• Q Aame Kanabaduta Ledu
 • Ebook Hide Help
  ₹ 60
  120
  50% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • క్యూ - ఆమె కనబడుట లేదు

  Q Aame Kanabaduta Ledu

  Author:

  Pages: 170
  Language: Telugu
  Rating
  4.69 Star Rating: Recommended
  4.69 Star Rating: Recommended
  4.69 Star Rating: Recommended
  4.69 Star Rating: Recommended
  4.69 Star Rating: Recommended
  '4.69/5' From 54 votes.
  4.82 Star Rating: Recommended
  4.82 Star Rating: Recommended
  4.82 Star Rating: Recommended
  4.82 Star Rating: Recommended
  4.82 Star Rating: Recommended
  '4.82/5' From 51 premium votes.
Description

క్యూ ఆమె కనబడుట లేదు.. బుక్‌షాపులో పుస్తకాల మధ్య చూస్తే ఓ డిటెక్టివ్ నవల అనిపిస్తుంది. కాని ఇది సైన్స్ ఫిక్షన్! చదవడం మొదలుపెట్టగానే కంట్లో కరిగిపోతుంది. మనస్సులో ఇంకిపోతుంది. క్యూ – ఆమె కనబడుట లేదు ఓ అందమైన అమ్మాయి రోబో ! క్యూ అనే గ్రహంలో శాస్త్రజ్ఞులచే తయారై భూమి మీద అడుగుపెడుతుంది. హైదరాబాదుకొస్తుంది. దేనికి – మనిషితో సంగమించి కొడుకుని ప్రసవించడానికి. ఆ పసివాడి పెరుగుదలలో వాడి మనసులో అనుభూతులు అధ్యయనం చేయడానికి! భూలోకవాసులకు కన్నీళ్లెందుకొస్తాయి? ప్రేమలేంటి, అనుబంధాలేమిటి, అనురాగాలేంటి తెలుసుకోవడానికి!

- రాంపా

Preview download free pdf of this Telugu book is available at Q Aame Kanabaduta Ledu
Comment(s) ...

గ్రహాంతరవాసితో ప్రేమలో పడ్డ హీరో ...పెళ్లయ్యాక తన (హీరో సిద్ధార్థ) ప్రతిరూపం ఆమె (గ్రహాంతరవాసి)కడుపులో రూపుదిద్దుకున్నాక కనిపించకుండా అదృశ్యమైన ప్రహేళిక...?ఈ ప్రపంచంలో కనిపెట్టలేనిది ఏమిటి?అనే గ్రహాంతరవాసుల అన్వేషణ..వాళ్ళు కనిపెట్టలేకపోయినది ఏమిటో తెలిసాక మన మనసులో భావోద్వేగానికి గురవుతాయి.ఒక సినిమా చూస్తోన్న అనుభూతి.అక్షరాల వెంట కళ్ళను పరుగెత్తించే థ్రిల్లర్ క్యూ...

డియర్ విజయ్ ఆంటోనీ
ఎప్పుడూ డిఫరెంట్ సబ్జక్ట్స్ తో డిఫరెంట్ థాట్ తో సినిమాలు చేసే మీరు ఈ సబ్జెక్టు ను ట్రై చేయండి.అద్భుతమైన నవల.తెలుగులో ఇలాంటి నవల ఎన్నో ఏళ్ళ క్రితమే వచ్చిందంటే చాలా గొప్ప విషయం.ఏలియన్ ప్రహేళిక మనసుకి ఫీలింగ్స్ రావడం ఎమోషన్స్ రావడం వండర్...గొప్ప థ్రిల్లర్ నవల క్యూ ...

" ఈ ప్రపంచంలో సైన్స్ కూడా కనిపెట్టలేనిది..మనకన్నా ఎంతో అడ్వాన్స్ లో వున్న ఏలియన్స్ కూడా కనిపెట్టలేక భూమ్మీదికి వచ్చి పరిశోధన చేయడం " అనే కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్......
ముఖ్యంగా ప్రహేళిక ఏలియన్ అని తెలియక సిద్దార్థ ప్రేమలో పడడం..ఆమె అదృశ్యం..ఆమె కోసం సిద్దార్థ వెతకడం..నా దృష్టిలో బెస్ట్ థ్రిల్లర్...మన తెలుగు సినిమాలు ...మూస సినిమాలు వదిలి ఇలాంటి సినిమాలు చేయాలి..తమిళ్ లో హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేస్తారు..
జర్నలిస్ట్ పాత్ర..ఎమోషన్స్ సింప్లీ సూపర్బ్ సర్...విజయార్కె గారు నా అభిమాన రచయిత..పాతికేళ్ల క్రితమే వారి జడ్జ్ మెంట్ ( మరణశాసనం ) నవల అప్ప్పట్లో ఆంధ్రభూమి వీక్లీ లో ఒక సంచలనం.

