• Beyond Coffee
  • fb
  • Share on Google+
  • Pin it!
 • బియాండ్ కాఫీ

  Beyond Coffee

  Publisher: Kavali Prachuranalu

  Pages: 158
  Language: Telugu
  Rating
  3.22 Star Rating: Recommended
  3.22 Star Rating: Recommended
  3.22 Star Rating: Recommended
  3.22 Star Rating: Recommended
  3.22 Star Rating: Recommended
  '3.22/5' From 9 votes.
  3.33 Star Rating: Recommended
  3.33 Star Rating: Recommended
  3.33 Star Rating: Recommended
  3.33 Star Rating: Recommended
  3.33 Star Rating: Recommended
  '3.33/5' From 6 premium votes.
Description

ఖదీర్‌బాబు కథల్ని చదవడానికి కష్టపడక్కర్లేదు. చదవడం మొదలుపెడితే చాలు కథే మిమ్మల్ని కడకంటా లాక్కుపోతుంది. ఇక్కడ పది కథలున్నాయి. పది కథల్లోనూ రచయిత పది రకాలుగా కనిపిస్తాడు. సైకో ఎనలిస్టుగా, సైకో థెరపిస్టుగా, రియలిస్టు పెయింటర్‌గా, ఇంప్రషనిస్టుగా, కాఫీ టేబుల్ దగ్గర కథ చెప్పే స్నేహితునిగా, పాఠకుల చేతికి చిక్కి విలవిల్లాడే బాధిత రచయితగా, మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అన్వేషిగా - ఇలా రకరకాలుగా కనిపిస్తాడు.

మూస కథలు రాయడం ఖదీర్‌బాబుకి రాదు. ఈ కథల్లో మీకు ఏమైనా దొరకచ్చుగాని డల్ మూమెంట్స్ మాత్రం మచ్చుకైనా దొరకవు. తినబోతూ రుచి అడగటమెందుకు, నా మాటలు వదిలేసి పక్కనున్న కథాస్రవంతిలో ఈదులాడండి.

- ఎ. గాంధీ, సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్

ఓ హెన్రీ, మంటోలాంటి వాళ్ళు ఏ విషయాన్నయినా కథగా రాయవచ్చునంటారు. తన సీనియర్లకన్నా అడుగు ముందుకేసి, 'ఒకటేం, పది కథలు రాస్తాన'న్నాడు ఖదీర్.

నాకర్థమైనంతవరకూ యివి ఫేబుల్స్. అంటే నీతి కథలు. పంచతంత్రమైనా, ఈసప్ కథలైనా మానవ స్వభావాలను, మంచి చెడులను allegoricalగా చెప్పినవే. విలువలన్నీ వయ్యక్తికమూ, సాపేక్షమూ అనుకుంటున్న ఈ రోజులకు యివి మోడ్రన్ ఫేబుల్స్. క్లుప్తతను మూల లక్షణంగా పాటించిన ఫేబుల్స్.

- ముక్తవరం పార్థసారథి

Preview download free pdf of this Telugu book is available at Beyond Coffee
Comment(s) ...

Please Add RENTal Option:
==================
This is my first comment and very glad commenting on this book.
I REALLY didn't read this so far; because I like to buy HARD-copy of the book. But before that I wish to read some stories on e-book version.
My request is please add RENTal option at least for Rs. 50/-(if you don't like for Rs. 30/-)

I mean I like to read some stories on RENTing e-book and order hard-book later.

Please add RENTal option as other books.
Thanking you,

Spellbound!

Excellent stories andi. Very disturbing and soul searching.

10 stories that removed desires layer by layer so one can find himself.

Meditating experience andi.

Hope to read more from you.

ప్రియమైన ఖదీర్ బాబు,
వైజాక్ నుండి వస్తూ ఇప్పుడే మీ పుస్తకం చదివాను. బియాండ్ కాఫీ. రెండు తప్ప అన్ని కథలూ మైండ్ బ్లోయింగ్. నాకు తెలిసినంతవరకూ ఆత్మ ఒంటరితనాన్ని కెలెడోస్కోపులో చూపిన తొలి రచయితవు నువ్వే.
మచ్చ సింబాలిక్ గా అప్పీలింగ్ గా ఉంది.
‘టాక్ టైమ్’ లేడీస్ కొత్త కాదు. ఫోనులో ఇబ్బంది పెడుతున్న వారిపై నేను కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ కేసులు కోర్టులో పెండిగులో ఉన్నాయి. నీ కథలు చదువుతున్నప్పుడు మెటాఫిజికల్ శూన్యం పై వ్రాసిన శామ్యూల్ బాకెట్ మరియు అతని డ్రామా వెయిటింగ్ ఫర్ గోడోట్ మదిలో మెదిలాయి. ఇంకా నేను వ్రాసిన ఆనందో బ్రహ్మ నీ వహీద్ కథ చదువుతున్నప్పుడు గుర్తు వచ్చింది. యూ హేవ్ డన్ ఏ గ్రేట్ జాబ్.
అభినందనలు.
యండమూరి.

