-
-
ఆధునిక వ్యవహార కోశం - రివైజ్డ్
Adhunika Vyavahara Kosam Revised
Author: Budaraju Radhakrishna
Publisher: Prachee Publications
Pages: 390Language: Telugu
ఇరవై సంవత్సరాల పాటు తెలుగు అకాడమిలో పరిశోధనశాఖాధిపతిగా పనిచేస్తున్నప్పుడు భిన్నశాస్త్రాలకు సంబంధించిన పారిభాషికపదాలను సేకరించి, ఆయా శాస్త్ర విద్వాంసులతో చర్చించి అవసరమైన సందర్భాలలో పరిభాషను కల్పించటం నా ఉద్యోగవిధుల్లో ఒకటిగా ఉండేది. అప్పట్లో కందుకూరి వీరేశలింగం కాలంనుంచీ శాస్త్ర సాహిత్యంలో కనిపించిన ఆయా వ్యక్తులూ సంస్థలు పట్టికాబద్ధం చేసిన పారిభాషికాలను గూడా కేంద్రప్రభుత్వంలోని కమీషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ వారు సమకూర్చిన పదజాలంతో పాటు పరిశీలించక తప్పలేదు. ఆ సంస్థ నుంచి బయటపడి పుష్కరకాలం గడచినా పారిభాషిక పద సేకరణ మీద అభినివేశం అలాగే ఉంది.
పదవీవిరమణానంతరం ఈనాడు పత్రికల్లోని భాషా స్వరూపాన్ని అధ్యయనం చేసి 1981లో ఒక చిన్నగ్రంథం ప్రచురించాను. ఆ సంస్థ పత్రికాభాషలోని పారిభాషికాలను సేకరించి ఇంగ్లీషు-తెలుగు పదకోశం సిద్ధం చేయమన్నది. ఆ ప్రయత్నం ఫలించి 1990లో 'ఈనాడు వ్యవహారకోశం' వెలువడింది. ఈ దశాబ్దకాలంలో మరికొన్ని వేల పారిభాషికాలను సమకూర్చి పరివర్థితరూపంలో అదే పదకోశాన్ని పునఃప్రచురించాలని ఆకాంక్షించాను. ఆ కోరిక నేటిదాకా నెరవేరలేదు. పత్రికల్లోనే గాక పాఠ్యగ్రంథాలల్లో అనూదితరచనల్లో లభించిన సాంకేతిక పదాలను వ్యవహరకోశంలో అంతకుముందు చేరినవాటితో కలిపి, పూర్వప్రచురణలోని దోషాలను చేతనయినంతలో సరిదిద్దుకొని, పరిష్కృత పరివర్థితరూపంలో ఈ ఆధునిక వ్యవహార కోశాన్ని ఈ రూపంలో ఇప్పుడు వెలువరిస్తున్నాను.
పాత్రికేయులకు, అనువాదకులకు, తెలుగులో శాస్త్రగ్రంథరచన తలపెట్టిన సాహితీపరులకు కొంతవరకయినా ఈ పదకోశం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. లిప్యంతరీకరించి తెలుగులో సాంకేతిక పదాలుగా వాడుతున్న పదాలీకోశంలో ఎక్కడోగాని కనిపించవు. వైద్య న్యాయ శాస్త్రాలకు సంబంధించిన ప్రాథమిక పరిభాష ఇందులో లభిస్తుంది.
- బూదరాజు రాధాకృష్ణ
* * *
అనేకమంది మిత్రులు చేసిన ప్రధాన సూచనలని యీ కూర్పు వెలువరించే సందర్భంగా దృష్టిలో పెట్టుకొనే ప్రయత్నం చేసాను. అక్షరాల్ని కొంత పెంచి కంటికి శ్రమ తగ్గించటమూ, ఆరోపాల అకారాదిక్రమంలో లోపాల్ని (రాధాకృష్ణగారు సరిచేయగా మిగిలినవాటిని) సరిచేయడమూ.
- ప్రచురణకర్తలు

- ₹60
- ₹81.6
- ₹108
- ₹243
- ₹75.6
- ₹60
- ₹60
- ₹60
- ₹243
- ₹135
- ₹64.8
- ₹675.6