క్యూ నవల పట్ల మీరు చూపిస్తోన్న అభిమానానికి కృతఙ్ఞతలు.క్యూ నవల ఈ వారం టాప్ టెన్ లో ,వన్ లో ఉండడమే కాదు...క్యూ నవలలోని పాత్రలను విశ్లేషణతో రాసిన మీ కామెంట్స్ పుస్తకానికి గొప్ప ఎనర్జీని ఇస్తుంది.ముఖ్యంగా ప్రహేళిక ( పాత్ర ) పట్ల మీరు చూపిస్తున్న అభిమానానికి ఈ పుస్తకాన్ని చదివిన / డౌన్ లోడ్ చేసుకున్న అందరికీ మేన్ రొబో పబ్లికేషన్స్ కృతఙ్ఞతలు తెలియజేస్తుంది.
మేన్ రోబో పబ్లికేషన్స్ పుస్తకాల మీద మీ కామెంట్స్ కు సదా స్వాగతం.
www.manrobo.com

excellent...superb, ఏలియన్ ప్రహేళికా వి మిస్ యు...ఇంత మంచి నవలను ఆలస్యంగా చదివినందుకు ఫీలవుతున్నాను .ఆమె కనిపించింది..అతని అన్వేషణ ముగిసింది..కానీ ఒక ప్రశ్న ఇంకా మిగిలే వుంది.ఒక గొప్ప నవల చదివిన మెమరీ మాత్రం పదిలంగా వుంది.అక్షరాల మెస్మరిజాన్ని కళ్ళకు కట్టిన నవల క్యూ...

No 1 Science fiction thriller ..hats off

నవలను చదవడం మినహా మాట్లాడ్డానికి మాటలు లేవు..కొత్తదనానికి సరైన అర్థం.ఇలాంటి నవలలు తెలుగులో అరుదుగా వస్తాయి.ప్రహేళిక భూమ్మీద పుట్టి ఉంటే బావుండేది.

చదివిస్తూనే ఆలోచింపజేసే నవల...నవలా ప్రపంచంలో ఒక వండర్ ...ఏలియన్స్ మీద హ్యూమన్ ఎమోషన్స్ మీద వచ్చిన గొప్ప కమర్షియల్ ఎంటర్టైనర్ క్యూ...నాకు బాగా నచ్చిన నవల,ప్రహేళిక వాసంతి సిద్దార్థ మూడు పాత్రలు మనం మర్చిపోలేలేము.అద్భుతమైన నవల.

గొప్ప ఫీల్ వున్న నవల...ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్లుంది.గ్రేట్ అటెంప్ట్ ఏలియన్స్ మీద ఎమోషన్స్ మీద వచ్చిన డిఫరెంట్ నవల,కొత్త పాయింట్ .అద్భుతమైన శైలి.

కులాల మధ్య మతాల మధ్య ప్రేమ కథలు సినిమాలు కామన్..కానీ గ్రహాంతరవాసి ప్రేమ కొత్తదనం ..అంతకు మించి అంతర్లీనంగా సందేశం.హ్యూమన్ ఎమోషన్స్ ను ముఖ్యంగా కన్నీళ్లను ఇండియన్ సెంటిమెంట్స్ గొప్పతనాన్ని ...ఎవరు సృష్టించగలరు ?
గ్రహాంతరవాసుల అన్వేషణ..సిద్ధార్థను ప్రేమించి ( క్యూ గ్రహం ఆదేశం మేరకు )అతని ద్వారా గర్భం ధరించి అతడినే చంపాలనుకున్న ప్రహేళికలో సెంటిమెంట్స్ రావడం..ఆమె కనిపించకుండా అదృశ్యం అవ్వడం..ఆమెను అన్వేషిస్తూ సిద్దార్థ వెళ్లడం...ఇలా ప్రతీ సన్నివేశం మనసును పట్టి కుదిపేస్తోంది.
తెలుగులో ఇలాంటి నవల దాదాపు పదిహేనేళ్ల క్రితమే రాయడం గొప్ప విషయం.రెండుసార్లు ఏకబిగిన చదివిన నవల.క్యూ...న మనసును హత్తుకున్న థ్రిల్లర్...

