-
-
పర్యావరణ కథలు
Paryavarana Kathalu Kannada to Telugu translated stories
Author: Sakhamuru Rama Gopal
Language: Telugu
పర్యావరణ కథలు
శాఖమూరు రామగోపాల్
కథా సుషమ
ఈనాడు ఏ రచయిత అయినా పర్యావరణ ప్రభావం కానీ, పర్యావరణ స్పర్శగానీ లేకుండా రచనలు చేయలేడు. దివంగత పూర్ణచంద్ర తేజస్విగారు కన్నడంలో రచించిన ఈ కథల్ని కమనీయంగా తెలుగులోకి అనువదించారు శ్రీ శాఖమూరు రామగోపాల్గారు. కథా నవలా సాహిత్యానికి కన్నడం పెట్టింది పేరు ఒక్కొక్కరి జీవితానుభవం ఒకరకంగా ఉంటుంది. ఈ కథల్లో అంతరంగం పర్యావరణం, బహిరంగం కథావస్తువు.
శ్రీ రామగోపాల్గారు శ్రమించి ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో నిద్రాణమైన వీటిని సంపాదించి, అనువదించి తెలుగువారికి అందించారు. ఈ పదిహేను కథలు చదివితే సహజ ప్రకృతి, మానవ ప్రకృతి రెండూ మన మనఃఫలకంపై ప్రతిబింబిస్తాయి. అనువాదం అంత సులభతరమైన ప్రక్రియ కాదు. ఒక విధంగా పరకాయ ప్రవేశం లాంటిది. రామగోపాల్గారు స్వేద బిందువులని అక్షరాలుగా మలచుకొని, పదేపదే మూలాన్ని మననం చేసుకుని ఈ అనువాదాన్ని తీర్చిదిద్దారు. మంచి కథలను సముచితమైన అనువాదంగా మలచినందుకు వారికి తెలుగువారి అభినందనలు అందుతాయని నా విశ్వాసం.
- ఆచార్య ఎల్లూరి శివారెడ్డిప్రథానకార్యదర్శి
ఆంధ్ర సారస్వత పరిషత్తు
హైదరాబాద్
