-
-
నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు
Naa Radio Anubhavalu Gnapakalu
Author: Sarada Srinivasan
Language: Telugu
Description
నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు
శారదా శ్రీనివాసన్
రేడియో నాటకం అనగానే స్ఫురించే పేరు శారదా శ్రీనివాసన్.
1959 నుంచి 95 దాకా మూడున్నర దశాబ్దాల పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో పనిచేసారు.
అప్పటికే ప్రసిద్ధులైన తొలితరం పెద్దలు సర్వశ్రీ స్థానం, కృష్ణశాస్త్రి, గోపీచంద్, బుచ్చిబాబు, దాశరథి, రజని, మునిమాణిక్యం, నాయని, భాస్కరభట్ల, కేశవపంతుల నరసింహ శాస్త్రి మున్నగువారు కొలువుదీర్చి ఉన్నారు ఆ కళానిలయంలో.
వారితో కలిసి పనిచేసిన శారదగారు అలనాటి రేడియో తీరుతెన్నులను ఈ పుస్తకంలో మీ ముందుంచుతున్నారు.
రేడియో అభిమానులకిది ప్రీతిపాత్రం.
చదవండి మీకే తెలుస్తుంది.
Preview download free pdf of this Telugu book is available at Naa Radio Anubhavalu Gnapakalu
శారదా శ్రీనివాసన్ గారిని సెక్సీ అని పిలవడం కొంతమందికి నచ్చకపోవచ్చు... కానీ చలం 'ఊర్వశి'ని సెక్సీ అనకుండా వుండగలనా? చిన్నప్పుడు ఆమె మధురమయిన కంఠం వింటూ పెరిగాను. కుర్రాడినయ్యాక నేనో పురూరవుడిని అయిపోయి ఆమెలో ఓ ఊర్వశిని విన్నాను. నా గాత్ర సుందరి ఎలా వుంటుందా గాత్రం వున్నంత మధురంగా మనిషి వుంటుందా లేదా అనే అనుమానంతో ఇన్ని ఏళ్ళూ గడిపాను. ఇన్నాళ్లకి, ఇన్నేళ్ళకి ఆమె ఫోటో చూసే అవకాశం కలిగింది. ఇప్పటి ఫోటోలే కాదు ఊర్వశి కాలం నాటి ఫోటోలు చూసే అవకాశం కలిగింది. శారద గారు ఎంత అందంగా వున్నారు! నా స్వప్నం చిరిగిపోలేదు. గాత్రం ఎంతో బావున్నా మనిషి బాగోకపోతే నాకు జీర్ణించుకోవడం కష్టమయ్యేదే.
నా చిన్నప్పుడు ఇప్పటిలా టివిలు, FM లు లేనందున ఆకాశవాణి మీదే ఆధారపడేవారం. అందులోని ఆర్టిస్టులే మాకు సెలబ్రెటీలు. ఒక్కొక్కరి వాచకం, స్వరం ఎంత బావుండేదని. వార్తలు, వ్యాఖ్యానాలూ ఆడా, మగా ఎవరు చదివినా వారి గాత్ర సౌందర్యాన్ని లేదా గాత్ర గాంభీర్యాన్ని రసాస్వాదన చేస్తూ మైమరచిపోయేవాడిని. ఇన్నాళ్ళకు శారదా శ్రీనివాసన్ గారి నా రేడియొ అనుభవాలు జ్ఞాపకాలు అనే పుస్తకం ద్వారా అప్పటి ఆకాశవాణి గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. వారి ముచ్చట్లు చదువుతుంటే సమయమే తెలియలేదు. అందులో వారి ఫోటోలు కూడా వున్నాయి. అలా చూసానన్నమాట నా కలల స్వర సుందరిని. ఎన్నాళ్ళుగా వేచివిన్నా నా ఊర్వశి ఫోటో కోసం! వారు పుస్తకం వ్రాసేరని తెలిసి ఇండియా వెళ్ళినప్పుడు తప్పక కొనుక్కోవాలనుకున్నా. ఈలోగా కినిగే సైటులో లభ్యం అవడంతో అక్కడ తీసుకొని చదివేసాను.