అద్భుతమైన నవల.రెండుగ్రహాల మధ్య గ్రహాంతర ప్రేమ అన్న ఆలోచన మైండ్ బ్లోయింగ్.ముఖ్యంగా గ్రహాంతరవాసి ప్రహేళిక సిద్ధార్థను పెళ్లి చేసుకున్నాక తాను గర్భవతి అని తెలిసాక తన ఫీలింగ్స్ ఎమోషన్స్ రచయిత చెప్పిన తీరు హేట్సాప్ ...
క్రైమ్ యాక్షన్ ఎమోషన్ థ్రిల్లింగ్ చదివించే క్యూరియాసిటీ...అన్నీ కలిస్తే క్యూ నవల.
ఒక ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సైన్స్ ఫిక్షన్ సినిమాను తెలుగులో చూస్తున్న ఫీలింగ్.ఒక మంచి నవల చదివే అవకాశం కలిగింది.

క్యూ నవల గురించి చెప్పడానికి no words ..." డియర్ ప్రహేళిక నీకోసం సిద్దార్థ వెతుకుతున్నాడు.నువ్వెక్కడున్నా ..నువ్వు ఏలియన్ అయినా ,...నువ్వు తన ప్రాణం.నీ వల్ల రెండు గ్రహాలు ఒక్కటవుతాయి.నీకోసం మేమంతా ఆ ప్రభువును వేడుకుంటున్నాం ..." నవల చదువుతుంటే చెప్పలేని ఫీలింగ్ .అడుగడుగునా సస్పెన్స్ థ్రిల్లింగ్ ..ఎక్సయిట్మెంట్ ..ప్రహేళిక ఫీలింగ్ చదువుతుంటే మన ఇండియన్స్ సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఎంత గొప్పవో కదా అనిపిస్తుంది.సినిమా చూస్తున్నట్టే వుంది.

superb ...రెండు గ్రహాలను కలిపే ప్రేమ కథ...కొత్తగా వున్న సైన్స్ థ్రిల్లర్...ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఎవరూ కనిపెట్టలేరన్న థాట్ గ్రేట్. ఆమె కనబడుట లేదు లో ఆసక్తి...క్యూ గ్రహం గురించి తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్...అన్నింటినీ కలిపి అందించిన నవల క్యూ...

ఊపిరి సలపనివ్వని ఉత్కంఠ ను దృశ్యకావ్యంగా అందించిన నవల " క్యూ " అనడంలో సందేహం లేదు.సైన్స్ ఫిక్షన్ ను ఇంత అద్భుతంగా రాయవచ్చా ? భావుకత్వం సెంటిమెంట్స్ ఎమోషన్స్ సైన్సుకు అంతుచిక్కని ప్రశ్నలా ? క్యూ గ్రహం ఒక ప్రశ్నార్థకం ..ప్రహేళిక ఒక పజిల్ ..ఎమోషన్స్ సెంటిమెంట్స్ ? ఎవరూ కనిపెట్టలేని ,క్యూ గ్రహానికి అంతుచిక్కని ఒక ప్రశ్న ప్రహేళికకు సమాధానంగా మారితే..నవల ఆధ్యంతం అత్యద్భుతం.తెలుగులో ఇలాంటి నవల రావడం మహాద్భుతం.
వాసంతి పాత్ర కూడా ఎంతో బావుంది .ప్రహేళిక ఎందుకు కనిపించకుండా పోయింది అనే చిక్కుముడు విడిపడ్డాక.ఆ కారణం తెలిసాక మనసుకు మెలిక పడింది.
ఒక డిటెక్టివ్ నవల ఒక థ్రిల్లర్ కలిపితే క్యూ నవల

సమ్మోహనం అద్భుతం తెలుగులో నేను చదివిన నవలల్లో " ది బెస్ట్ " నవల.ఎమోషన్స్ గురించి ఏలియన్స్ గురించి ప్రేమ గురించి రాసిన గొప్ప థ్రిల్లర్ ..సూపర్ .ఆమె కనబడుటలేదు..,అన్న విషయాన్నీ డైజెస్ట్ చేసుకోవడం ఎంత కష్టమో..ఆమె కనబడ్డాక ఏం జరిగిందో తెలిస్తే తట్టుకోవడం అంతే కష్టం అనిపించింది.

