-
-
రాంబాబు 40 +
Rambabu Forty Plus
Author: C.S.Rayudu
Publisher: Self Published on Kinige
Pages: 245Language: Telugu
రాంబాబు... ఆర్థికంగా బాగానే స్థిరపడిన ఓ మోస్తరు అందగాడే! ఇతగాడి పెళ్ళి విషయంలో తన అమ్మ, నానమ్మల ఆప్షన్లు వ్యతిరేకంగా ఉండడం వల్ల ఏ సంబంధమూ కుదరక చివరికి నలభై ఏళ్ళు నిండి ఏజ్‌బార్ అనే నిందను తెచ్చుకున్నాడు.
ఇక తనకు పెళ్ళే కాదేమోనన్న భయంతో ఎవరో ఒకమ్మాయినైనా మనువాడాలనుకున్న రాంబాబుకు లలన కుమారి అనే ఓ అద్భుతమైన అందగత్తెను పెళ్ళాడే అదృష్టం వచ్చింది. అతగాడి సంబరం అంబరాన్ని తాకింది.
కాని... సంబంధం కుదురబోతున్న చివరి క్షణంలో పిడుగుపాటు లాంటి ఓ మిస్టరీ అతన్ని విషవలయంలా కమ్మేసింది. తత్ఫలితంగా లలన కుమారి చేజారిపోయే ప్రమాదం ఏర్పడింది.
అంతటితో వెన్ను చూపడం ఇష్టం లేని రాంబాబు, ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ మిస్టరీని ఛేదించి ఎలాగైనా లలన కుమారిని తన భార్యగా చేసుకోవాలని వీర ప్రయత్నాలు మొదలెడతాడు.
చివరి వరకూ ఎన్నో వింత మలుపులు తిరిగే ఈ కథా ప్రస్థానంలో ప్రతీ ఒక్కటీ ఎంతగానో నవ్వును తెప్పిస్తాయి.
ఆలస్యమెందుకు? పదండి నవ్వేద్దాం!
(ఇందులోని ఇతివృత్తం, పాత్రలు, సంభాషణలు అన్ని నవ్వుకునేందుకు మాత్రమే కల్పితంగా సృష్టించబడ్డాయి, ఎవరినీ కావాలని కించపరచడం కాదని అందరూ గమనించాలి).
- సి.యస్.రాయుడు
Comedy ga nadichipotundi story antha. Mystery veedaka nenu chala shock ayyanu asalu doshi evara ani. Oohinchani twist bagundi:-)