దర్గా మిట్ట నుంచి చాల దూరం వచ్చెసారు ఖాదిర్ బాబు .జూబ్లి హిల్స్
బియాండ్ కాఫీ రెస్టారెంట్ దాకా!..రెలీజ్ అయిన వెంటనే డౌన్ లోడ్ చేసుకుని అన్ని కథ లూ చదివెసాను. ప్రైవేట్ హెల్ లేక అర్బన్ ఖవాస్ ని చక్కటి
కధా శిల్పం తొ ఆవిష్కరించారు.బియాండ్ కాఫీ అన్నిటి కంటే నచ్చిన కథ.అతని శైలీ కథనం హాయి గా అల్ట్రా మొడెర్న్ గా ఉంది.నగర జీవితం లొ వ్యక్యిగత నరకం అనుభవించడాని కి ధనము సంపద తొ సంబందం
లేదు. మొదటి కథ aasthi కూడా చాలా బావుంది.చదవండి!

బియాండ్ కాఫీలో బియాండ్ కాఫీ అన్నిటికంటే నచ్చిన, బాగా గుర్తుండిపోయే కథ. స్పైన్ చిల్లింగ్ సైకో థ్రిల్లర్ రంగులో వేసిన నగర జీవితపు వాస్తవిక జీవన చిత్రం. వెతికితే మన చుట్టూ ఇలాంటి కథలెన్నో. విస్మరించడం కేవలం మనలోని ఎస్కేపిజం లేక గుడ్డితనం వల్ల. వహీద్ చాలా నిజాయితీగా రాసిన కథ అని అర్థమవడానికి అట్టే శ్రమ పడక్కర్లేదు. ఆస్తి, ఘటన కూడా బాగా నచ్చాయి. ఖదీర్ బాబు గారికి అభినందనలు.

ఈ కథల గురించి మొట్టమొదట చెప్పుకోవలసిన విషయం ఏంటంటె ఇవి ఎంత త్వరగ పాఠకుడి దృష్టిని ఆకట్టుకుంటాయొ. నేను ఖదీర్ బాబు గారి గురించి విన్నాను కానీ ఆయన రచనలు నాకు ఈ పుస్తకంతోనె పరిచయం. ప్రతీ కథ మొదటి వాఖ్యం నుండె కట్టిపడేస్తుంది. దాదాపుగ అన్ని కథలు vignettes ఎ కావడంతొ, వాటిలొ ఒక రకమయిన urgency స్వాభావికంగానె ఏర్పడిపొతుంది. పుస్తకంలోని ప్రతీ కథ నాగరిక సమాజంలోని స్త్రీ-పురుష సంబంధాలమీద, వాటి changing dynamics మీద, కావలసిన దానికోసం రాజీ- మనల్ని మనం రుజువు చేసుకోవలనె ఈగొ కి మధ్య జరిగె సంఘర్షన మీద, లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా బయట మొహానికి మాత్రం రంగెసేసుకుని కృత్రిమ నవ్వులు మొహానికి అతికేసుకొని తిరగవలిసొచ్చె మన సమాజం మీద వ్యాఖ్య చేస్తాయి.

ఆయన చెప్పదలుచుకున్న విషయాలు సమయోచితమయినా, ఆయన రేకెత్తదలుచుకున్న ఆలోచనలు చాలా ఆసక్తికరమైనవైనా, కథా నిర్మాణం చాలా obtuse గా ఉన్నందు వలన, కథలు చాలా చిన్నవిగా ఉండి ఎటువంటి స్పష్టతయిన వచ్చే లోపె ముగియడం వల్ల కొంచెం అసంతృప్తి మిగిలింగి.

ఖదీర్ గారి tempo బగుంది, ఆయన subjects గా ఎన్నుకొనె కొన్ని పాత్రలు కాశీభట్లగారిని తలపించాయి. నాకు నచ్చింది, ఆలొచింప చేసింది.

Awesome..!!!All stories.. Eeragadeesadu!!!

Start lo... "PEDDAGAEM LEDU ANNADU" ... Kaani.. Chaala.. Rasaadu...!!! Chadivina daani kanna... chaala chaala akkuva aalochanalu vachela... !!! anno vidhaluga... ardhamayyela!!! chivariki mind blank.. ayyelaaa!!!

Hats off..!!

After yendamuri "ANTHARMUKHAM" this is the best and best book in that way. your earlier book "DARGAMITTA KATHALU" also very good. keep it up and we need more different books from you. any how 'CONGRATS' to provide great experience through your "BEYOND COFFEE",this book contains FACTS of society. Thank you.