-
-
అంతిమం
Antimam
Author: Raamaa Chandramouli
Publisher: Raamaa Chandramouli
Pages: 394Language: Telugu
"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014"కి "రామా చంద్రమౌళి" పంపిన నవల "అంతిమం".
* * *
దారి కనబడడంలేదు.. కాని
దారిని సరిగ్గా గుర్తించి సరియైన దారిలోనే ప్రయానించాలిక. దూరంగా శేర్ లింగంపల్లి గుట్టలు. తుమ్మల తుప్పలు. భూమి దొంగలు తోడుకుపోగాపోగా పెద్ద బొందలు బొందలుగా మిగిలిన ఎర్రటి మొరం నేల దూరంగా కనుచూపు ఆనేంత మేర.. నేలతల్లి ఒంటి చర్మాన్ని ఎవరో ఒలిచేసి రక్తసిక్తగా మిగిల్చినట్టు.. దోపిడి. అభివృద్దిపేర గ్రామాలకు గ్రామాలే ధ్వంసమైపోతూ కాంక్రీట్ అడవి ఆక్టొపస్ వలె వ్యాపిస్తూ వ్యాపిస్తూ. ,
మనుషులు ఏమైపోతున్నారో ఎవరికీ అంతుపట్టని ఒక విషాద బీభత్స సందర్భం.
ఒకటే పరుగు. ఎడతెగని పరుగు. నిరంతరమైన పరుగు. అనంతమైన పరుగు. ఎవరికోసం ఎవరు ఎందుకు పరుగెత్తుతున్నారో తెలియని పిచ్చి పరుగు. కార్లు.. మోటార్ సైకిళ్ళు.. ఆటోలు.. బస్సులు.. మెట్రో రైళ్ళు. ఎక్కడ చూచినా జనమే ఐన చీమల పుట్టలు పగిలి వెలువడ్డట్టు జనం.. పరుగు.
దీనిపేరు అభివృద్దా.?
ఈ సహజ సంపదనంతా ఎవడికిదొరికిందివాడు పట్టుకెళ్తూ.. ఒకడు నెలకు లక్ష సంపాదిస్తూ.. మరొకడు నెలకు వేయిరూపాయలుకూడా సంపాదించలేక కూలబడ్తూ.. పరుగు. ,
ఆకలి కడుపులు ఒకచోట.. అరగని సంపద ఒకచోట.
సిస్టం ఈజ్ నాట్ ఇన్ ఈక్విలిబ్రియం.
This novel is a realistic commentary on the happenings--socio, political, economic--around and reflects how the emotional and psychological fabric of a society is changing its texture...