-
-
మనీప్లాంట్
Money Plant
Author: Kolluri Soma Sankar
Publisher: Kasturi Prachuranalu
Language: Telugu
'మనీప్లాంట్' లోని మరో ప్రత్యేకత ఇందులోని కథలన్నీ - వర్తమాన సమాజ జీవన దృశ్యాల సమాహారం. ఎంతో నేర్పుతో - 'ఈనాటి' జీవితాల్నీ, వ్యక్తిగత ధోరణుల్నీ, సాంఘికంగా సంక్లిష్టతలని కల్పిస్తున్న రీతి రివాజుల్నీ - ఈ కథల్లో దర్శింపజేసాడు, సోమ శంకర్. కథల ఎన్నిక - ఆ విధంగా ఎంతో చాకచక్యంగా నిర్వహించాడు.
"లుకేమియా"తో బాధపడుతున్న క్లాస్మేట్ గుండుకు తోడు సహానుభూతితో తానూ గుండు చేయించుకున్న చిన్నపిల్ల సింధు కథ 'పెరుగన్నం'తో మొదలుపెట్టి, శూన్యభట్టాచార్య పేరుతోనే సున్నాగాడుగా స్థిరపడి - జీరోగా గేలిచేయబడిన 'శూన్య' చివరికి గురువుగారి సాంత్వనలో "నేనంటే నాకెంతో గర్వంగా ఉందీ రోజు" అనుకునే స్థితికి ఎదిగిన "సున్నాగాడు" వరకూ - ఒక్కొక్క కథ ఒక్కొక్క మణిపూస.
మారిస్ బౌడిన్ జూనియర్ అనే రచయిత - కథకునికి ఆవశ్యకమైన విశిష్ట దృక్పథాన్ని గురించి రాస్తాడు ఒకచోట. అనువాద కథనే రాస్తున్నా - సోమ శంకర్లో ఈ విశిష్ట దృక్పథం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
మూల కథలోని వాతావరణాన్నీ, పరిసరాలని అవగతం చేసుకుని, మూల కథా రచయిత కంఠస్వరాన్ని గుర్తెరిగి, ఆ భాషాసౌందర్యానికి భంగం కలగకుండా, నుడికారాన్ని చెడగొట్టకుండా - అనువాదం నిర్వహించారు సోమ శంకర్.
కథకుని లక్ష్యశుద్ధీ, చిత్తశుద్ధీ - పుష్కలంగా ద్యోతకమవుతున్న గొప్ప కథా సంపుటి 'మనీప్లాంట్'. అందుకే ఇది కొని చదివి దాచుకోవాల్సిన పుస్తకం.
- విహారి (చినుకు మాసపత్రిక, ఆగస్టు 2008 సంచిక నుంచి)
ఇప్పుడే కొల్లూరి సోమశంకర్ గారు అనువాదం చేసిన మనీప్లాంట్ కదల సంపుటి చదివి ముగించాను. వజ్రంలో ఉండే వివిధ కోణాల లాగ ఈ పుస్తకంలో కధలు పదునైనవి మరియు సమాజంలోని వివిధ అంశాలను స్పృసించాయి. చిన్న చిన్న కధలను చదవాలనే ఆసక్తి, కోరిక ఉన్న వారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. కొన్ని కధలు నన్ను ఉద్వేగానికి గురిచేశాయి.
"మనీప్లాంట్" పుస్తకంపై మరో సమీక్ష ఈ లింక్ లో చదవండి.
"మనీప్లాంట్" పుస్తకంపై సమీక్షని ఈ లింక్ లో చదవండి.
Rdkumarj,
Thank you for your kind words of appreciation.
Warm Regards,
Soma Sankar Kolluri