-
-
షాడో ఇన్ జపాన్
Shadow in Japan
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Language: Telugu
షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఐదవ నవల యిది.
పాఠకుల సౌకర్యం కోసం యింతకు ముందు జరిగిన కధను గురించి ఒకటి రెండు మాటలు చెపితే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో యీ వుపోద్ఘాతాన్ని ప్రారంభించాను.
షాడోని భారతదేశం నుంచి అవతలికి తీసుకుపోగలిగితే అతని జీవితం కుదుటపడుతుందనీ, అనవసరమైన అల్లర్లలో అతను తల దూర్చడం తగ్గిపోతుందనీ భావించారు రిటైర్డ్ జడ్జి ఛటర్జీ గారు, ఆయన కూతురు మల్లిక. అందుకే షాడోని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్న సి. ఐ. బి. చీఫ్ కులకర్ణికి అందకుండా అతన్ని జపాన్ తీసుకుపోయారు వారిద్దరూ.
జపాన్ ప్రభుత్వ కార్యాలయంలో మంచి పలుకుబడి కలిగిన వుద్యోగం చేస్తున్నాడు ఛటర్జీగారి మేనల్లుడు సతీష్. మేనమామ మాటని కాదనలేక టోక్యో నగరానికి యాభై మైళ్ళ దూరంలో ఉన్న సూచీ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో షాడో గంగారాంలకు వుద్యోగాలు యిప్పించాడతను.
తాను ఒకటి తలిస్తే దైవం యింకొకటి తలుస్తుందనే సామెత ఒకటుంది. భవిష్యత్లో యింకొక విధంగా జీవించవలసిన షాడో, మాములు కూలీ మాదిరిగా గుర్తింపు లేని జీవితం గడపడం ఎలా సాధ్యపడుతుంది?
ఎట్టి పరిస్థితిలోను పాత జీవితాన్ని గురించి తలచుకోకూడదని, పాత పద్దతులను, అలవాట్లను పునరావృతం చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకొని పనిలో చేరాడు షాడో. పరిస్థితుల ప్రభావానికి ఏ విధంగా గురి అయ్యాడో తెలియజేస్తుంది యిక ముందు జరిగే కథ.
ఇక చదవండి.
- మధుబాబు
Nice ..next novel name please
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.