-
-
డియర్ షాడో
Dear Shadow
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Language: Telugu
అగ్రరాజ్యాలు ఎన్ని ఆంక్షలు విధించినా, మన దేశాన్ని ఎన్ని విధాలుగానో నిరుత్సాహ పరచటానికి ప్రయత్నించినా వెనుకంజ వేయకుండా; ఎంత దూరంలో వున్న టార్గెట్నైనా సరే చిటికెలో ఛిన్నాభిన్నం చేయగల క్షిపణులను మన దేశం నిర్మించుకుంది. మన సరిహద్దుల మీద వున్న శత్రువుల నుంచి వచ్చే వత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఆ క్షిపణులను కొన్ని కొన్ని రహస్య ప్రదేశాల్లో సర్వసన్నద్దంగా వుంచారు.
అత్యంత రహాస్యంగా నిలబెట్టబడిన ఆ క్షిపణుల వివరాలు పొందుపరచి వున్న కంప్యూటర్ డిస్క్ మాయం అయింది. గుర్తుతెలియని విద్రోహులు ఎవరో దాన్ని అపహరించారు. దాని జాడ కనిపెట్టడానికి వెళ్ళిన స్పెషల్ బ్రాంచి అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ గైక్వాడ్ కనపడకుండా పోతాడు. కంప్యూటర్ డిస్క్ మాయం కావడం, గైక్వాడ్ అదృశ్యం అవడం మాత్రమే కాదు, ఎవరికీ అంతుబట్టని విచిత్రమైన ఇంకో మెలిక ఈ కేసులో వుందని సి.ఐ.బి హెడ్ కులకర్ణి భావించి, అదేమిటో తెలుసుకోడానికి షాడోని రంగంలోకి దించుతారు.
ఈ రహస్యాన్ని ఛేదించడానికి పొరుగుదేశం చేరిన షాడో, తన మిత్రుడు గంగారాం అనుచరులు, వారి నాయకురాలు యాకూబ్ బేగం సాయంతో చేసిన ఉత్కంఠభరితమైన సాహసకృత్యాలను, కంప్యూటర్ డిస్క్ని స్వాధీనం చేసుకున్న తీరుని ఈ రోమాంచక నవలలో చదవండి.
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.