-
-
మోనోలాగ్ ఆఫ్ ఏ వూండెడ్ హార్ట్
Monologue of a Wounded Heart
Author: Inampudi Srilaxmi
Pages: 62Language: Telugu
Description
మోనోలాగ్ ఆఫ్ ఏ వూండెడ్ హార్ట్
దేశ చరిత్రలోనే - బ్రెస్ట్ క్యాన్సర్ మీద తొలి దీర్ఘకవిత.
సునామీ తెల్సు
భూకంపం తెల్సు
గ్రహ శకలాలు తెల్సు
అణు విస్ఫోటనం తెల్సు
కానీ
కణ విస్ఫోటనం మాత్రం కొత్తదే కదా...
* * *
అడిగితే కాని అమ్మయినా పెట్టదంటారు.
క్యాన్సర్ -
అమ్మలగన్నయమ్మ
నేనేది అడక్కుండానే
తన కణాలను
నాలో పుట్టలు పుట్టలుగా పెంచింది
* * *
ఈ స్తనాతీత దిశని
మహిళా ప్రస్థానంలో
నవయుగోదయం అని చాటి చెపుదాం
లే.. నిలబడు
ఇప్పట్నించీ
'జెండర్'గా కాదు
'జెండా'యై నడుద్దాం!
Preview download free pdf of this Telugu book is available at Monologue of a Wounded Heart
ఈ పుస్తకం రివ్యూ కినిగె పత్రికలో ఇక్కడ