-
-
డౌన్ స్ట్రీట్ మిస్టరీ
Down Street Mystery
Author: Madhubabu
Publisher: Sri Srinivasa Publications
Language: Telugu
కాని కొంచెం కూడా మానవత్వం లేకుండా బాధితులయిన తమనే పరిహసిస్తున్న వాళ్ళని చూస్తూ వెళ్ళబుద్ది కాలేదు. అందుకే కట్టలు తెంచుకున్న ఆవేశంతో కోర్టు ఆవరణలోనే –
"రేయ్ సత్తిబాబూ!” అంటూ నిప్పులు కురిసే కళ్ళతో గర్జించాడు.
"అయిపోయిందనుకుంటున్నావా? అప్పుడే అయిపోయిందనుకుంటున్నావా? నువ్వేమిటో నువ్వు చూపించావ్. ఇక నేనేమిటో చూడాలిగా. నేరాలు చేసి చట్టంనుంచి తప్పించుకోవటం మీకు మాత్రమే తెలుసనుకుంటే పొరబాటు.
"తప్పుచేసావ్. పెద్ద తప్పుచేసావ్ సత్తిబాబు. కన్నప్రేమ కొద్దీ దుష్టుడయిన దుర్యోధనుడ్ని వెనకేసుకొచ్చినందుకు ధృతరాష్ట్రుడు ఏం పోగొట్టుకున్నాడో నీకూ తెలుసు. ఈ న్యాయస్థానంలో నేను ఓడిపోవచ్చు. కాని నా న్యాయస్థానంలో ఓటమి వుండదు. నేను వెళ్తాను. మీలాంటి దుష్టశక్తుల్ని అంతం చేయడానికి పులిని పంపిస్తాను. బెబ్బులి. దాని పంజా దెబ్బకు మీలో ఒక్కడూ మిగలడు. నాశనమైపోతారు. మీరంతా సర్వనాశనమై పోతారు!” అంటూ అరిచాడు.
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.