-
-
తెలుగు వెన్నెల్లో తేనె మనసులు
Telugu Vennello Tene Manasulu
Author: Prasuna Ravindran
Publisher: Prasuna Ravindran
Pages: 134Language: Telugu
"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014"కి "ప్రసూన రవీంద్రన్" పంపిన నవల "తెలుగు వెన్నెల్లో తేనె మనసులు".
* * *
"తల్లి తండ్రుల్ని చక్కగా అమ్మా, నాన్నా అని అచ్చమైన తెలుగులో పిలవడం నేర్పించండమ్మా పిల్లలకి. మమ్మీ, డాడీ అనే పిలుపుల్లో ఎక్కడా మాధుర్యం ఉండదు." ఏ మాత్రం మొహమాటపడకుండా సూటిగా చెప్పారు తాతయ్య.
ఆ అమ్మాయి కృత్రిమంగా నవ్వేసి కొడుకుని తీసుకుని వెళిపోయిందక్కడినుంచి.
"తాతయ్యా ఈ పట్టణంలో ఎవరికీ తమ విషయంలో తల దూరిస్తే నచ్చదు. ఇక నువ్వు మంచి చెప్పినా ఎందుకు వింటారు? ఆ అమ్మాయి చూడు, నీ వయసుకైనా గౌరవం ఇవ్వకుండా సమాధానమే చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ చాలా మందికి అలా మమ్మీ, డాడీ అని పిలిపించుకోవడమే ఇష్టం." తాతయ్యకి మరింత దగ్గరగా జరుగుతూ అంది చందన.
"మంచి మాట మొహమాటపడకుండా చెప్పడంలో తప్పు లేదమ్మా. ఒకవేళ వాళ్ళు గౌరవించి వినే మనుషులైతే మనమొక విజయం సాధించినట్టే కదా. వినకపోతే మనకి పోయేదేమీ లేదు. కానీ అలా చెప్పకపోవడం వల్ల, మంచి విషయం తెలుసుకుని ఆచరించే గుణమున్న మనిషికి, ఆ అవకాశం ఇవ్వని వాళ్ళమైపోయామన్న అపరాధ భావన నాకుండదు." నవ్వుతూ అన్నారు తాతయ్య.
తాతయ్య నవ్వుని చందన ముచ్చటగా చూసింది.
మరొక రోజు ఇద్దరు పిల్లలు అక్కడే పచ్చ గడ్డిపైన కూర్చుని ఇంగ్లీషు పిల్లల కథల పుస్తకం చదువుతున్నారు. తాతయ్య వాళ్ళిద్దర్నీ దగ్గరకు పిలిచి "పిల్లలూ, మీరు తెలుగు వాళ్ళేనా" అని అడిగారు.
"ఎస్ అంకుల్" వెంటనే అన్నాడు వారిలో ఒకడు.
తాతయ్య పకపకా నవ్వుతూ "ఆ విషయం తెలుగులోనే 'అవును' అని చెప్పొచ్చుగా" అన్నారు.
ఆ పిల్లవాడు సిగ్గుపడుతున్నట్టుగా నవ్వాడు.
"నా పేరు చందన. నేను ప్రగతి స్కూల్లో అయిదవ తరగతి చదువుతున్నాను. మీరిద్దరూ ఏ పాఠశాల? ఏ తరగతి చదువుతున్నారు?" చందన తనని తాను పరిచయం చేసుకుంటూ అడిగింది.
ఈ రోజుల్లో అంతరించిపోతున్న తెలుగు భాష, దానికోసం ఒక పదేళ్ళ పాప పడే తపన ను చాలా బాగా "చదివించారు" ప్రసూన గారు. భాష అంతరించిపోతోందని బాధపడుతూ కూర్చోవటం కాకుండా, దానిని ఎలా బ్రతికించుకోవాలో చాలా చక్కటి ప్రణాళిక తో వివరించారు. ప్రతి వాళ్ళనీ ఆలొచింపచేసే కథ. ప్రాచీన హోదా కల్పించిన తెలుగు ను ప్రాచుర్యం లోనికి తెచ్చే కథ.
విదేశం లో ప్రవాసాంధ్ర పిల్లలకు తెలుగు నేర్పించే ఉపాధ్యాయురాలిగా ఈ కథ నాకు చాలా చాలా నచ్చింది. ప్రతి వాళ్ళూ తప్పక చదవాల్సిన కథ.
అనసూయ
అన్ని వయసుల వాళ్లు చదవల్సిన నవల ఇది. పెద్దవాళ్లు అర్థం చేస్కుని పిల్లలకి చిన్నపట్నుంచి తెలుగు చదవటం నేర్పలి.దేశ భషలలొ తెలుగు లెస్స అని తెలుసుకునెలగ చేయాలి. ఫిల్లలని వాళ్ళ తరువాతి తరాలకి కూడ చెప్పగలిగేల చెయాలి.