-
-
ఆసరా
Aasaraa
Author: Varanasi Nagalakshmi
Language: Telugu
ఈ సంపుటి నాగలక్ష్మిగారి రెండవ కథా సంపుటి.
నాగలక్ష్మిగారి కథాంతర్దర్శనం చేస్తే, పూసల్లోని దారంలా సందేశం అందుతుంది, కనిపిస్తుంది. పచ్చదనం, పర్యావరణం, భావస్పందనలు, మానవీయ భావనలు, మంచితనం పట్ల మనిషితనం పట్ల ఆరాధనాభావం - ఇవన్నీ ఉన్న బుద్ధిజీవిగా - ఆమె వ్యక్తిత్వం ఆమె రచనల్లో ద్యోతకమవుతోంది. కథలన్నిటా వైవిధ్యంతోపాటు, సామాజిక బాధ్యతా స్పృహా ద్యోతకమవుతున్నాయి.
నాగలక్ష్మిగారి కథలకి ఒక అంతర్గతబలం వుంది. అది అపూర్వమైనది, అపురూపమైనది. నాకెంతో ఎంతో మక్కువైనది. అదేమంటే, ఆమె ఎన్నుకున్న కథాంశాలన్నీ most up to date social issues. అలాగే అన్నీ current burning topics! ఇతరులు ఇంతకు ముందు ఇంత గాఢంగా స్పృశించనివి. ఇదీ విశేషం! నాగలక్ష్మిగారికి ప్రత్యేక అభినందనలు!
ఈ విశేషానికీ, ప్రత్యేకతకీ మెరుపునిస్తున్నది - రచయిత్రి సాధించుకున్న అభివ్యక్తి, సారళ్యత. కథ ద్వారా తాను చెప్పదలచుకున్న అంశం మీదే ఆమె శ్రద్ధ. సరళంగా కథ చెప్పటమన్న సంవిధాన ఫణితిని కైవశం చేసుకున్నారామె. అందువలన నాగలక్ష్మిగారి కథలు చక్కటి చదివించే గుణంతో భాసిస్తున్నాయి. ఆమె కథా రచనా కృషి మరింత వేగవంతమై, చైతన్యవంతంగా పురోగమించాలని కోరుకుంటున్నాను!
- విహారి
కథల గురించి విహారి గారి మాటల్లో http://pustakam.net/?p=8585