" ప్రహేళికా నిన్ను మర్చిపోవడం అసాధ్యం.ఏలియన్ కు కూడా సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఉంటాయా? ఉంటే ఇంత గొప్పగా ఉంటాయా? ఎప్పుడైతే ఓ ప్రాణి..సిద్దార్థ రూపం నీలో ఊపిరి పోసుకుందో అప్పుడే నీలో ఎమోషన్స్ మొదలయ్యాయి.
ఆ క్షణం నీ ఫీలింగ్స్ హార్ట్ టచింగ్ ...."
ఇంత అద్భుతంగా భావుకతతో రాస్తూనే థ్రిల్లింగ్ ఎక్సయిట్మెంట్ అందించిన క్యూ నవల మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే నవల.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది.థాంక్యూ విజయార్కె గారూ..థాంక్యూ కినిగె

క్యూ నవల చదవడం గొప్ప అనుభూతి.ఏలియన్ తో ప్రేమ,ఎమోషన్స్ ఆసక్తి కలిగించే సన్నివేశాలు....అన్నింటినీ సమపాళ్లలో అందించిన ఎంటర్టైనెర్...మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే టైం మిషన్ .

Good science thriller with a different subject.

డిఫరెంట్ సబ్జెక్టు .ఇంతవరకు ఇలాంటి సబ్జెక్టు చదవలేదు అనడం అతిశయోక్తి కాదు.గ్రహాంతరవాసి ప్రేమలో ఇండియన్ సైంటిస్ట్.
ప్రపంచంలో తమ గ్రహం కనిపెట్టని హ్యూమన్ ఎమోషన్స్ సెంటిమెంట్స్ కోసం ఆరా తీయడం కోసం ప్రహేళిక అనే గ్రహాంతరవాసి రావడం...
తను గర్భం దాల్చగానే అదృశ్యం అవ్వడం..
కనిపించకుండా పోయిన తన భార్య గురించి వెతుకులాట,,,
ముఖ్యంగా .గ్రహాంతరవాసి ప్రహేళిక ఎంట్రీ అదిరింది.ట్రక్కు ధీ కొనడం.ముక్కలైన ఆమె శరీరం తిరిగి అతుక్కుని తాపీగా లేచి నడుచుకుంటూ వెళ్లడం...
రొటీన్ సబ్జక్ట్స్ తో సినిమాలు చేసే హీరో దర్శక నిర్మాతలు ఇలాంటి విభిన్నమైన థ్రిలర్స్ వైపు ఓ లుక్కేయడం మంచిది.
సినిమా చూస్తున్న అనుభూతి.ఒక్కసారి చదవడం మొదలుపెడితే వదిలిపెట్టనివ్వని కథనం

అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ .ప్రహేళిక పాత్ర ఆద్యంతం ఆసక్తిని కలిగించింది.హ్యూమన్ ఎమోషన్స్ ను ఇండియన్ సెంటిమెంట్స్ ను కనిపెట్టడానికి క్యూ గ్రహం ప్రహేళికను పంపించడం డిఫరెంట్ థాట్ .కనిపించకుండా పోయిన ప్రహేళికను వెతికే ఎపిసోడ్,హీరో సిద్దార్థ కు ప్రహేళిక గ్రహాంతరవాసి అని తెలియడం..ప్రతీ సన్నివేశం ఎక్సయిటింగ్ గా వుంది.

క్యూ నవల చదవడం మొదలు పెట్టాక నేను ప్రహేళికతో ప్రయాణం చేశాను.
ఇంత విభిన్నంగా ముసుకు హత్తుకునేలా,మైండ్ బ్లోయింగ్ అనే మాటకు సరైన అర్థాన్ని చెప్పేలా నవల వుంది.
నిజం చెప్పాలంటే కళ్ళముందు సినిమాలా దృశ్యాలు కనిపిస్తున్నాయి.
" మనం కనిపెట్టలేనిది ఏదైనా ఉందా? అని గ్రహాంతరవాసులు ,భూమి మీదికి వచ్చి మన దేశానికి వచ్చి,మనం కనిపెట్టలేనిది " వున్నది " అని తెలుసుకుని ప్రహేళికను హ్యూమనాయిడ్ రోబో గా పంపించడం,
సిద్ధార్థ ఆమె ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం
ఆ తరువాత ప్రహేళిక కనిపించకుండా పోవడం
సిద్దార్థ ఆమెకోసం అన్వేషించడం
ఆమె గ్రహాంతరవాసి అని తెలియడం
ఆమె కోసం గ్రహాంతరవాసులు గాలించడం
ఒక్కో మలుపు .ఊహించని ట్విస్ట్
భావోద్వేగాలను ఇంత అద్భుతంగా రాసిన రచయిత విజయార్కె గారికి హేట్సాఫ్ .
పన్నెండేళ్ల కిందటే ఇలాంటి నవల ఊహించి రాయడం గ్రేట్.
ప్రారంభం నుంచి చివరి వరకూ ఊపిరి సలుపనివ్వని ఉత్కంఠ

