-
-
ఆమ్స్టర్డాంలో అద్భుతం
Amsterdamlo Adbhutam
Author: Madhuranthakam Narendra
Publisher: Kathakokila Prachuranalu
Pages: 100Language: Telugu
స్కానింగ్ మిషను కవతలున్న టేబులుపైన ట్రేనిండా స్టీలు కత్తెరలు చచ్చిన చేప పిల్లల్లా నీల్గిపడి వున్నాయి. వాటికటు వైపున టూత్ పేస్టులూ, మందుల ట్యూబులూ, పొడవాటి బాడీస్ప్రే డబ్బాలు దిక్కులేకండా పడివున్నాయి.
చెకిన్ కివతలున్న వెయింటింగ్ పార్లర్కు వచ్చాక "యిప్పుడివేవీ తీసుకొని రాగూడదంకుల్! సెప్టెంబర్ 11 తర్వాత సెక్యూరిటీ బాగా టయిటయిపోయింది. యిదంతా బిన్ లాడెన్ మహత్యం! యిప్పుడు టూత్ పేస్టు ట్యూబుల్లో గూడా బాంబులు తయారు చేసే కెమికల్స్ పట్టుకెళ్తున్నారట!....అందుకని..." అని వివరించాడు చైతన్య.
* * *
తనకు మార్మిక సంకేతాలు అందుతున్నాయని నమ్మే వ్యక్తికి, నేడు హద్దుల్లేకుండా పెరుగుతున్న టెక్నాలజీ ప్రపంచంలో అప్రతిభుడైపోతున్న మరో వ్యక్తికీ విశాలమైన ఆమ్స్టర్డాం విమానాశ్రయంలో ఎదురైన వింత అనుభవాల హాస్యవల్లరి ఈ నవల. వాస్తవికతో సంబంధం తక్కువగా ఉంచుకొనే భారతీయ మనస్తత్వానికి రచయిత చేసిన భాష్యం ఇది. కఠిన వాస్తవికతను చిత్రిస్తునే జీవితపు చలన సూత్రాలను ఈ నవల ప్రతిభావంతంగా ఆవిష్కరిస్తుంది.
- ఆర్. వసుంధరాదేవి
* * *
ఈ నవల లోని ప్రతీ వ్యక్తీ స్థానభ్రంశం చెండినవాడే! తమ తమ స్థానాలకు తిరిగి రావడం కోసం స్థానభ్రంశమైన వ్యక్తులు ప్రయత్నించే తీరును వివరించే నేపథ్యంలో, సందర్భంలో, మతం, దాని పుట్టుక, ప్రాచుర్యం, ప్రభావం, దాని పర్యవసానాలను చక్కగా వివరించే రచన ఇది. పాఠకుడు సూక్ష్మంగా, తరచి తరచి, అణువు అణువును, మెల్లమెల్లగా, జాగ్రత్తగా, అప్రమత్తంగా చదవవలసిన నవల.
- అడ్లూరు రఘురామరాజు
రచయిత మధురాంతకం నరేంద్ర ఇంటర్వ్యూ కినిగె పత్రికలో ఇక్కడ
ఈ పుస్తకం రివ్యూ కినిగె పత్రికలో ఇక్కడ