-
-
ఇద్దరమ్మాయిలది చెరో దారి
Iddarammayiladi Chero Dhari
Author: Suryadevara Rammohana Rao
Pages: 189Language: Telugu
శైలీష్ తండ్రి వైపు చూశాడు. తనను అపురూపంగా పెంచిన తండ్రి నిన్న అపర్ణ నోటి నుండి తన అభిప్రాయం విని ఎంత బాధపడ్డారో... ఈ వయసులో ఆయన్ని బాధించడం తన ఉద్దేశ్యం కాదు. కాని... కాని వీణను కూడా వదులుకోలేడు. వీణ కంటే అందమైన అమ్మాయిలను చూశాడు. కాని, వీణలో అందంతో పాటు ఏదో ఆకర్షణ కూడా వుంది. బహుశా ఆ ఆకర్షణ తన ఒక్కడికే కనిపిస్తుందేమో! ఏమైనా తండ్రి మనసు గాయపకుండా ఒప్పించే ప్రయత్నం చేయాలి.
''బాబు, నిన్న రాత్రి అపర్ణ చెప్పింది నిజమేనా'' అన్నారు గంభీరంగా.
''అవును నాన్నగారూ''
''శైలీష్... ఇంత వరకూ నువ్వు కోరినది కాదనలేదు... ఈ ఒక్క విషయంలోనూ నా మాటకు ఎదురు చెప్పకు. కయ్యంలోనైనా... వియ్యంలోనైనా సమాన స్థాయి వుండలి. అలా కాకపోతే వివాహ అనంతరం ఎన్ని సమస్యలు వస్తాయో నీకు తెలియదు. మన బంధువుల్లో నాకెంత తలవంపులో ఆలోచించావా...'' అని భారంగా నిట్టూర్చారు.
''నాన్నగారూ... మీకు తెలుసు. మీరు పెళ్ళి చేసుకున్నపుడు అమ్మా వాళ్ళు ధనవంతులే. కాని తరువాత ఆస్తులన్నీ పోయాయి. ఈ అంతస్తులన్నీ మనం కల్పించుకొన్న గోడలు నాన్నా. కేశవరావు గారమ్మాయి కంటే అందమైన వాళ్ళున్నారు, కాని ఎందుచేతనో ఎంత ప్రయత్నించినా నా మనసు మరలించుకోలేకపోతున్నాను'' అన్నాడు శైలీష్.
రఘుపతిగారు ఆశ్చర్యంగా చూశారు. శైలీష్ ఎంత ఎదిగిపోయాడు! తల్లి విషయం ఎత్తి తన నోరు మూయాలని చూస్తున్నాడు.
Parama chetta novel. Didn't expect this from this classic writer. Waste of time n money spent against this novel.