-
-
స్మార్ట్ స్టోరీస్ 2013
Smart Stories 2013
Author: Smart Authors 2013
Publisher: Kinige Digital Technologies Pvt. Ltd.
Pages: 93Language: Telugu
కినిగె స్మార్ట్ స్టోరీ విజేతలను కలుసుకోండి.
* * *
ఈ పోటీ చూడగానే చాలా వుత్సాహం, చాలా ఆశ కలిగాయి. కేవలం 28 లోపు నవయువతీ యువకులే పాల్గొనే కథల పోటీ! చాలా అద్భుతాలను ఆస్వాదించవచ్చనుకున్నాను. ఆస్వాదించాను. 1960 లో డా. వివేకానందమూర్తి కథల సంపుటికి ముందు మాట రాస్తూ నండూరి రామమోహనరావు "తెలుగు కథకి ఈడొచ్చింది" అని ప్రకటించారు. ఇది యాభై ఏళ్ల నాటి మాట. అప్పటికీ యిప్పటికీ రెండు తరాలు గడిచాయి. ప్రతిభాపాటవాల స్థాయి పెరిగిన మాట నిజం. అయితే అవి సాహిత్యంలో ప్రతిఫలిస్తున్నాయా?
మంచి కథకి మెలికల మెరుపులు గాని సందేశాల గాంభీర్యం గాని అవసరం లేదని యిందులో కొన్ని కథలు తేటతెల్లం చేశాయి. కాని అర్థశతాబ్ది వ్యవధిలో కథా సాహిత్యం మగ్గవలసినంత పరిమళాలను సంతరించుకోలేదనిపించింది – ఈ పోటీలకు వచ్చిన పరిధిలో. మారిపోతున్న మానవ సంబంధాల మీద అనేక కొత్త రంగుల్ని యీ నవతరం ఆవిష్కరిస్తుందని ఎదురుచూశాను. 750 పదాలలో, పరిమితిలో వచ్చిన యీ కథలు బాగున్నాయి. చాలా కథలు చెయ్యి తిరిగిన కథకుల స్థాయిని మించి కనిపించాయి. విజేతలకు హార్దిక శుభాకాంక్షలు. మీ కృషి మిమ్మల్ని అగ్రభాగాన నిలబెడుతుంది.
~ శ్రీరమణ
మొత్తం ఎన్ని కథలు వచ్చాయో, ఎన్ని ఎంపిక చేసారో చెప్పగలరు.
Narayana Swamy
కినిగె స్మార్ట్ స్టోరీ పోటీ కథలు చదివేరా? మొదటి బహుమతి పొందిన సతీష్ పొలిశెట్టి కథ చాలా బావుంది. మిగతా కథలు కూడా ఇప్పుడు పత్రికల్లో వస్తున్న సగటు కథలకంటే ఓ మెట్టు పైనే ఉన్నై.