-
-
హోమం
Homam
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 363Language: Telugu
మాయను గుర్తుపట్టిన ఛాయలు ఆ వృద్ధురాలిలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ''పాప ఎవరమ్మా... నువ్వు అచ్చం చిన్ననాటి నా స్నేహితురాలిలాగే ఉన్నావు...?'' ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ అడిగింది ఆవిడ. మాయ ముఖంలో చిన్న మెరుపు.
''చిన్ననాటి నీ స్నేహితురాలెవరు?'' కావాలనే అడిగింది మాయ.
''రుద్రాక్ష అని...''
''ఆవిడుందా ఇప్పుడు...'' ఆసక్తిగా అడిగింది మాయ.
''లేదు... వయసులో ఉండగానే చనిపోయింది'' అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. మాయ కళ్ళు కూడ తడిదేరాయి.
''నీ పేరేంటమ్మా...?'' అని అడిగిందావిడ.
''మాయ'' అని చెప్పింది.
''అచ్చం మా రుద్రాక్షలాగే ఉన్నావమ్మా... నూటికి నూరుశాతం అలాగే ఉన్నావమ్మా... ఒక్కసారి యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లుంది. మా రుద్రాక్షకు మేనత్త కూతురివా...? మేనమామ కూతురివా...? పెద్ద నాన్న కూతురివా...? బాబాయి కూతురివా? పిన్నికూతురివా...? పెద్దమ్మ కూతురివా....?''
ఆ వయసులో ఆ వృద్ధురాలు ఉబుకుతున్న ఉద్వేగాన్ని అణచుకోలేకపోతోంది.
''కాదు...'' అంది మాయ సన్నగా నవ్వుతూ, కాని అప్పటికే ఆవిడెవరో గుర్తుపట్టింది మాయ.
''మరి నాకేం అర్థంకావటం లేదమ్మా... చెప్పమ్మా... ఎవర్నువ్వు?''
బతిమిలాడుతున్నట్లుగా అడిగిందా వృద్ధురాలు. మాయ, ఆమె చేతులు పట్టుకుంది. మృదువుగా నిమిరింది. ఇకా వృద్ధురాలిని ఉద్వేగంలో ఉంచడం మంచిది కాదనుకుంది మాయ.
''నేను... ఇప్పుడు... ఈ జన్మలో మాయని... అదిగో వాళ్ళే, నా, ఈ, జన్మ తల్లిదండ్రులు. పోయిన జన్మలో నేను రుద్రాక్షను, నీకు ఫ్రెండ్ని. నిజంగా ఇది నిజం. నువ్వన్నది నిజమే...'' అంది మాయ.
కళ్ళు తుడుచుకుంటూ... మాయ ఏం అన్నదో ముందా వృద్ధురాలికి అర్థం కాలేదు. అర్థం చేసుకోవడనికి చాలా సమయం తీసుకుంది. మాయ చెప్పింది గ్రహింపుకు రాగానే ఆవిడ కళ్ళలో ఉత్సాహం, ఉద్వేగం, ఆశ్చర్యం, ఆనందం.... నమ్మాలా వద్దా అనే మీమాంస.
Yes not bad !!! story punarjanma pondina lover kosam age aipoina thanu malli young age ki ravadaniki em chesado anna backdrop lo story nadusthundhi. Nice
Not Bad for Time Pass