-
-
బులుసు సుబ్రహ్మణ్యం కథలు
Bulusu Subrahmanyam Kathalu
Author: Bulusu Subrahmanyam
Publisher: Bulusu Subrahmanyam
Pages: 206Language: Telugu
కోపం, తాపం, వీరం, ఘోరం.... ఇలా ఏది శృతిమించినా ఫరవాలేదు, డ్రమాటిక్‌గా ఉంది అని సరిపెట్టేసుకోవచ్చు. కానీ హాస్యం విషయంలో ఏమాత్రం తూకం దెబ్బ తిన్నా తులాభారం శిరోభారమే అవుతుంది. సమతూకంతో హాస్యాన్నిసృష్టించడం కొందరికే సాధ్యం. అలాంటి వారిలో బులుసుగారు ఒకరు. వ్యంగ్యరచనలు చేయడం కత్తి మీద సాములాంటిది. ఈ కత్తిసాములు, కర్రసాములూ బులుసుగారికో లెక్కా!! అలవోకగా చేసి పేశారు. నవ్వితే నవ్వండి అంటూనే ఎలా నవ్వకుండా ఉంటారో నేనూ చూస్తా అన్నట్టు ఉంటాయి ఆయన కథలు.
తేనెచుక్కల్లాంటి కథలు మనల్ని చక్కిలిగింతలు పెడుతూనే కొన్ని వాస్తవాలను కళ్ళ ముందుంచుతాయి. డాక్టర్లపై విసుర్లు విసిరినా, మధ్యతరగతి గృహిణుల మానసిక అలసటపై దృష్టి పెట్టినా, ఉన్నవీ లేనివీ కల్పించే కోతరాయుళ్ళపై చమక్కులు మెరిపించినా, మనల్ని భుజం తట్టి ''అలా నవ్వుతూనే కాస్త ప్రపంచపు వాస్తవాలను కూడ గమనించు'' అని హెచ్చరిస్తున్నట్టుంటాయి.
నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ... అన్నాడు వెనుకటికొకాయన. దాన్ని సుబ్రహ్మణ్యంగారేమో ''నవ్విస్తూ బతకాలిరా'' అని మార్చేసి కాస్త కొంటెతనం, మరికాస్త సమయస్ఫూర్తి, ఇంకాస్త చతురత జోడించి నవ్వుల నావలో మనల్ని విహరింపజేయడనికి ఈ పుస్తకాన్ని అందించారు.
- డా. ఆలమూరు సౌమ్య
