-
-
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్ - టీకా తాత్పర్య సహితం
Sri Vishnu Sahasranama Stotram Tika Tatparya Sahitam
Author: Poluri Krishna Koundinya
Publisher: Victory Publishers
Pages: 98Language: Telugu
విష్ణు సహస్రనామములను అర్థ తాత్పర్య సహితముగా తెలుసుకొని పారాయణ చేస్తే ఫలం అధికంగా ఉంటుంది. ఈ ఉద్దేశముతోనే ఈ చిన్ని పుస్తకాన్ని మీ ముందుచుతున్నాం. విష్ణు సహస్రనామాలకు ఎన్నో భాష్యాలున్నాయి. ఆ భాష్యాలన్నీ వ్రాస్తే పుస్తకం మహాగ్రంథమవుతుంది. ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశం శ్రీ విష్ణు సహస్రనామాలను అర్థ తాత్పర్యసహితంగా అందించడం, తద్వారా విష్ణుసహస్ర నామాలను నిత్యం పారాయణం చేసే వారికి నామస్వరూపం స్పష్టంగా తెలియచేయడం. స్పష్టంగా, నిర్దుష్టంగా, నిర్దోషంగా ఉచ్ఛరించిన నామమే మంత్ర మవుతుంది. విష్ణు సహస్రనామాలకు అర్థం కూడా తెలుసుకొని పారాయణం చేస్తే అనిర్వచనీయమైన ఆనందం కల్గుతుంది.
ఇది సంకలన గ్రంథం. అనేక విష్ణు సహస్రనామ భాష్యములను పరిశీలించి ఈ గ్రంథం సంకలనం చేయటం జరిగింది. ఆ గ్రంథాలలో ప్రతి నామానికి ఎన్నో అర్థాలు ఇవ్వబడినవి. గ్రంథం విస్తరభీతిచే ఈ గ్రంథంలో ఒక నామానికి ఒక అర్థం మాత్రమే ఇవ్వటం జరిగింది. ఆ అర్థం ఎంపిక పెద్దల అభిప్రాయంతో పాటు మా విచక్షణను కూడా ఉపయోగించటం జరిగింది. ఇందుకు ఆ భాష్యకారులకు మా కృతజ్ఞతాంజలులు.
ఇది ప్రధానంగా పారాయణకు ఉద్దేశించబడిన గ్రంథం. అందువల్ల శ్లోకాలలో పదాలను స్పష్టంగా, నిర్దోషంగా ఉచ్ఛరించటానికి అనువుగా సమాసాలను విసంధి పాటించి పదాలుగా విడగొట్టటం జరిగింది. ఇది పాఠకులు గమనించగలరు. నిత్య పారాయణ చేసేవారు అంగన్యాస, కరన్యాసములను సాధారణంగా చదవరు. అదే విధంగా పంచ పూజలు కూడా చేయరు. అందువల్ల వాటిని ఈ గ్రంథంలో బ్రాకెట్లలో ఇవ్వటం జరిగింది. సంప్రదాయాన్ని బట్టి వాటిని వదలి లేదా చేర్చి గ్రంథాన్ని పారాయణం చేయవచ్చు. అపారమైన ఫలితం లభిస్తుంది.
- పోలూరి కృష్ణ కౌండిన్య