క్యూ ఇప్పటికి పదిసార్లు చదివాను.మళ్ళీ చదువుతున్నాను.అరవై రూపాయల ఖర్చుతో క్యూ గ్రహానికి వెళ్లొచ్చిన ఫీలింగ్.అంతేకాదు ప్రహేళికను కలుసుకున్నాను .సిద్దార్థ ఫీలింగ్స్ తెలుసుకున్నాను.
ఈ సృష్టిలో గ్రహాంతరవాసులు కనిపెట్టలేనిది ఇండియన్స్ సెంటిమెంట్..మన ఎమోషన్స్ ..అని గట్టిగా నమ్ముతున్నాను.
ఒక సైన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది.ముఖ్యంగా భర్తను వదిలివెళ్లే ముందు ప్రహేళిక ఫీలింగ్స్ సూపర్బ్.
నవల అంటే మనసును కుదిపేసే ఒక ఎమోషన్ అని అర్థమైంది.క్యూ నవల చదివేక.

క్యూ నవల అద్భుతమైన నవల.ఒక సైన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.కొత్త కాన్సెప్ట్.గ్రహాంతరవాసుల మధ్య ప్రేమ.హ్యూమన్ ఎమోషన్స్ ని ఇండియన్ సెంటిమెంట్స్ ని ప్రపంచానికే కాదు.గ్రహాంతరవాసులకూ తెలియజేసిన నవల.అధ్యాంత ఉత్కంఠభరితం.వాసంతి ల్యాబ్ లో బందీగా మారడం,రోబోలు ఆమెను వదిలిపెట్టడం,ప్రహేళిక హ్యుమన్యిడ్ రోబోగా రావడం,యాక్సిడెంట్లో ముక్కలై అతుక్కోవడం,స్పైడర్ విమెన్ గా పరిచయం కావడం.ఇలా ప్రతీ ఎపిసోడ్ చదివించే చక్కని కథనం.
ఈ ఆన్ లాక్ డౌన్ లో మనసుకు ఆహ్లాదాన్ని ఫ్రెష్ నెస్ ని అందించిన నవల.కొత్తతరహా నవలకు శ్రీకారం చుట్టిన నవల.
మరణశాసనం,మేన్ రోబో,అండర్ వరల్డ్,క్యాండిల్ లైట్ శోభనం,పైసావసూల్,నవ్వు దేవుడొచ్చాడోచ్..మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి
.ప్రతీ నవల విభిన్నం,ప్రతీ పుస్తకం వైవిధ్యం,.

వైవిధ్యమైన నవల.కొత్తదనానికి అర్థం చెప్పిన నవల.ప్రేమ పగ ప్రతీకారాలు లాంటి నవలలకు భిన్నంగా గ్రహాంతరవాసుల గురిఞ్చి,ఇండియన్స్ సెంటిమెంట్స్ ఎమోషన్స్ గొప్పతనం గురించి అద్భుతంగా రాసిన నవల.చివరిపేజీ వరకూ ఏకధాటిగా చదివించిన క్యూ ..కళ్ళముందు దృశ్యాలను అక్షరాల్లో చూపించింది.

తెలుగులో లాంటి నవలలు అరుదు.గ్రహాంతరవాసితో కథను ముడిపెట్టి ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నవల రాయడం గ్రేట్.ప్రహేళిక పాత్ర అద్భుతంగా తీర్చిదిద్దారు.హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు వుంది.నాగార్జున లాంటి హీరో ఇలాంటి పాత్ర చేస్తే చూడాలని వుంది.ప్రహేళిక పాత్రలో అనుష్క,సరిగ్గా సరిపోతారు.జర్నలిస్ట్ వాసంతి పాత్రలో పూజాహెగ్డే .
విభిన్నమైన కథాంశాలతో సినిమాలు రావలిసింది అవసరం వుంది.