ఆమె స్వరం ఎంత బావుంటుందని, ఎంత తియ్యగా వుంటుందనీ. రేడియో నాటకంలోనీ ఏ పాత్ర అయినా ఎంత బాగా వేస్తుందనీ. ఆ రోజుల్లో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చే ఓ గంట నాటకం కోసం అన్ని పనులూ మానుకొని ఎదురుచూసేవారం. అలా ఆమె హీరోయినుగా వేసిన ఎన్ని నాటకాలు విన్నానో. అవన్నీ గుర్తుకులేవు కానీ రచయిత చలం నవల ఉరూరవలో ఆమె వేసిన ఊర్వశి పాత్ర బాగా గుర్తుండిపోయింది. ఆ నాటకంలో రెండే రెండు పాత్రలు. పురూరవ రాజు మరియు దేవకన్య ఊర్వశి. (నాకు ఆ కథ అంతగా గుర్తుకులేదు). మన ఫేవరెట్ హీరోయిన్ను సినిమాలో సగం వేషం వేస్తే ఎంత ఆనందం పొందుతామో ఆ నాటకం విని అంత సంతోషం అనుభవించాను. అవును మరీ, ఆమెది మామూలు గొంతా? ఎంత సెక్సీగా వుంటుంది ఆ గొంతూ! పదహారేళ్ళ అందమయిన అమ్మాయి యవ్వనం ఆ గొంతులో తోణికిసలాడుతూవుంటే నాకు పిచ్చెక్కిపోయేది. అదే సమయాన ఆమె ఆకారం కూడా అంత అందంగా వుంటుందో లేక చుప్పనాతిలా వుంటుందో అనే అనుమానాలు పట్టిపీడించేవి. మొత్తానికి ఆ అనుమానం ఇన్నాళ్లకి తీరింది. ఆ గొప్ప స్వరానికి తగ్గట్టే ఆమె కూడా ఓ గొప్ప సుందరే. ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా తిరస్కరించిందట.
http://sarath-kaalam.blogspot.com/2012/03/blog-post_19.html
Here are a couple of quotable quotes from this book, which I enjoyed reading.
"ఆర్టిస్టు నిరంతరాన్వేషిగా వుండాలి. దృష్టి ఎప్పుడూ జనం మాట్లాడుకునే మాటల మీద వుండాలి. నలుగురు కలిసినప్పుడు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు, వాళ్ళ గొంతు పిచ్ ఎంతలో ఉంది. అదే ఇద్దరే అయితే ఎలా ఉంది, చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటోంది [...] ఒక ఆర్టిస్టు మంచి ఆర్టిస్టుగా ఎదగాలంటే నిరంతరం జీవితాన్ని చదువుతూనే ఉండాలి."
"సృష్టిలోని పిపీలికం మొదలు బ్రహ్మాండం దాకా శ్రోత కనులముందుకు తేగలిగిన శక్తి రేడియో నాటకానికుంది. కేవలం ఒక శబ్ద సూచనతో మీ కల్పనాశక్తిని ఉజ్జీవింప చేసి, మీ కళ్ళముందు బొమ్మకట్టిస్తుంది. మిగతా ఏ ప్రక్రియా కలిగించలేని ఒక అద్భుతమైన అనుభూతి కలుగజేస్తుంది."
ఈ పుస్తకం చదివిన తరువాత ప్రముఖ తెలుగు బ్లాగర్లు పూర్ణిమా, సౌమ్యలు చేసిన అంతర్జాల సంభాషణ పుస్తకం డాట్ నెట్ పై - శారదా శ్రీనివాసన్ గారి జ్ఞాపకాల తోట నుండి..
Amazing book! Must read for anybody interested in AIR or Telugu literature or autobiographies. It is a smooth read and can be finished in couple of sittings. Grab it, now!
Very interesting!