-
-
కవితా! 26
Kavitaa 26
Author: Kavita Quarterly Magazine
Publisher: Sahiti Mitrulu
Pages: 34Language: Telugu
Description
కవితా 26వ సంచిక, కవితా త్రైమాసిక పత్రిక సంచికల్లో 26వది. సాహితీ మిత్రులు , విజయవాడ వారి నిర్వహణ.
* * *
టెలిఫోన్ కాల్
మూలం: చేరన్; తెలుగు: కుప్పిలి పద్మ
మేం తెల్ల జెండాలని ఎగరవేసాం.
వాగ్దత్త సందేశం కోసం
యెదురు చూస్తున్నాం
దాని జాడే లేదు.
మెల్ల మెల్లగా
ప్రభాకరుడు వుదయిస్తున్నా
చీకట్లింకా విస్తరిస్తున్నాయి.
చివరి వూపిర్లతో
నెత్తురోడుతున్న
స్నేహితులకేసి మరోసారి చూస్తున్నాం
అనాయాస మరణాల శాంతి వారికి నిషిద్ధం.
మా శాటిలెట్ టెలిఫోన్స్ మాతోబాటే
మరుభూముల్లోకి వెళతాయి
చిట్టచివరి వరకు !
అయితే యిదే నా ఆఖరి ఫోన్ కాల్
ఇక మేం బయలుదేరాలి.
Preview download free pdf of this Telugu book is available at Kavitaa 26
telugu kavitvam antharistunna ee rojullo. ituvanti pustakaani publish chestu inka mana baashani, sahityaanni bratikistunna kavitaa brundaaniki naa abhinandanalu.