ఒక హాలీ వుడ్ సినిమా చూస్తున్నట్టు వుంది.నాకు తెలిసి ఇంతవరకు ఇలాంటి కాన్సెప్టు తో నవలలు రాలేదు.ఉత్కంఠ ఉద్వేగం వేగంగా చదివించే లక్షణం ,నవల చివరివరకూ ఏకబిగిన చదివించింది.

సెంటిమెంట్స్,ఎమోషన్స్ ను కనిపెట్టడానికి క్యూ గ్రాహం ప్రహేళికను పంపించడం,సైంటిస్ట్ సిద్ధార్థను ట్రాప్ చేయడం,అతని ద్వారా ప్రహేళిక గర్భం దాల్చడం,ఆ తరువాత అనూహ్యమైన మలుపు,ప్రహేళిక అదృశ్యం..ఆమె కోసం సిద్దార్థ అన్వేషణ,జర్నలిస్ట్ వాసంతిని సిద్దార్థ ల్యాబ్ లో రోబోలు బంధించడం,అంతర్యామి విలనిజం..ప్రతీ పాత్ర ప్రత్యేకత కలిగి వుంది,కథనం కళ్లను పరుగుపెట్టించింది.ఒక ఇంగ్లీష్ మూవీ చూస్తున్నట్టు వుంది.

రొటీన్ నవలలకు భిన్నంగా వున్నా నవల క్యూ .ఆమె కనబడుటలేదు.ఆధ్యంతం ఆసక్తికరం ఉత్కంఠభరితం.కళ్ళముందు ప్రహేళిక వాసంతి సిద్దార్థ కనిపిస్తున్నారు.గ్రహాంతరవాసులతో విభిన్నమైన కథాంశాన్ని తెలుగులో పరిచయంచేసారు.ఈ సబ్జెక్టు యూనివర్సల్.ఏ భాషలో అయినా ద్భుతమైన ఫీల్ ని కలిగిస్తుంది.సెంటిమెంట్స్ ఎమోషన్స్ క్యూరియారిటీ ,ఒకదానికి ఒకటి పోటీపడ్డాయి.ఇలాంటి విభిన్నమైన సబ్జక్ట్స్ తో సినిమాలు చేసేరోజు రావాలి.

గ్రహాంతరవాసి ప్రహేళిక భూమ్మీదికి రావడం,యాక్సిడెంట్ లో ఆమె శరీరం ముక్కలవ్వడం తిరిగి అతుక్కోవడం ,పెళ్ళై తల్లికాబోతున ప్రహేళిక అదృశ్యం,ఆమె కోసం సిద్దార్థ వెతకడం,జర్నలిస్ట్ వాసంతి పాత్ర, నవల ఆధ్యంతం కళ్లముందు సినిమాలా కనిపిస్తుంది.మనసును కట్టిపడేసిన నవల.

చాలా విభిన్నమైన నవల.కొత్త కథాంశం..ఏలియన్స్ మీద వచ్చిన డిఫరెంట్ థ్రిల్లర్.ప్రతీపాత్ర ఒక ప్రత్యేకత సంతరించుకుంది.నవల చివరివరకు ఉత్కంఠభరితంగా సాగింది.ఇలాంటి సబ్జెక్టు నాకు తెలిసే ఇదే మొదటిది అయి ఉంటుంది.ప్రహేళిక పాత్ర,జర్నలిస్ట్ వాసంతి పాత్ర రెండూ హైలెట్.సిద్దార్థ పాత్ర అద్భుతంగా వుంది.

ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ని ఇంత బాగా పొయెటిక్ గా,అద్భుతంగా రాయగలరా? ప్రహేళిక పాత్ర అద్భుతం.ప్రతీ సన్నివేశంలో ఉత్కంఠ ఉద్వేగం ఆసక్తి వున్నాయి.ఒక ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.

