-
-
కొత్త గబ్బిలం
Kotta Gabbilam
Author: Yendluri Sudhakar
Language: Telugu
Description
ఆగ్రహం రాని అక్షరం జ్వలించదనీ
ఆర్ద్రత లేని వాక్యం ఫలించదనీ
నా అనుభవం నేర్పిన కవిత్వపాఠం
నాలుగు మెతుకులే నా అక్షరాలు
నాలుగు మనుషులే నేను చదివిన ప్రబంధాలు
నా బాల దృశ్యాలే
నేను చూసిన అలంకార శాస్త్రాలు
ఆకలి రసం నాలోని రచనా రహస్యం
అవమాన విషం
నా కంఠంలోని నీలామృత విశేషం
మా బీద బస్తీలే నన్ను కవిని చేశాయి
నాలోని భావుకత్వానికీ.
బాధల తత్త్వానికి బాటలు వేసాయి
మా వీధి కుక్కులు
జీవితాన్నీ
జీవించడాన్ని నేర్పాయి
- ఎండ్లూరి సుధాకర్
Preview download free pdf of this Telugu book is available at Kotta Gabbilam
Login to add a comment
Subscribe to latest comments
