-
-
అస్త్రం
Astram
Author: Dr. K. L. V. Prasad
Language: Telugu
డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు వృత్తిరీత్యా డాక్టరే కావచ్చు, ప్రవృత్తిరీత్యా మాత్రం సాహిత్యోపజీవి. సాహిత్యం అంటే ఏదో ఒక ప్రక్రియకు పరిమితమైన వ్యక్తి కాదు. అన్ని సాహితీప్రక్రియల్ని అమితంగా ప్రేమించి, అన్నింటిలోనూ అంతో ఇంతో శ్రమ చేసి తమ అభిరుచికి మెరుగులు పెట్టుకున్నారు. తమ వైద్య విభాగానికి సంబంధించిన అనేక అంశాల్ని వ్యాసాల రూపంలో తెలుగునేలలోని వివిధ పత్రికల్లో వెలువరించడమే గాక, ప్రత్యేక గ్రంథాలుగా కూడా వెలువరించారు. వృత్తి సంబంధమైనవే కాక సృజనాత్మకమైన రచనల్ని కూడా పుంఖానుపుంఖాలుగా పత్రికల ద్వారా వెలయింపజేస్తునే ఉన్నారు. సహృదయ వంటి ఒక విశాలమైన సాహిత్య సాంస్కృతిక సంస్థకు పుష్కరకాలం పాటు అధ్యక్ష బాధ్యతల్ని నెత్తిన వేసుకుని సమర్థంగా నిర్వహించారు. తన వృత్తికి సమయాన్ని పూర్తిస్థాయిలో వెచ్చిస్తునే రచనావ్యాసాంగాన్ని కొనసాగించడం అంత తేలికైన విషయం కాదు. కాని ప్రసాద్ గారు అందులోనూ విజయం సాధిస్తునే ఉన్నారు. వారిలో ఉన్న జిజ్ఞాస, సమాజ పరిశీలన, అధ్యయన శీలత్వం ప్రశంసింపతగినవి.
- జి. గిరిజామనోహరబాబు
