• Rashtra Rajakeeya Charitra Vandella Vishleshana 1910 2010
  • fb
  • Share on Google+
  • Pin it!
 • రాష్ట్ర రాజకీయ చరిత్ర వందేళ్ళ విశ్లేషణ (1910-2010)

  Rashtra Rajakeeya Charitra Vandella Vishleshana 1910 2010

  Pages: 418
  Language: Telugu
  Rating
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  '1/5' From 2 votes.
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  '1/5' From 1 premium votes.
Description

తెలుగు వారు ఆంధ్ర తెలంగాణా కలియక పూర్వం, స్వాతంత్ర్యం రాకముందు ఎలాంటి నేపథ్యం నుండి వచ్చారు? తమిళులు, కన్నడిగులు, మళయాళీల నుండి వేరుపడిన తెలుగు వారు, జస్టిస్ పార్టీ హయాంలో ఏ విధంగా సంస్కరణలు చవిచూచారు? మరో పక్క నైజాం నిరంకుశ పాలనలో మరాఠీలు, కన్నడిగులు, తెలుగు వారితో ఎలా మసిలారు?స్వాతంత్ర్య పోరాటాలలో ఉభయ ప్రాంతాల పాత్ర ఏమిటి? ఆంధ్ర ఏర్పడిన తరువాత, హైదరాబాద్ విమోచన తరువాత అధికారానికి దగ్గరగా వచ్చిన కమ్యూనిస్టులు ఎలా జారిపోయారు? ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం సాగడమే గాని సాధించిందేమిటి?

ఆంధ్రప్రదేశ్ కోసం ఉభయ ప్రాంతాలలో ఏవిధంగా ఆక్రందించారు? వద్దన్న వారు ఏం చెప్పారు?ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండీ 25 సంవత్సరాల పాటు తిరుగులేని కాంగ్రెస్ పాలన నుండి, ఎన్.టి. రామారావు తెలుగు దేశ ప్రభంజనం ఎలా తెచ్చారు? నాదెళ్ళ భాస్కరరావు పాత్ర ఏమిటి? ప్రతిపక్షం నుండి కోలుకొని మళ్ళీ కాంగ్రెస్ ఎలా బతికి బట్టకట్టింది? వీటన్నిటి వెనుక కులరాజకీయాలు ఏ ధోరణిలో సాగాయి? పుట్టి గిట్టిన పార్టీలు, తెలంగాణ, ఆంధ్ర ఉద్యమం సాగినప్పుడు, సామాన్య ప్రజలు ఎలా (ముఠా రాజకీయాలు సరే సరి) కొరముట్టు అయ్యారు?

ఒకే ఒకసారి దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యి ఒక దళితుడికి గౌరవం దక్కించాడు. ఆ తరువాత వెనుకబడిన వారి పక్షాన అంజయ్య ముఖ్యమంత్రి అయినా, తానూ రెడ్డినే అని తన పాత్ర మార్చివేశాడు. మిగిలిన వారంతా అటు అధికారంలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ అగ్రకులాల ఆధిపత్యంలోనే కొనసాగారు. బహుశా గౌతులచ్చన్న, బండారు రత్న సభాపతి ఇందుకు మినహాయింపు కావచ్చు. తెలంగాణ నుండి ముఖ్యమంత్రులుగా నలుగురు వచ్చి కూడా ఆ ప్రాంతపు సమస్యలు తీర్చలేకపోయారు.

ప్రత్యేక రాష్ట్రం కొరకు ఉభయ ప్రాంతాలు ఉద్యమాలు చేసిన ఘట్టాలు వివరంగా సంకలనం చేయడం ఒక ఎత్తయితే, పార్టీలు చీలి పోవడము, కొత్త పార్టీలు పుట్టడం మరొక ఎత్తు. తిరుగులేని కాంగ్రెస్ పార్టీని 9 నెలలలో తొలగించి అధికారానికి వచ్చిన ఎన్‌టిరామారావును, కుట్ర ద్వారా తప్పించాలని ప్రయత్నించిన నాదెండ్ల భాస్కరరావ్ పాత్ర మరచిపోలేని మచ్చగా మిగిలింది. మరొక సారి అల్లుడు చంద్రబాబు వెన్నుపోటుకు గురై అధికారం పోగొట్టుకొన్న రామారావు అచిరకాలంలోనే కాలం చేసాడు. రాష్ట్రాన్ని హైటెక్ లోకి నడిపించిన చంద్రబాబు రైతుల్ని మరిచాడని అన్నారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చి దీవించినా ఓటమి తప్పలేదు. జార్జ్ బుష్‌ను రాజధానికి తెచ్చిన రాజశేఖరరెడ్డి, తిరుగులేని నాయకుడుగా
పరిపాలిస్తుండగా హెలికాప్టర్ పొట్టన పెట్టుకున్నది. అనుకోని ముఖ్యమంత్రిత్వం రోశయ్య మీద పడింది. మరో సారి తెలంగాణా కొరకు వుద్యమం రాగా, ఈసారి ఆంధ్రలో సమైక్య వాదంతో ముందుకు రావడం విశేషం. ఇలాంటి ఆసక్తికరమైన అంశాల చరిత్ర ఈ గ్రంథమంతా కనిపిస్తుంది. 100 ఏళ్ళ రాజకీయ చరిత్ర,పార్టీ రహితంగా పరిశీలించి, నిష్పక్షపాతంగా, శాస్త్రీయ ధోరణిలో ఈ పుస్తక రచన సాగింది.

ఇప్పుడు పాఠకులకు పరిచయం చేస్తున్నది తెలుగులో “రాష్ట్ర రాజకీయ చరిత్ర: వందేళ్ల విశ్లేషణ 1910 – 2010″. ప్రముఖ రచయిత ఇన్నయ్య గారి రాజకీయ పరిశీలనే ఈ పుస్తకం. పుస్తకం చివరలో రచయిత సంక్షిప్త జీవిత చరిత్ర, వారు వెలువరించిన ఇతర గ్రంధాల వివరాలు లభిస్తాయి. మన రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో , మన రాష్ట్ర రాజకీయ చరిత్ర తెలుసుకొనగోరేవారికి, రాజకీయ శాస్త్ర విద్యార్థులకు మరియు పాత్రికేయులకు ఇది ఒక సంప్రతింపు గ్రంథంగా ఉపయుక్తం కాగలదు.

Preview download free pdf of this Telugu book is available at Rashtra Rajakeeya Charitra Vandella Vishleshana 1910 2010
Comment(s) ...

ఈ విషయంలో ఎం వి ఆర్ శాస్త్రి రాసిన "ఆంధ్రుల కథ" మంచి పుస్తకం

ఇందులో విశ్లేషణ ఏముందో అర్ధం కాలేదు. ఇందులో కేవలం రాజకీయ నాయకుల పేర్లు ఏకరువు పెట్టారు. రచయిత చాలా చోట్ల తన అభిప్రాయాలని, ముఖ్యంగా కుల ప్రస్తావనలు తనదైన ధోరణిలో చేసుకుపోయారు.కొంచెం సేపు తర్వాత విసుగు అనిపిస్తుంది.ఇది ఏ మాత్రం చరిత్ర తెలియని వారికి ఉపయోగపడొచ్చు.కాని అది సందేహమే.ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్నా విషయాలు చాలా మంది ఎప్పుడో అప్పుడు రోజు పత్రికలలో చదివినవే.కొత్తగా ఏమి లేదు.Very poor narration,dull, insipid and lacks any objective analysis.