-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
కలాం సలాం! (free)
Kalam Salam - free
Author: Kavi Sangamam
Publisher: Kavi Sangamam Books
Pages: 76Language: Telugu
Description
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏ.పి.జె అబ్దుల్ కలామ్‌కు కవిత్వ నివాళి
* * *
ఎప్పటికైనా జరుగుతు౦దని తెలుసు
ఈ విస్పోటన౦
ఎవర౦ కూడా ఎ౦త కాల౦
ఆపలేము కదా
ఐనా ఎక్కడి వరకు పోగలవు నువ్వు
విశ్వమ౦తా వ్యాపి౦చి వున్న
నీ కీర్తిలో...
ఈ మరణ౦ 'అణు'మాత్రమే
మళ్ళీ పుడతావు నువ్వు
పుట్టాలని మే౦ కోరుకోకున్నా
జరిగే మహా పరిణామమే
నీలా౦టి త్యాగధనుల జనన౦
వెళ్ళి పోతున్నాననుకు౦టున్నావు కదా!
మళ్ళీ వస్తావులే...
ఈ నివాళులు
రేపటి నీ రాకకు స్వాగతాలనుకో...
రా...వెళ్ళినట్లే వెళ్ళి ... మళ్ళీ , రా..
నిన్ను కలుపుకునే ఈ మట్టి
కలలు క౦టు౦ది
మళ్ళీ నువ్వు పుట్టాలని..
- కొత్త అనిల్‌కుమార్
good
anna ni kalaniki niku namaskaram anna ur miyapuram srikanth great great writer annaya
Very Good Poems on Abdul Kalam SIR. SIR we miss you.
great
Great man
Superrr
మంచి ప్రయత్నం. మంచి మనిషికి కవితా నిరాజనం- అభినందనలు- పెద్ది సాంబశివరావ్
Great man
సలాములు! సలాములు! శ్రీ అబ్దుల్ కలాము వారికి మా అందరి నివాళులు.
మహమ్మదీయులు, హిందువులు, క్రైస్తవులు, బుధ్ధులు, జైనులు మొదలైన భారతీయులమందరమూ బేధ భావాలు లేకుండా కలిసి కట్టుగా సమస్త భారతావనిని నిండు గా ప్రేమించిన అహమ్మదీయ హృదయానికి సలాములు,నివాళులు అర్పిస్తున్నాము.
అబ్దుల్ కలాం గారంటే కలికాలం లో ఓ అద్భుతమైన మానవుడి గా మీరు అందరి నోళ్ళలో నానుడి అయ్యారు. పేరుకి మాత్రమే అధ్యక్షుడి గా కాదు ఆ స్థానానికి వున్న దక్షతలని, విలువలని లక్ష్యం గా సాగించిన మీకు సలాములు,నివాళులు.
ఎన్నో పురస్కారలందుకున్న కలాం గారంటే ఒక శాస్త్రవేత్తగా, విజ్ఞానవేత్తగా, విద్యావేత్తగా, సైనికవేత్తగా, యుధ్ధవేత్తగా, సంస్కారవేత్తగా, సమాజవేత్తగానే కాక నిరుపేదల, నిర్భాగ్యుల పురోగతినే నిత్యమూ కలలు కన్న మీ సహృదయానికి మా సలాములు, నివాళులు.
రామేశ్వరం లో పుట్టి పెరిగి అన్యమతస్థులైనా అబ్దుల్ గారు ఒక అబ్బురమైన కలియుగ రాముడిలా నిరాడంబరగా ధర్మబధమైన, క్రమబధ్ధమైన జీవించిన విధానానికి సకల సలాములు నివాళులు.
మీ కలాలని నిజం చేసే సద్భావాల్ని, కార్య దీక్షతలని మేము అందిపుచ్చుకుంటే అదే మీకు మేమర్పించే సలాములు నివాళులు.

really he is the one man hero
Great