-
-
మన ప్రాచీనుల ఆహారం, ఆరోగ్యం, వైద్యం
Mana Praacheenula Aahaaram Aarogyam Vaidyam
Author: Muthevi Ravindranath
Publisher: Vignana Vedika
Pages: 46Language: Telugu
‘మన ప్రాచీనుల ఆహారం, ఆరోగ్యం, వైద్యం’ అనే ఈ చిన్న పుస్తకంలో రవీంద్రనాథ్ ప్రాచీన సాహిత్యం ఆధారంగా మానవుల ఆహారపుటలవాట్లు ఎలా క్రమపరిణామం చెందుతూ వచ్చాయో ఉటంకించడమేకాక వారు తీసుకునే వివిధ రకాల ఆహారం, పానీయం, వాటి పోషక, ఔషధ విలువలు, దీర్ఘ కాలం ఆరోగ్యంగా జీవించడానికి రూపొందించుకున్న ఆరోగ్య సూత్రాలు, చికిత్సాపద్ధతులు స్థూలంగా వివరించారు.
మనకు అందుబాటులో ఉన్న ప్రాచీన సాహిత్యం వివిధ ప్రాంతాల కవుల గంటాలనుండి జాలువారినది. ఆనాటి పరిస్థితులనుబట్టీ, వారు నివసించే ప్రదేశాలనుబట్టీ ఆ యా కవుల వృక్ష నామ పరిజ్ఞానం, వనౌషధీ పరిజ్ఞానం ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. ఒకే మొక్కకు అనేక ప్రాంతీయ నామాలు ఉండడం సర్వసాధారణం. అలాగే, మొక్కల జాతులు వేరైనా, అవి ఒకే పేరుతో పిలువబడుతున్న విషయమూ మనకు తెలుసు. అలాంటి గందరగోళంనుండి పాఠకుల్ని కాపాడడానికి రవీంద్రనాథ్ తన పరిశీలన, పరిశోధనా పాటవాలను కలగలిపి, అనేక వివరణలను జోడించి, అక్కడక్కడ అనుమాన నివృత్తికై శాస్త్రీయ (లాటిన్) నామాలను కూడా పొందుపరచి రాసిన అమూల్య గ్రంథం ఇది.
సశాస్త్రీయమైన ఇంత చక్కని చిట్టి పొత్తాన్ని మనకందించిన రవీంద్రనాథ్ను అభినందిస్తున్నాను.
- కొప్పుల హేమాద్రి
