బాపు బొమ్మల కొలువు
బాపు
"తెలుగు వెలుగులు" శీర్షికలో అతను తీర్చిదిద్దిన రేఖాచిత్రాలు - ఛాయాచిత్రాలకు మించి ఆయా మహా పురుషులు ప్రతిభను, వ్యక్తిత్వాన్ని ప్రస్పుటం చేసాయి. అలాగే అతను రూపకల్పన చేసిన ప్రసిద్ధ పాత్రలు - బారిస్టర్ పార్వతీశం, గిరీశం, గణపతి, పదహారాణాల తెలుగు ఆడపడుచు అనిపించుకున్న "బాపు బొమ్మ" ఉరఫ్ బామ్మ, రెండు జెళ్ళ సీత, బుడుగు, లావుపాటి పిన్నిగారు, గయ్యాళి భార్య, ఆవిడలో సగం ఉండే మధ్యతరగతి మహారాజు, పాఠకుల మనసులో స్థిర ముద్ర వేసుకున్నాయి. - ముళ్ళపూడి వెంకటరమణ
""ఏనాడు నిర్వ్యాపారత్వం లేని సత్పురుషుడు బాపు గారు. రోజూ పద్దెనిమిది గంటలు పనిచేస్తారు. అలా పనిచేయకపోతే, వేల సంఖ్యలో ముఖ చిత్రాలు, కథాకథన చిత్రాలు, వీడియో పాఠాలు, మొదలైన వాటితో, తెలుగు దేశాన్ని నింపేయడం జరగదు. కీర్తి రాదు. బాపు గారి తొలి చిత్రం నుంచి నేను వారి యూనిట్లో ఇల్లరికపు కవిని. నా చేత ఎన్నెన్నో మంచి పాటలు ఆయన రాయించుకున్నారు. మా ఇద్దరివీ సమాన అభిరుచులు. - ఆరుద్ర.
"బాపు తనకి ఊహ తెలిసిన 70 ఏళ్ళలో ఒక్క క్షణం కూడా వృధా పరచకుండా ఏదో రంగంలో కళకు అంకితమయ్యాడు. బాపు లాంటి మనిషి యుగానికొక్కడు పుడతాడు. అతను అసలైన కళాప్రపూర్ణుడు. అతనికి సమకాలికులుగా ఉండడం అతన్ని అభిమానించే వారి అదృష్టం. అలాంటి అతను నాకు బాల్యం నుంచి ప్రాణస్నేహితుడు అవడం నాకు దేవుడిచ్చిన వరం - బి. వి. ఎస్. రామారావు.
"కర్ణాటక సంగీతం పట్ల బాపు గారికి సహజంగా అట్టే ఆసక్తి లేదు కానీ... రామ భక్తి కారణంగా, రామ భక్తులైన్ త్యాగరాజుతో, రామదాసుతో ఆత్మీయత కారణంగా, మహదేవన్ గారి సాహచర్య ఫలితంగా ఆయనకి కర్నాటక శాస్త్రీయ సంగీతంతో సంబంధం ఏర్పడింది. బాపు గారి ఇష్టాలు అయిష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇష్టం అయిష్టం - రెండే తెలుసు ఆయనకి. ఈ రెండింటికీ మధ్య "ఓ మోస్తరు ఇష్టం" అనేది ఉండదు. ఏదైనా ఇష్టమైతే దాంట్లో నిండా మునిగే స్వభావం ఆయనది. సంపూర్ణ రామాయణం కోసం రామాయణాలన్నీ పారాయణం చేయడంతో, ఆయన రామభక్తిలో నిండా మునిగిపోయారు. రాముని ప్రేమించి రాముని కోసం తపించి పోయిన త్యాగరాజు, రామదాసు ఈయనకు ఆప్తులైపోయారు. - నండూరి పార్థసారథి.
Can i get a Print book of the same.
అసలు సిసలు బాపు బొమ్మల ప్రింట్లు ఇప్పుడు నేరుగా పొండే సదవకాశం. మీకు కావలసిన బాపు బొమ్మలు ఈ వెబ్సైట్ నుంచి నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చు.
Are those color pictures in the ebook?
Print copy kavali.
Print Copy kaavaali ante ela.. please release cheya galaru