" ఈ ప్రపంచంలో సైన్స్ కూడా కనిపెట్టలేనిది..మనకన్నా ఎంతో అడ్వాన్స్ లో వున్న ఏలియన్స్ కూడా కనిపెట్టలేక భూమ్మీదికి వచ్చి పరిశోధన చేయడం " అనే కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్..ప్రహేళిక పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.గ్రహాంతర ప్రేమకథ అందులోని అంతరార్థం జర్నలిస్ట్ వాసంతి పాత్ర,సిద్దార్థ పాత్ర రూపకల్పన తెలుగు సాహిత్యంలో కొత్తదనం .

బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ హ్యూమన్ ఎమోషన్స్. ముఖ్యంగా ఇండియన్ సెంటిమెంట్స్ ఎమోషన్స్ గురించి గొప్పగా చెప్పిన నవల.ఏలియన్స్ మీద మొదటిసారి తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన నవల క్యూ..ఆమె కనబడుటలేదు.
ప్రహేళిక వాసంతి పాత్రలు తీర్చిదిద్దన విధానం బావుంది.భూమ్మీదికి వచ్చిన ప్రహేళిక శరీరం యాక్సిడెంట్ లో రెండుగా విడిపోయి తిరిగి ఒకటై తాపీగా నడుచుకుంటూ వెళ్లే సన్నివేశం అద్భుతంగా వుంది.

సరిక్రొత్త కథాంశం .తెలుగులో ఇటవంటి నవల చదవలేదు.నిజంగా ఇలా జరిగితే బావుంది,అనిపించేలా వుంది.సిద్దార్థ పాత్ర ,ప్రహేళిక,హ్యుమానాయిడ్ రోబో గా అనిపించలేదు,మన పక్కింటి అమ్మాయిలా అనిపించింది.ప్రహేళిక భూమ్మీద దిగినప్పుడు యాక్సిడెంట్ లో ఆమె దేహం రెండుముక్కలై తిరిగి అతుక్కోవడం హాలీ వుడ్ సినిమా దృశ్యంలా కళ్ళముందు కనిపించింది.నవల మొత్తం ఉత్కంఠభరితంగా వుంది.జర్నలిస్ట్ వాసంతి పాత్ర సూపర్బ్.

గ్రహాంతరవాసుల మీద వచ్చిన విభిన్నమైన నవల.క్యూ గ్రహం నుంచి వచ్చిన ప్రహేళికను సైంటిస్ట్ సిద్దార్థ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం,హ్యూమన్ ఎమోషన్స్ ను గ్రహాంతర వాసులు ప్రయోగాల పేరుతో ప్రహేళిక గర్భంలో ఊపిరిపోసుకుంటున్న బిడ్డను చంపాలని అనుకోవడం,చిత్రంగా ఏలియన్ హ్యుమానాయిడ్ రోబో అయిన ప్రహేళికలో ఎమోషన్స్ సెంటిమెంట్స్ మొదలవ్వడం,ఆమె కనిపించకుండా పోవడం,సిద్దార్థ్జ అన్వేషణ,జర్నలిస్ట్ వాసంతి పరిశోధన,ప్రహేళిక శరీరం రెండుగా చీలిపోయి అతుక్కోవడం,ఊహించని మలుపులతో ఉత్కంఠభరితంగా రాసిన రచయిత గొప్పతనం క్యూ నవలలో కనిపిస్తుంది.పదహారేళ్ళ క్రితం వచ్చిన ఈ నవలలో మాదిరి ఈ మధ్య సోఫియా అనే హ్యుమానాయిడ్ రోబోను సైంటిస్టులు సృష్టించడం గమనార్హం..మేన్ రోబో క్యూ రెండు విభిన్నమైన నవలలు.

తెలుగులో వచ్చిన డిఫరెంట్ నవల,ప్రహేళిక క్యారెక్టర్ కళ్ళకు కట్టినట్టు వుంది.అద్భుతమైన సైన్స్ ఫిక్షన్.ఆధ్యంతం ఉత్కంఠభరితంగా వుంది.

తెలుగులో వచ్చిన డిఫరెంట్ నవల.ఎమోషన్స్ ఉత్కంఠ చక్కని కథనం ఉన్నాయి.గ్రహాంతరవాసుల మధ్య నడిచిన థ్రిల్లర్ ప్రేమకథ.గ్రహాంతరవాసులకు సంబంధించిన ఎన్నో విశేషాలు అందించారు రచయిత.ఒక హాలీవుడ్ చిత్రాన్ని చూస్తున్నట్లుంది.తెలుగులో ఇలాంటి నవలాచిత్రాలు రావాలి. ఫ్యాక్షన్ క్రైమ్ బదులు