-
-
బైరాగి
Bhairagi
Author: Madhubabu
Publisher: Sri Srinivasa Publications
Language: Telugu
ఆర్ముగం ఫ్రెండ్ ఇచ్చిన నోట్లను జేబులో పెట్టుకుని హుషారుగా బిల్డింగ్ బయటికి వచ్చాడు. వేగంగా అడుగులు వేసి రోడ్డును క్రాస్ చేస్తుండగా అతని దారికి అడ్డం వచ్చారు నలుగురు దృఢకాయులు.
ప్రతిరోజూ జిమ్‌కి వెళ్ళి గంటలు తరబడి వ్యాయామం చేస్తున్నారు కాబోలు, కండలు తిరిగి వున్నాయి వారి శరీరాలు. దువ్వుకోకుండా ఊరికే వదిలేయడం ఫ్యాషన్ అయినట్టు, చెల్లాచెదరుగా ముఖం మీదపడుతోంది జుట్టు.
“నటేశం దగ్గిరికి పోయి వస్తున్నావా?” ముందుకు పోనీయకుండా చెయ్య అడ్డం పెట్టి రవిబాబును ఆపుతూ అడిగాడు వారిలో ఒకతను.
నటేశం అంటే ఆర్ముగం ఫ్రెండ్. తనకు పనితో పాటు అడ్వాన్సు కూడా ఇచ్చిన పెద్దమనిషి. అతని ఔదార్యాన్ని తలుచుకుంటూ తల ఊపాడు రవిబాబు.
“ఎక్కడినించో వచ్చాడు. ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగిన మమ్మల్ని కాదని దందాలు చేస్తున్నాడు. ఈ ఏరియాలో కాంట్రాక్టు పనులన్నీ మావే.. బయటివాళ్ళు చేయకూడదు... వాడు నీకు ఎంతిచ్చాడు?” దురుసుగా అడిగాడు వారిలో రెండో మనిషి.
ఆర్ముగం ఫోన్ చెయ్యగానే, అతని ఫ్రెండ్ తనకి పని ఇవ్వడమే కాకుండా, అడ్వాన్సు ఇవ్వడంలో ఏదో మతలబు వుందని వెంటనే అర్థం అయింది రవిబాబుకి.
......................
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.