్యాలను వివరించే "షోడశి" నిజంగా ఆయన జన్మాంతర సంస్కారసారమే. వాల్మీకీయ హనుమత్సందేశం కాళిదాసు మేఘదూతానికి ఎంత అందంగా నిరూపించారని! త్రిజటాస్వప్నం మాటేమిటి?

విమర్శ శబ్దశాసనం

కావ్యవిమర్శలో శేషేంద్రశర్మగారు సౌందర్యశిల్పశాస్త్రానికి శబ్దశాసనం చెయ్యాలని ఉద్యమించారు. కుంతకుని వక్రోక్తినీ, మయకోవ్స్కీ ఆలంకారికతను, మెఝెలైతిస్ సంప్రదాయనిష్ఠను, కాళిదాస వాల్మీకుల రూపణకౌశలాన్ని ఆధునికపరిభాషలోకి అనువదించే ప్రయత్నం చేశారు.

హైదరాబాదుకు వచ్చిన తర్వాత అక్కడి విరుద్ధశక్తుల త్రివేణీసంగమంగా ఆయన వైమర్శికప్రయోగం "కవిసేన మేనిఫెస్టో" అవతరించింది. దాని హృదయం మంచిది. ఆ తర్వాత జరిగిన అనుయాయుల ఆర్భాటం వల్ల అనుకూల ప్రతికూల విమర్శలు చాలానే వెలువడ్డాయి. దాని ప్రతిపాదనలోని కొత్తదనాన్ని అధ్యయన చేయవలసిన ఆవశ్యకత
ఇంకా మిగిలే ఉన్నది. దానికి కాలదోషమంటూ ఉండదు.

"రక్తరేఖ"లో అడిగే ప్రశ్నలన్నీ విద్యార్థులు మననం చేయదగినంత మౌలికమైనవి. అందుకు అలంకారప్రస్థానాన్ని పునరుజ్జీవింపజేసే ఆయన సమాధానాలన్నీ మౌలికమైనవే.

ఆయన "కాలరేఖ" అంతే. తెలుగు సాహిత్యవిమర్శకు శిఖరకేతనం. అందులో స్వర్ణహంసిలోని మార్మికభాషను విడిచి, వర్తమాన భావుకులకు భావభావనను నేర్పారు.

అనల్పమైన కల్పనాశిల్పం

తొలిరోజులలో మిత్రులతో ఆశుకవిత్వాభ్యాసం ఉండేది. అవధానాల స్వర్ణయుగం ప్రభావం తప్పుతుందా? "ఏమయ్యా! పదియైన, దింక పడుకో!" అంటే, "ఏడ్చావులే ఊరుకో!" అనటం; శార్దూలాన్ని ముందుకు దూకించటం.

ఆ ఆశుధారాప్రణయనం ఆయన పద్యశిల్పంలో సమాధిగుణానికి భంగకరం కాలేదు. యౌవనంలో ఉన్నప్పుడు మేథ్యూ ఆర్నాల్డ్ రచన ఆలంబనగా 'సొరాబు' కావ్యం చెప్పారు. అది పఠితలను ఆవేశోద్వేగాలలో ముంచెత్తివేసే ధీరోదాత్తసన్నివేశకల్పనలతో వీరరసోల్బణంగా దువ్వూరి రామిరెడ్డి, ఉమ్రాలీషా కవుల సమ్మోహకమైన శైలిలో పారశీక రూపకోత్ప్రేక్షలతో రమణీయంగా సాగింది. ఇప్పటికీ ఆయన రచనలలో నాకిష్టమైన కావ్యం అది. మధురిమకు మారుపేరు.

ఆ తర్వాత వెలసిన "పక్షులు", "మండే సూర్యుడు" అభ్యుదయభావనలో వ్యక్తీకరించిన చిరంజీవికావ్యాలు. "జనవంశం"లో శేషేంద్ర అంతరంగవేదన ధ్వనిస్తుంది. మళ్ళీ మళ్ళీ చదువుతుంటాను - నా గుండె చప్పుళ్ళ కోసం.

బ్రతుకు తోటలో బంగారు పాట

అర్ధశతాబ్ది శేషేంద్ర కవితల మైమరపించే ద్రాక్షతోటలో నిలిచి, ఏవేవో తీయని పలుకులలో పరిమళించే జ్ఞాపకాల బరువుతో కన్నులు మూసుకొన్నప్పుడు నా స్మృతిపథంలో రెండే – ‘ముత్యాలముగ్గు’లో "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది, కొమ్మల్లో పక్షుల్లారా! గగనంలో మబ్బుల్లారా!, నది దోచుకుపోతున్న నావను ఆపండి, రేవు బావురుమంటోందని నావకు చెప్పండి" అన్న గీతికామధుకోశం ఒకటీ, అంతకు ముందు "చెట్టునై పుట్టివుంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది, మనిషినై పుట్టి అదీ కోల్పోయాను" అన్న ముక్తక ముక్తాఫలం ఒకటీ గుప్పున గుబాళించి, విరికన్నెల చిరునవ్వుల వెన్నెల వెలుగులను వెలార్చే ఆ వినిర్మలత్వం నిండునూరేండ్లు చల్లగా వర్ధిల్లాలని మనస్సులోనే ముడుపులు కడతాను.
- డా .ఏల్చూరి మురళీధర రావు

('నిదురోయిన పాట' అన్న శీర్షికతో ఒకప్పుడు 'సాక్షి' దినపత్రికలో అచ్చయిన వ్యాసం లిఖితప్రతి.)

కవితానుభూతి ప్రేక్షకుల స్థాయికి అందనప్పుడు, అది నిరర్థకం కాక తప్పదనే ఆవేదన వీరిలో ఉంది. ఆఫ్రికా అడవుల్లో పచ్చలు, వజ్రాలు పొదిగిన అందమైన అంగుళీయకం పడవేసినా, అక్కడి జనులు దాన్ని తాకనైనా తాకకుండా తొక్కుతూ పోయినట్లు. అందమైన కవిత్వం సైతం స్పందన లేనివారి సమక్షంలో ఎందుకూ కొరగాకుండా పోతుందంటారు. కవిత్వం మనిషిని కార్యోన్ముఖుణ్ణి చేయాలని, కవిత్వం తన శక్తితో మనిషిలో ఆశాజ్యోతిని ఆరనీయకుండా చూడాలని శేషేంద్ర సంకల్పించారు. అందుకే ఆయన - "జీవితం ఒక మహాసముద్రం కావచ్చు కాని, ఆశ అనే నావతో దాన్ని దాటేయోచ్చు" అంటారు.

ఎంత అయోమయంగా రాస్తే అంత గొప్ప వచన కవిత అనే ధోరణిని ఆయన నిరసించారు. యూరోపియన్ కవుల కవితాత్మను పూర్తిగా అవగాహన చేసుకోకుండా కేవలం ఉపరితల పరిశీలనతో అనుకరణలు సృష్టించవద్దంటారు. పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం భారతజాతికి ఎనలేని మేలు చేసిందనే వాదనను శేషేంద్ర అంగీకరించలేదు.